
మన టాలీవుడ్ లో చిరంజీవి మరియు బాలకృష్ణ కి ఎలాంటి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఇండస్ట్రీ లో టాప్ 2 హీరోలుగా కొనసాగిన ఈ ఇద్దరు హీరోల మధ్య బాక్స్ ఆఫీస్ వార్ ఒక్క రేంజ్ లో ఉండేది..వీళ్లిద్దరి హీరోల అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తె భగ్గుమనే రేంజ్ లో పోట్లాటలు ఉంటాయి కానీ ఈ హీరోలిద్దరు సొంత అన్నదమ్ములు లాగ కలిసి మెలిసి ఉంటారు..చిరంజీవి మరియు బాలకృష్ణ అనేక సందర్బాలలో ఒక్కరిని ఒక్కరు సొంత సోదరులు లాగ భావిస్తాము అని బహిరంగంగానే చెప్పుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి..చిరంజీవి వ్యక్తిగతంగా ఏ సహాయం కావాలన్నా బాలయ్య బాబు ముందు ఉంటాడు..అలానే చిరంజీవి కూడా బాలయ్య కి సహాయం అవసరం అయినప్పుడల్లా ముందుకొస్తాడు..అలా వీళ్లిద్దరి మధ్య జరిగిన ఒక్క సంఘటన చాలా కాలం తర్వాత సోషల్ మీడియా లో బయటపడి తెగ వైరల్ గా మారింది..అదేమిటో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.
ఇక అసలు విషయానికి వస్తే 1990 వ సంవత్సరం లో నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన నారి నారి నడుమ మురారి అనే సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..మాస్ ఇమేజి ఉన్న బాలయ్య లాంటి స్టార్ ఒక్క ఫైట్ కూడా లేకుండా ఈ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టడం విశేషం..ఇది పక్కన పెడితే ఈ సినిమాలో కనిపించే ఇల్లు మరెవరిదో కాదు.. అది స్వయానా మెగాస్టార్ చిరంజీవి గారి గెస్ట్ హౌస్ అట..చెన్నై లోని వెలచేరి ప్రాంతం లో మెగాస్టార్ చిరంజీవి కి ఒక్క గెస్ట్ హౌస్ ఉంది..అక్కడ ఈ సినిమా షూటింగ్ చేసుకోవడానికి చిరంజీవి ని కోరగా ఆయన వెంటనే అంగీకరించాడు అట..అంతే కాకుండా ఈ గెస్ట్ హౌస్ పక్కనే చిరంజీవి కి 2 ఎకరాల స్థలం కూడా ఉంది..ఈ సినిమాలో హీరో బాలయ్య పాత్ర పూరి గుడిసె లో ఉండే సన్నివేశాలు ఈ స్థలంలోనే నిర్మించారు.
తన సోదరసమానుడు అయినా నందమూరి బాలకృష్ణ సినిమా కావడం, అంతే కాకుండా ఈ చిత్ర దర్శకుడు కోదండ రామి రెడ్డి చిరంజీవి కి ఎంతో సన్నిహితుడు అవ్వడం వల్ల ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తన ఇంటిని షూటింగ్ కోసం వాడుకునేందుకు అనుమతిని ఇచ్చాడు అట చిరంజీవి..ఈ చిత్ర దర్శకుడు కోదండ రామి రెడ్డి మెగాస్టార్ చిరంజీవి తో ఏకంగా 23 సూపర్ హిట్ సినిమాలు తీసిన సంగతి మన అందరికి తెలిసిందే..దాని వల్ల వీళిద్దరి మధ్య ఎంతో సన్నిహిత్య సంబంధం ఏర్పడింది..ఆ చనువు తోనే చిరంజీవిని షూటింగ్ కోసం ఇల్లు ని అడిగారు కోదండ రామి రెడ్డి గారు..అలా చిరంజీవి మరియు బాలయ్య మధ్య జరిగిన ఈ చిన్న సంఘటన చాలా కాలం తర్వాత సోషల్ మీడియా లో వెలుగులోకి వచ్చి వైరల్ గా మారింది.