Home Entertainment చరిత్ర సృష్టించిన #RRR మొదటి రోజు వసూళ్లు

చరిత్ర సృష్టించిన #RRR మొదటి రోజు వసూళ్లు

0 second read
0
0
603

యావత్తు సినీ అభిమానులు ఎంతో కాలం నుండి ఆతృతగా ఎదురు చూసిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ఎట్టకేలకు ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు ఘనంగా విడుదల అయినా సంగతి మన అందరికి తెలిసిందే, భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సినిమా మొదటి ఆట నుండే ఆ అంచనాలను అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని కైవసం చేసుకుంది, దీనితో ఈ సినిమాకి ఓపెనింగ్స్ కనివిని ఎరుగని రేంజ్ లో వచ్చాయి అనే చెప్పాలి, రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కి ఉన్న విపరీతమైన మాస్ ఫ్యాన్ బేస్ వల్ల తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా ఓపెనింగ్స్ కుమ్మేస్తాది అని అందరూ ఊహించారు కానీ, హిందీ తమిళం మరియు కన్నడ బాషలలో కూడా అదే స్థాయిలో ఆయనింగ్స్ సాధిస్తుంది అని మాత్రం ఎవ్వరు ఊహించలేదు,తొలుత హిందీ మరియు తమిళం లో అడ్వాన్స్ బుకింగ్స్ కాస్త స్లో గా ప్రారంభం అయ్యింది, దీనితో అభిమానులు హిందీ లో ఆశించిన స్థాయి ఓపెనింగ్స్ రావు ఏమో అని భయపడ్డారు, కానీ రాజమౌళి బ్రాండ్ ఈ సినిమాకి ఇతర రాష్ట్రాలలో ఒక్క రేంజ్ లో కలిసి వచ్చింది అనే చెప్పాలి, ఒక్కసారి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఎంత వసూళ్లు సాధించిందో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ దగ్గర నుండే అద్భుతమైన ట్రెండ్ ని కనబరించింది అనే చెప్పాలి , ముఖ్యంగా హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ లో దాదాపుగా 15 కోట్ల రుపాయిల గ్రాస్ ని వసూలు చేసింది,ఇది ఒక్క ఆల్ టైం రికార్డు అని చెప్పొచ్చు, గతం లో పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాకి దాదాపుగా ఆరు కోట్ల 50 లక్షలకు పైగా గ్రాస్ వసూలు చేసింది, ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఆ మార్కుని దాదాపుగా డబుల్ మార్జిన్ తో అధిగమించి సెన్సేషన్ సృష్టించింది,మొదటి రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 80 నుండి 90 కోట్ల రూపాయిల షేర్ వసూలు చేసే అవకాశం ఉంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం, ఈ రికార్డు ని కొట్టాలి అంటే మళ్ళీ రాజమౌళి సినిమా రావాల్సిందే అని ట్రేడ్ వర్గాల అంచనా, ఇక ఓవర్సీస్ లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, కేవలం ప్రీమియర్స్ నుండే దాదాపుగా 3 మిలియన్ డాలర్స్ వసూలు చేసి ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు సృష్టించింది, ఫుల్ రన్ లో కూడా ఇక్కడ ఆల్ టైం రికార్డు సృష్టించే అవకాశాలు మెండుగా ఉన్నాయి అని ట్రేడ్ వర్గాల అంచనా.

ఇక ఈ సినిమా హిందీ లో కూడా అద్భుతమైన వసూళ్లను రాబట్టింది అనే చెప్పాలి, అందరి అంచనాలను దాటి ఈ సినిమా ఇక్కడ మొదటి రోజు దాదాపుగా 20 కొలత రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది తెలుస్తుంది, హిందీ లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలి అంటే దాదాపుగా 300 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు రావాలి,ఈ సినిమా వీకెండ్ కి 60 కోట్ల రూపాయిల నెట్, మొదటి వారం లో 150 కోట్ల రుపాయిలకు పైగా నెట్ వసూలు చేసే అవకాశం ఉంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం,మౌత్ టాక్ గట్టిగ ఉంది కాబట్టి ఈ సినిమా కచ్చితంగా హిందీ లో కూడా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది, ఇక తమిళం లో కూడా ఈ సినిమా మొదటి రోజు 10 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉంది అట, ఇలా మొత్తం మీద ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు దాదాపుగా 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్, 150 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది, ఈ సినిమా బడ్జెట్ 500 కోట్ల రూపాయిలు అవ్వగా కేవలం మొదటి రోజులోనే 150 కోట్లకి పైగా షేర్ ని వసూలు చెయ్యడం అంటే మాములు విషయం కాదు అనే చెప్పాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ మూవీ రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీకోసం

మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై…