
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మగధీర తర్వాత ఎన్నో అంచనాలతో రిలీజ్ అయినా ‘ఆరంజ్ ‘ సినిమా అప్పడు మ్యూజికల్ గా పెద్ద హిట్ అయినప్పటికీ ,అప్పట్లో ఉన్న యూత్ కి ఈ సినిమా అంతగా నచ్చలేదు ,దానికి తోడు మగధీర లాంటి ఆల్ టైం ఇండస్ట్రీ కొట్టిన రామ్ చరణ్ ని ఒక అమ్మాయి చుట్టూ తిరిగే లవర్ బాయ్ క్యారక్టర్ లో జనాలు ఒప్పుకోలేక పోయారు ,దాంతో ఈ సినిమా పెద్ద డిజాస్టర్ గా నిలిచింది, 27 మార్చ్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్బంగా తన బ్లాక్ బస్టర్ హిట్ అయినా మగధీర ని రీ రిలీజ్ చేయాలి అనుకున్నారు ,కానీ కొన్ని సాంకేతికమైన కారణాల వలన రిలీజ్ చేయలేకపోయారు.
అయితే ఇప్పటి యూత్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుని ,కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ గా మారిన అప్పటి డిజాస్టర్ ‘ఆరంజ్ ‘ మూవీ ని రీ రిలీజ్ చేసారు.RRR సినిమా తో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న రామ్ చరణ్ కి తన సినిమా ల లో ఎంతో ఇష్టమైన సినిమా కూడా ‘ఆరంజ్’ ఏ అని చాల సందర్భాల లో చెప్పారు.ఈ చిత్ర నిర్మాత అయినా నాగబాబు గారు ఆరంజ్ సినిమా ని అత్యధికంగా 150 పైన థియేటర్ ల లో రీ రిలీజ్ చేసారు , ఈ సినిమా కి వచ్చిన కలెక్షన్ మొత్తాన్ని ‘జనసేన ‘ పార్టీ కి ఫండ్ గా ఇవ్వనునట్లు తెలియచేసారు.
ఈ మధ్య కాలం లో రీ రిలీజ్ అయినా సినిమా ల లో అన్ని సినిమా లు కూడా మంచి కలెక్షన్ రాబట్టాయి, అందులో ముఖ్యం గా పవన్ కళ్యాణ్ గారి ఖుషి ,జల్సా సినిమా లు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన రీ రిలీజ్ జాబితా లో ఉన్నాయి, తరువాతి స్థానం లో సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఒక్కడు ,పోకిరి సినిమా లు ఉన్నాయి. అయితే ఆ సినిమా లు బ్లాక్ బస్టర్ హిట్లు ,మరి రామ్ చరణ్ గారి డిజాస్టర్ మూవీ అయినా ‘ఆరంజ్ ‘ సినిమా ఆ సినిమా కలెక్షన్స్ ని బ్రేక్ చేసిందో లేదో చూద్దాం ??
ఆరంజ్ సినిమా ని మొదట కొన్ని థియేటర్ ల లో మాత్రమే స్పెషల్ షోస్ కింద రిలీజ్ చేసారు అభిమానుల డిమాండ్ మేరకు తర్వాత థియేటర్ ల ను పెంచారు , ఎక్స్ట్రా షో ల ను కూడా వేస్తున్నారు.అయితే ఇప్పటి వరకు 25 ,26 వీకెండ్స్ కావడం తో ఆరంజ్ సినిమా కి దుమ్ము రేపే కలెక్షన్ లు వచ్చాయి ,ఆశ్చర్యం ఏంటి అంటే 27 వర్కింగ్ డే అయినప్పటికీ కూడా కొన్ని ఏరియా ల లో హౌస్ ఫుల్ అవుతుండటం.మన తెలుగు రాష్ట్ర ల లో ఆరంజ్ సినిమా మొదటి రోజు కోటి 62 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది, అయితే అప్పటి వరకు ఉన్న రికార్డు కలెక్షన్ అయినా ‘ఖుషి’ సినిమా రికార్డు ని మాత్రం బ్రేక్ చేయలేక పోయింది.ఖుషి మొదటి రోజు తెలుగు రాష్ట్ర ల లో 3 .62 కోట్ల రూపాయల షేర్ ని సాధించి టాప్ ప్లేస్ లో ఉంది,ఇక తర్వాత స్థానం లో జల్సా ‘2 .57 ‘ కోట్ల రూపాయల తో రెండవ స్థానం లో ఉంది.కానీ హైదరాబాద్ లోని కొన్ని ఏరియా ల లో ఖుషి సినిమా రీ రిలీజ్ కలెక్షన్స్ ని ఆరంజ్ సినిమా బ్రేక్ చేయడం రికార్డు ,అందులో RTC X రోడ్స్ లో ఉన్న సంధ్య 35mm లో మొదటి రోజు 17 .34 లక్ష లు కలెక్ట్ చేసి ఖుషి ని బ్రేక్ చేసింది.
ఇక ఓవర్ ఆల్ గా రీ రిలీజ్ అయినా సినిమా ల లో మొదటి రోజు కలెక్షన్ జాబితా చూస్తే మొదటి 5 స్దాన ల లో
ఖుషి 3 .62 కోట్లు
జల్సా 2 .57 కోట్లు
ఒక్కడు 1 .90 కోట్లు
ఆరంజ్ 1 .62 కోట్లు
పోకిరి 1 .52 కోట్లు