
గత రెండు మూడు రోజుల నుండి సోషల్ మీడియా లో ఒక వీడియో తెగ వైరల్ గా మారిపోయింది..బంధాలు మరియు అనుబంధాలకు విలువ తగ్గిపోతున్న ఈరోజుల్లో ఒక కొడుకు తన చెల్లి మీద మరియు తన తండ్రి మీద చూపించిన ప్రేమ చిరస్థాయిగా గుర్తిండుయిపొయ్యేలా చేసింది..చిన్నప్పటి నుండి తనని అల్లారు ముద్దుగా పెంచుకొని అంతు లేని ప్రేమని అందించి అష్టఐశ్వర్యాలు అందించిన తండ్రి దురదృష్టపుశాతం అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోయాడు..ఇటీవలే ఆయన కూతురు కి బంగారం లాంటి పెళ్లి సంబంధం కుదిరినా ఆ అమ్మాయికి తాను ఎంతగానో అభిమానించే దైవం తో సమానమైన తన తండ్రి లేదే అనే బాధ ఆమెని రోజు కుమిలిపోయేలా చేసేది..ఎంత ప్రయత్నం చేసిన ఆమెని ఈ బాధ నుండి కుటుంబ సభ్యులెవ్వరు కూడా బయటకి తీసుకొని రాలేకపోయారు..చివరికి పెళ్లి చేసుకునే రోజు రానే వచ్చింది..తన తండ్రి లేకుండానే ఈ పెళ్లి చేసుకోవాలనే నిజాన్ని దిగమింగి పెళ్లి బట్టలు వేసుకొని మండపానికి వచ్చింది..బందు మిత్రులు మరియు విశిష్ట అతిధుల సమక్షం లో మంగళ వాయిద్యాలతో పెళ్లి మండపం కళకళలాడిపోతుంది.
అందరూ పెళ్లి సంబరాలలో మునిగిపోయి ఉంటె పెళ్లి కూతురు మాత్రం విచార వదనం తో మండపం లో కూర్చొని ఉంది..అక్కడకి వచ్చిన చాలా మందిలో ‘ఏంటి పెళ్లి కూతురు ఇంత డల్ గా ఉంది..పెళ్లి ఇష్టం లేదా’ అని గుసగుసలాడుకున్నారు..సరిగ్గా అలాంటి సమయం లో వీల్ చైర్ మీద తన తండ్రి వస్తూ ఉన్నాడు..బందు మిత్రులందరూ ఒక్కసారిగా షాక్ కి గురైయ్యారు..చనిపోయిన వ్యక్తి ఎలా బ్రతికి తిరిగి వచ్చాడని..అసలు ఇది ఎలా సాధ్యమని అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు..ఇక పెళ్లి కూతురైతే అందరిలా ఆశ్చర్యానికి గురి అవ్వకుండా తన తండ్రిని చూసిన వెంటనే నాన్న అని గట్టిగ అరిచి సంతోషం తో ఆయనని గట్టిగా హత్తుకొని ముద్దులు పెట్టుకుంది పెళ్లి కూతురు..అలా తన తండ్రి సమక్షం లోనే పెళ్లి అంగరంగ వైభవం గా జరిపించుకొని ఇప్పుడు రెండు తెలుగు ర్తాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది..ఇంతకీ చనిపోయిన ఆ తండ్రి పెళ్ళికి ఎలా హాజరయ్యాడు..అసలు ఎలా సాధ్యం..కహానీలు చెప్తున్నాడా అని మీరంతా అనుకోవచ్చు..కానీ అసలు విషయం ఏమిటో ఇప్పుడు మీరు చూడబోతున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే పెళ్లికూతురు అన్నయ్య కి తండ్రి అంటే ఎంత ఇష్టమో మొదటి నుండి తెలుసు..తన పెళ్లి ని తన తండ్రి చేతుల మీద ఘనంగా జరిపించాలని కోరుకుంటూ ఉండేది..కానీ ఆ తండ్రి లేకపోతే తన చెల్లి ఎంత మనస్తాపానికి గురి అవుతుందో ముందుగానే గమనించాడు..అందుకు తన తండ్రి పోలికలతో అచ్చు గుద్దినట్టు ఒక మైనపు బొమ్మని తయారు చేయించి పెళ్లి మండపానికి తీసుకొచ్చాడు..ఆ మైనపు బొమ్మని చూసిన తర్వాత ఆ కుటుంబ సబ్యులకు ఆయన మన మధ్య లేడు అనే భావనే కలుగలేదు..అంగరంగ వైభవంగా తన తండ్రి సమక్షం లోనే పెళ్లి జరుపుకున్నాను అనే తృప్తి పెళ్లి కూతురుకి కలిగింది..ఆ తర్వాత ఆనందం గా తన అత్తారింటికి ప్రయాణమైంది..తన చెల్లి బాధని ముందుగానే పసిగట్టి ఈ అన్నయ్య చేసిన ఈ పనికి సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది..సోషల్ మీడియా లో ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ సంఘటన గురించే మాట్లాడుకుంటున్నారు..ప్రేమాభిమానాలకు అద్దం పట్టేలా ఉన్న ఈ సంఘటన ని ఫాథర్స్ డే సందర్భంగా మీ అందరికి అందిస్తున్నాము.