
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రెబెల్ స్టార్ గా ఎన్నో సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ లో హీరో గా నటించి అశేష ప్రజాభిమానం చూరగొన్న కృష్ణం రాజు గారు ఈరోజు ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన ఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులు మరియు అభిమానులకు ఇది చాలా కష్టసమయం..ఎప్పుడు నవ్వుతు సరదాగా ఉండే ప్రభాస్ ఈరోజు మొత్తం కృష్ణం రాజు గారి ఇంట్లో ఏడుస్తూ కనపడడం చూసి అభిమానులు తట్టుకోలేకపోయారు..ఇండస్ట్రీ లో ఉన్న ఎంతో మంది ప్రముఖులు మరియు రాజకీయ నాయకులూ సైతం కృష్ణంరాజు గారి మరణ వార్త విని శోకసంద్రం లో మునిగిపోయారు..నిన్న మొన్నటి వరుకు మీడియా ముందు కనిపిస్తూ నవ్వుతు కనిపించిన కృష్ణం రాజు గారికి అకస్మాతుగా ఇలా జరగడం ఏమిటి అని అభిమానులు వాపోతున్నారు..ఇక ప్రభాస్ సన్నిహితులైతే ప్రభాస్ ని అలా ఏడుస్తూ ఉండడం చూసి చలించిపోయారు..వారిలో హీరో గోపీచంద్ కూడా ఒకరు.
హీరో గోపీచంద్ ప్రభాస్ కి ఎంత మంచి బెస్ట్ ఫ్రెండ్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..వర్షం సినిమా అప్పుడు ఏర్పడిన వీళ్లిద్దరి మధ్య స్నేహం ఇప్పటికి కొనసాగుతూనే ఉంది..ప్రభాస్ కోసం గోపీచంద్..గోపీచంద్ కోసం ప్రభాస్ ఏమి చేయడానికైనా వెనకాడరు..ఈరోజు కృష్ణంరాజు గారి పార్థివ దేహాన్ని చివరిసారి చూసుకుందాం అని వచ్చిన గోపీచంద్ ని చూసి ప్రభాస్ వెక్కి వెక్కి ఏడ్చేశాడు..ఇష్టమైన వాళ్ళు ఎదురు పడినప్పుడు సంతోషమైన బాధైనా చూపించకుండా ఆపలేము అని అంటూ ఉంటారు పెద్దలు..ఇప్పుడు ప్రభాస్ విషయం లో కూడా అదే జరిగింది..అప్పటి వరుకు కుటుంబ సభ్యులను ఓదారుస్తూ ఏడుపు ని ఆపుకొని ధైర్యం చెప్తూ వచ్చిన ప్రభాస్ తన వెస్ట్ ఫ్రెండ్ ని చూడగానే ఏడుపు ఆపుకోలేకపొయ్యాడు..ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..ఇప్పటి వరుకు మనం ప్రభాస్ ని నవ్వుతు అందరిని నవ్విస్తూ ఉండడమే మనం చూసాము..కానీ ఇలా గుండెలు పగిలేలా ఏడుస్తూ చూడడం ఇదే తొలిసారి..ఇలాంటి సందర్భం మరోసారి ఆయనకీ రాకూడదు అని దేవుడికి ప్రార్థిద్దాము.
కృష్ణం రాజు గారు గత కొంతకాలం నుండి అస్వస్థతో బాధపడుతూనే ఉన్నారు..ఇందుకోసం ఆయన చికిత్స కూడా తరుచు చేయించుకుంటూ ఉన్నారు..అలా మెల్లిగా కోలుకుంటున్న సమయం లో నిన్న పరిస్థితి కాస్త తీవ్రం అవ్వడం తో ఆసుపత్రిలో చేరారు..మళ్ళీ తిరిగి వస్తారు అనే అభిమానులు మరియు కుటుంబ సభ్యులు అనుకున్నారు కానీ, ఆయన తిరిగి రాని లోకాలకు ప్రయాణం అవుతాడని మాత్రం ఎవ్వరు ఊహించలేకపోయారు..చిలకా గోరింక అనే సినిమాతో ప్రారంభం అయినా కృష్ణం రాజు గారి సినీ కెరీర్ సుమారు 300 సినిమాల వరుకు కొనసాగింది..ఆయన చివరిసారిగా వెండితెర మీద కనిపించిన సినిమా ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన రాధే శ్యామ్ చిత్రం..ఆయన చివరి సినిమా ప్రభాస్ తో కలిసి కనిపించడం యాదృచ్చికమే అయినా ప్రభాస్ అభిమానులకు మాత్రం అది చిరకాలం గుర్తుండిపోయ్యే జ్ఞాపకం గా చెప్పుకోవచ్చు..ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతిని కోరుకోవాలి మనస్ఫూర్తిగా ఆ భగవంతుడికి ప్రార్థన చేద్దాము.