
సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ని ఒక రేంజ్ లో ఊపేసిన స్టార్ హీరోయిన్ ఎవరు అంటే మన అందరికి గుర్తుకు వచ్చే పేరు అనుష్క శెట్టి.అక్కినేని నాగార్జున హీరో గా నటించిన సూపర్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా అనుష్క అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.ఇక ఆ తర్వాత కోడి రామకృష్ణ తెరకెక్కించిన అరుంధతి సినిమా ద్వారా ఆమె సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ మారిపోయింది.ఈ సినిమా తర్వాత ఆమె కొంతమంది స్టార్ హీరోల మార్కెట్ కి సరిసమానం గా తనకంటూ ఒక మార్కెట్ ఏర్పర్చుకుంది.ఇక ఆ తర్వాత బాహుబలి సినిమా తో పాన్ వరల్డ్ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న అనుష్క, ఆ తర్వాత భాగమతి సినిమా చేసి 40 కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టింది.ఇక అదే ఈమె ఆఖరి చిత్రం అనుకోవచ్చు.
ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆమె వెండితెర పై కనిపించలేదు.ఓటీటీ కోసం ఆమె చేసిన ‘నిశబ్దం’ అనే చిత్రానికి వరస్ట్ రెస్పాన్స్ వచ్చింది.ఆ సినిమా తర్వాత నవీన్ పోలిశెట్టి తో కలిసి యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమా ఒప్పుకొని కొంతమేరకు షూటింగ్ చేసింది కానీ, ఆ సినిమా మిగిలిన షూటింగ్ ఎప్పుడు పూర్తి చేస్తుందో ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న.అయితే ఈమె చాలా కాలం తర్వాత ఒక పెళ్లి ఫంక్షన్ లో దర్శనమిచ్చింది.జీరో సైజు తో కుర్రాళ్ళ మతిని పోగొట్టిన చరిత్ర ఉన్న అనుష్క,అలా లావు గా గుర్తు పట్టలేని విధంగా మారిపోవడం తో ఇక ఈమె సినిమా కెరీర్ ముగిసినట్టేనా అనే అనుమానం రాక తప్పదు.ఆమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని చూస్తే అసలు ఈమె అనుష్కనేనా అనే అనుమానం రాక తప్పదు.ఆమె ఫోటోలు కొన్ని క్రింద అందిస్తున్నాము చూడండి.
సన్నగా చువ్వలాగా ఉండే అనుష్క ఇలా ఎందుకు మారిపోయిందో అభిమానులకు సైతం అంతు చిక్కడం లేదు.బాహుబలి సినిమా తర్వాత ఆమెకి వచ్చిన క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ కి ఆమె సరిగ్గా కెరీర్ ని ప్లాన్ చేసుకొని ఉంటే ఈరోజు అనుష్క ని మించిన ఇండియన్ హీరోయిన్ ఉండేది కాదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.కానీ చేతులారా కెరీర్ ని సర్వనాశనం చేసుకుంది అంటూ అభిమానులు బాధపడుతున్నారు.ఇక ఆమె పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో కూడా ఐడియా లేదు.ఆమె భావజాలం చూస్తూ ఉంటే ఈ జీవితానికి ఒంటరిగానే మిగిలిపోయేట్టు ఉందని అంటున్నారు విశ్లేషకులు.చూడాలి మరి భవిష్యత్తులో అనుష్క కెరీర్ ఎలా ఉండబోతుందో అనేది.