
గత వారం బిగ్ బాస్ ని చూసే ప్రతి ప్రేక్షకుడికి కంటతడి పెట్టించేలా చేసింది గీతూ ఎలిమినేషన్..బిగ్ బాస్ హిస్టరీ లో ఎప్పుడు కూడా ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే జనాలు ఇంతలా ఎమోషనల్ అవ్వడం ఎప్పుడు జరగలేదు..టైటిల్ విన్నర్ అయ్యే ఇక్కడి నుండి వెళ్తాను అని గీతూ మైండ్ లో చాలా బలంగా ఫిక్స్ అయ్యింది..కానీ టాప్ 5 లో కాదు కదా..కనీసం టాప్ 10 కంటెస్టెంట్స్ లో ఒకరిగా కూడా గీతూ నిలబడలేకపోవడం ఆమెని తీవ్రమైన దిగ్బ్రాంతికి గురి చేసింది..ఇక్కడితో నా జీవితం ఆగిపోయింది అన్నట్టుగా ఆమె వెక్కిళ్లు పెడుతూ స్టేజి మీద కుప్పకూలి ఏడవడం నాగార్జున ని సైతం కంటతడి పెట్టించేలా చేసింది..ఆమె తీవ్రంగా ఎమిషనల్ అయిపోవడం తో బిగ్ బాస్ టీం నేరుగా స్టేజి మీదకి వచ్చి బలవంతంగా ఆమెని తీసుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది..ఈ సంఘటన మొత్తం బిగ్ బాస్ ని చూసే ప్రేక్షకులలో గీతూ ని ఇష్టపడని వాళ్ళు కూడా బాధపడేలా చేసింది.
ఇది ఇలా ఉండగా గీతూ ఎలిమినేట్ అయ్యింది అంటే ఇప్పటికి నమ్మే వాళ్ళు ఎవ్వరు లేరు..హౌస్ లో ఉన్న ఇంటి సభ్యులు కూడా గీతూ ఎలిమినేట్ అవ్వలేదనే నమ్ముతున్నారు..సీక్రెట్ రూమ్ లో ఆమెని దాచిపెట్టారని వాళ్ళ అభిప్రాయం..అయితే గీతూ ఇంటికి వచ్చేసింది..పలు చానెల్స్ కి ఇంటర్వూస్ కూడా ఇచ్చేసింది..ఈరోజు కూడా ఆమె యూట్యూబ్ లో లైవ్ కి వచ్చింది..ఇవన్నీ చూస్తే గీతూ ఎలిమినేట్ అయ్యిందనే అనుకుంటున్నారు ప్రేక్షకులు మరియు ఆమె అభిమానులు..అయితే ఈ సీజన్ మొత్తం బిగ్ బాస్ ఎవ్వరు ఊహించని పనులే చేస్తున్నాడు..ఎలిమినేషన్స్ కూడా అలాగే జరిగాయి..ఇప్పుడు బిగ్ బాస్ చేస్తున్న మరో ఊహకి అందని చర్య ఏమిటి అంటే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా గీతూని మళ్ళీ ఈ వారం హౌస్ లోకి అడుగుపెట్టేలా చెయ్యడమే..గత వారం లో జరిగింది కేవలం ఫేక్ ఎలిమినేషన్ అని..ఈ వారం గీతూ ని ఇంట్లోకి పంపించి డబుల్ ఎలిమినేషన్ ని బిగ్ బాస్ ప్లాన్ చేసాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.
అయితే గీతూ వైల్డ్ కార్డు ఎంట్రీ కి కండిషన్స్ అప్లై అట..ఒకసారి బయటకి వెళ్లి లోపలి వచ్చింది కాబట్టి ఈమెకి టైటిల్ విన్ అయ్యే ఛాన్స్ లేదట కానీ టాప్ 5 లో కొనసాగే అవకాశం మాత్రం ఉందట..గీతూ హౌస్ లోకి అడుగుపెట్టినప్పటి ఎలిమినేట్ అయ్యే ముందు తో పోలిస్తే చాలా మారింది అనే చెప్పాలి..మొదట్లో కేవలం తన గేమ్..తన స్వార్థం అన్నట్టు రాయి మనిషి లాగ హౌస్ లో అడుగుపెట్టింది..ఆ తర్వాత రోజులు గడిచే కొద్దీ ఆమె ఎమోషన్స్ కి లోనైంది..ఈమె జీవితం లో అసలు ఏడుస్తుందా అని అనుకున్న వారు, అన్ని సార్లు హౌస్ లో ఏడవడం చూసి షాక్ కి గురైయ్యారు..తాను ఆడిందే ఆట అన్నట్టు గా ఓవర్ కాంఫిడెన్స్ తో ముందుకు పోవడం, బాలాదిత్య బలహీనతతో ఆదుకోవడమే ఆమె తొందరగా హౌస్ నుండి బయటకి రావడానికి కారణాలు అని తెలుస్తుంది..ఒకవేళ నిజంగా ఆమె వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తే సెకండ్ ఇన్నింగ్స్ లో ఎలా ఆడబోతుందో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.