
మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ చిత్రం ఇటీవలే విడుదలై భారీ బ్లాక్ ఉస్తెర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..మొదటి రోజు ప్రపంచా వ్యాప్తంగా 13 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం , రెండవ రోజు రోజు మరియు మూడవ రోజు కూడా అదే స్థాయి వసూళ్లను రాబట్టి కేవలం మూడు రోజుల్లోనే 35 కోట్ల రూపాయిల వరల్డ్ వైడ్ షేర్ ని సాధించింది..వాస్తవానికి ఇది చిరంజీవి గారి సినిమాకి మొదటి రోజు రావాల్సిన వసూళ్లు..అతి తక్కువ థియేటర్స్ మరియు అతి తక్కువ టికెట్ రేట్స్ పెట్టడం వల్ల ఇలాంటి వసూళ్లు వచ్చాయి..దానికి తోడు కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ కూడా ఈ సినిమా ని గాలికి వదిలేసింది..చెన్నై మరియు ఆస్ట్రేలియా వంటి ప్రాంతాలలో ఈ సినిమా ఇప్పటికి విడుదల అవ్వలేదంటే ఎంత నిర్లక్ష్యమో అర్థం చేసుకోవచ్చు..ఆస్ట్రేలియా లో ఎంచుకున్న కొన్ని ప్రాంతాలలో స్పెషల్ షోస్ వేసుకున్నారు..అక్కడ సెన్సార్ అయ్యి పూర్తి స్థాయి రెగ్యులర్ సినిమాగా విడుదల అవ్వాలంటే మరో వారం రోజులు సమయం పడుతుందట.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా హిందీ వెర్షన్ లో కూడా విడుదలైన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ చిత్రం లో సల్మాన్ ఖాన్ ఒక ముఖ్య పాత్రలో కనిపించాడు..ఆ పాత్రకి మంచి రెస్పాన్స్ కూడ వచ్చింది..హిందీ లో సల్మాన్ ఖాన్ ఉండడం వల్ల ఈ చిత్రం వసూళ్లు మొదటి రోజు నుండే చాలా బాగున్నాయి..మొదటి రోజు ఇక్కడ కూడా లిమిటెడ్ షోస్ తోనే విడుదల చేసారు..అయినా కూడా ఇక్కడ మొదటి రోజు దాదాపుగా 2 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి..రెండవ రోజు మరియు మూడవ రోజు కూడా స్టడీ గా అదే స్థాయి వసూళ్లను రాబట్టింది..అలా ఈ సినిమా మూడు రోజులకు కలిపి 6 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది..మన తెలుగు మార్కెట్ లో షేర్ కింద కలెక్షన్స్ ని లెక్క వేస్తాము కాబట్టి హిందీ వెర్షన్ లో మూడు రోజులకు కలిపి 3 కోట్ల రూపాయిలు షేర్ వసూలు చేసింది అని చెప్పొచ్చు.
కలెక్షన్స్ బాగా వస్తుండడం తో వీకెండ్ కి షోస్ సంఖ్య బాగా పెంచేశారు..నిన్న మొన్నటి వరుకు కేవలం 1000 షోస్ తో నడుస్తున్న ఈ సినిమా ఇప్పుడు ఏకంగా 3500 షోస్ కి ఎగబాకింది..ఈ వీకెండ్ బాగా రెండు రోజులకు కలిపి 12 కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టే అవకాశం కూడా ఉంది..చూడాలి మరి ఈ సినిమా హిందీ లో ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందో..చిరంజీవి గారి సైరా నరసింహ రెడ్డి చిత్రం ఇక్కడ దాదాపుగా 13 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది..ఆ తర్వాత చిరంజీవి గారు నటించిన ఆచార్య సినిమాని విడుదల చేద్దాం అని మొదట్లో అనుకున్న ఎందుకో వెనకడుగు వేశారు..ఇప్పుడు గాడ్ ఫాదర్ చిత్రం విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని అక్కడ దక్కించుకుంటుండడం తో ఇక మీదట తన సినిమాలన్నీ తప్పనిసరిగా హిందీ లో విడుదల చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడట మెగాస్టార్ చిరంజీవి.