Home Entertainment ‘గాడ్ ఫాదర్’ మొదటి వీకెండ్ వసూళ్లు..మెగాస్టార్ స్టామినా కి నిదర్శనం ఇది

‘గాడ్ ఫాదర్’ మొదటి వీకెండ్ వసూళ్లు..మెగాస్టార్ స్టామినా కి నిదర్శనం ఇది

0 second read
0
0
535

మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ చిత్రం ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా విడుదలకి ముందు అభిమానుల్లో మరియు ట్రేడ్ వర్గాల్లో చాలా అనుమానాలు ఉండేవి..ఆచార్య వంటి డిజాస్టర్ ఫ్లాప్ సినిమా తర్వాత వస్తున్న రీమేక్ సినిమా..ఇటీవల కాలం లో వస్తున్న రీమేక్ సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ వచ్చినప్పటికీ కూడా బోల్తా కొట్టేస్తున్నాయి..గాడ్ ఫాదర్ సినిమాకి కనీస స్థాయి హైప్ మరియు క్రేజ్ కూడా లేదు..టాక్ రాకపోతే ఘోరమైన అవమానాలను మరోసారి మెగా ఫాన్స్ ఎదురుకోవాలేమో..ఇలా ఎన్నో రకాల సందేహాలు ఉండేవి..కానీ మెగాస్టార్ చిరంజీవి స్టార్ స్టేటస్ గురించి మన అందరికి తెలిసిందే..మన ఊహకి కూడా అందని అద్భుతాలు చెయ్యడం మెగాస్టార్ ప్రత్యేకత..గాడ్ ఫాదర్ సినిమాకి కూడా అదే జరుగుతుంది..మొదటి రోజు కాంపిటీషన్ రిలీజ్ వల్ల అతి తక్కువ థియేటర్స్ లో ఈ చిత్రం విడుదలైంది..దానికి తోడు ఈ సినిమాకి హైప్ లేకపోవడం తో టికెట్ రేట్స్ కూడా పెంచే సాహసం చెయ్యలేదు నిర్మాతలు.

అందువల్ల ఈ సినిమాకి ఓపెనింగ్స్ మెగాస్టార్ చిరంజీవి స్థాయి లో రాలేదు..అభిమానులు కాస్త నిరుత్సహానికి గురైయ్యారు..కానీ రెండవ రోజు నుండి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద జాతర ని తలపించే రేంజ్ వసూళ్లను రాబట్టింది..లాంగ్ వీకెండ్ లో స్టడీ కలెక్షన్స్ ని రాబడుతూ మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఎలాంటిదో మరోసారి ట్రేడ్ కి రుచి చూపించింది ఈ చిత్రం..తెలుగు లో దబ్ అయ్యి ఉన్న ఒక సినిమాని రీమేక్ చేసిన కూడా ఈ స్థాయి వసూళ్లు రావడం అంటే మాములు విషయం కాదు..ఒక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మాత్రమే రీమేక్ సినిమాకి కూడా అద్భుతమైన వసూళ్లు వచ్చాయి ఆయన తర్వాత ఆ రేంజ్ వసూళ్లు మెగాస్టార్ చిరంజీవి కి మాత్రమే రావడం విశేషం..ఈ సినిమా ఇప్పటి వరుకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి 5 రోజులకు గాను 55 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది..ఇది చిరంజీవి రేంజ్ కి తక్కువ వసూళ్లే అయినప్పటికీ కూడా లిమిటెడ్ రిలీజ్ మరియు మూవీ జానర్ ని దృష్టిలోకి తీసుకుంటే మంచి వసూళ్లే వచ్చాయని చెప్పాలి.

చిరంజీవి గారి సినిమాలకు ఓపెనింగ్స్ తో పాటుగా లాంగ్ రన్ కూడా ఉండడం సర్వసాధారణం..ఒకవేళ ఓపెనింగ్స్ మిస్ అయినా కూడా లాంగ్ రన్ లో మొత్తం కవర్ చేసేస్తాడు మన మెగాస్టార్.. ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాకి కూడా అదే జరుగుతుంది..కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు..ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా ఇదే రేంజ్ రన్ అవుతుంది..ప్[రెమిర్స్ నుండి ఆదివారం వరుకు ఒకే రకమైన కలెక్షన్స్ ని రాబడుతూ 1 మిలియన్ డాలర్ మార్కుని దాటేసింది..చిరంజీవి సినిమాకి 1 మిలియన్ రావడం పెద్ద గొప్పనా అని మీరు అనుకోవచ్చు..కానీ ఈ సినిమాకి అమెరికా లో కూడా వరస్ట్ రిలీజ్ దక్కింది..షోస్ ఫుల్ అవుతున్నా కూడా కొత్త షోస్ ని యాడ్ చెయ్యకుండా ప్రీమియర్స్ షోస్ భారీ నష్టం చేసాడు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్..కానీ ఈ చిత్రం తక్కువ ప్రీమియర్ కలెక్షన్స్ తోనే ప్రారంభం అయ్యినప్పటికీ కూడా వీకెండ్ కి 1 మిలియన్ డాలర్లు వసూలు చేసింది..అంతే కాకుండా ఈ చిత్రం హిందీ వెర్షన్ కి కూడా మంచి వసూళ్లే దక్కాయి..అక్కడ ఈ చిత్రానికి 5 రోజులకు గాను సుమారు 6 కోట్ల 40 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి..ఫుల్ రన్ లో హిందీ లో 20 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని తెలుస్తుంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…