Home Entertainment ‘గాడ్ ఫాదర్’ మొదటి వారం వసూళ్లు ఎక్సక్లూసివ్ గా మీకోసం

‘గాడ్ ఫాదర్’ మొదటి వారం వసూళ్లు ఎక్సక్లూసివ్ గా మీకోసం

0 second read
0
0
470

మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ చిత్రం ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ఏడాది విడుదలైన ఆచార్య సినిమాతో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ ని అందుకొని అభిమానులను నిరాశ పరిచిన మెగాస్టార్ చిరంజీవి..6 నెలలు తిరగకుండానే అభిమానులు పండగ చేసుకునే సినిమాని బహుమతి గా ఇచ్చాడు..చిరంజీవి తన 40 ఏళ్ళ సుదీర్ఘ సినీ ప్రస్థానం లో హీరోయిన్ లేకుండా సినిమాని తీసి హిట్టు కొట్టడం ఇదే తొలిసారి..మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న మాస్ ఇమేజి కారణంగా అభిమానులు ఆయన నుండి కచ్చితంగా కొన్ని కమర్షియల్ ఎలెమెంట్స్ కోరుకుంటారు..అవి లేకపోతే సినిమా ఫలితం కాస్త అటు ఇటు అయ్యే అవకాశం కూడా ఉంది..కానీ మారుతున్నా ట్రెండ్ ప్రకారం ప్రస్తుతం కంటెంట్ కింగ్..కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఇలాంటివి ఏమి కూడా పట్టించుకోవడం లేదు..అందుకే గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ అయ్యింది..ఇది ఇలా ఉండగా ఈ సినిమా వచ్చి వారం రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒక లుక్ వేద్దాం.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో సినిమాకి ఓపెనింగ్స్ కీలకం..కానీ గాడ్ ఫాదర్ సినిమాకి రాష్ట్రవ్యాప్తంగా హౌస్ ఫుల్ బోర్డ్స్ పడుతున్న కూడా థియేటర్స్ లేకపోవడం వల్ల మొదటి వారం కనీసం 20 కోట్ల రూపాయిలు అదనంగా రావాల్సిన వసూళ్లను కోల్పోయిందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు..మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి సుమారు 13 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, రెండవ రోజు 7 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ ని సాధించింది..మూడవ రోజు 5 కోట్ల 70 లక్షల రూపాయిలు, నాల్గవ రోజు 5 కోట్ల 50 లక్షలు మరియు 5 వ రోజు 5 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది..ఇంత భారీ లాంగ్ వీకెండ్ తర్వాత సాధారణంగా సోమవారం నుండి వసూళ్లు దారుణంగా పడిపోతాయి..కానీ గాడ్ ఫాదర్ విషయం లో అలా జరగలేదు..సోమవారం నాడు ఈ సినిమాకి సుమారు కోటి 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

సోమవారం రోజు మాత్రమే కాకుండా మంగళవారం రోజు కూడా ఈ సినిమా డీసెంట్ స్థాయి వసూళ్ల ట్రెండ్ ని కొనసాగించింది..ఇక ఓవర్సీస్ లో అయితే మొదటి నుండి ఈ సినిమా ఆశ్చర్యానికి గురి చేసే రన్ ని సొంతం చేసుకుంటూ ముందుకి దూసుకుపోతుంది..ప్రీమియర్ కలెక్షన్స్ తక్కువే అయ్యినప్పటికీ కూడా వీకెండ్ లోనే 1 మిలియన్ మార్కుని దాటి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..అంతే కాకుండా సోమవారం కూడా ఈ సినిమా డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టి బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే దిశగా అడుగులు వేస్తుంది..ఈ సినిమా అమెరికాలో బ్రేక్ ఈవెన్ మార్కుని సాధించాలంటే 16 లక్షల డాలర్లు వసూలు చెయ్యాలి..ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ సినిమా ఇప్పటి వరుకు అక్కడ 13 లక్షల డాలర్లు వసూలు చేసింది..ఈ వీకెండ్ లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే అవకాశం కూడా ఉంది..మొత్తం మీద ఈ సినిమా ఇప్పటి వరుకు మొదటి వారం అన్ని ప్రాంతాలకు కలిపి 55 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది..బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 32 కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టాల్సిన అవసరం ఉంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…