
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలకు సిద్ధమవుతోంది. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన లూసీఫర్ మూవీకి రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. దర్శకుడు మోహన్ రాజా తెలుగు ప్రేక్షకుల అభిరుచిగా తగ్గట్లుగా పలు మార్పులు చేశాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో ఈ మూవీని రూపొందించారు. మలయాళంలో మోహన్ లాల్ నటించిన పాత్రలో ఇక్కడ చిరంజీవి నటిస్తున్నాడు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంలో ప్రమోషన్ కార్యక్రమాల జోరును చిత్ర యూనిట్ పెంచింది. ఈ నేపథ్యంలో మేకర్స్ గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చేవారి జాబితాలో ఉన్న మొదటి పేరు పవన్ కళ్యాణ్. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న మూవీ కావడంతో జనసేన పార్టీకి చీఫ్‌గా పవన్‌ను పిలిస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది.
దీంతో ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా పవన్ కళ్యాణ్ అయితే పర్‌ఫెక్ట్‌గా ఉంటుందని భావించిన మేకర్స్ ఈవెంట్‌కు రావాలని పవన్‌ను కోరాలని అనుకున్నారు. కానీ పవన్ విదేశీ పర్యటనకు వెళ్లడం వల్ల ప్రస్తుతం ఆయన అందుబాటులో లేరని టాక్ నడుస్తోంది. అక్టోబర్ రెండో వారంలో పవన్ కళ్యాణ్ ఇండియాకు తిరిగిరానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒకే వేదికపై చిరు- పవన్ కనిపిస్తారని మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూడగా.. వారికి ఈసారి కూడా నిరాశే ఎదురయ్యేలా ఉంది. మొత్తానికి పవన్ విదేశీ టూర్ ప్లాన్ వేసుకుని పరోక్షంగా గాడ్ ఫాదర్‌కు దూరంగా ఉంటున్నారంటూ సినీ జనాలు సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఈ ఈవెంట్ గెస్ట్ లేకుండానే జరగనుందని చెప్పుకుంటున్నారు. మరోపక్క అన్న చిరంజీవి కోసం ఏదైనా చేసే పవన్.. అన్న పిలిస్తే ఖచ్చితంగా వచ్చేస్తాడు. కానీ పవన్ పనిని డిస్టర్బ్ చేయడం ఎందుకని చిరంజీవి ఈవెంట్‌కు వద్దు అన్నారని కూడా టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.
మొత్తానికి గాడ్ ఫాదర్‌కు విడుదలకు ముందే భారీ హైప్ రావాల్సి ఉంది. కానీ అంతగా బజ్ క్రియేట్ చేయలేకపోతుందనే వాదన కూడా వినిపిస్తోంది. అటు గాడ్ ఫాదర్ మూవీలో కీ రోల్ పోషించిన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో రెండు ప్రమోషనల్ ఈవెంట్స్ చేయించాలని, దీంతో పాటు దుబాయ్‌లో కూడా ఓ ఈవెంట్ జరిపించాలని చిరంజీవి సన్నాహాలు చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజకీయాలకు నేను దూరమయ్యాను గానీ, రాజకీయం నా నుంచి దూరం కాలేదు అంటూ చిరంజీవి చెప్పే డైలాగ్ ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ డైలాగ్‌కు వస్తున్న స్పందనపై రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి స్పందించారు. నిజంగా ఈ స్థాయిలో ఈ డైలాగ్ పేలుతుందని తాను అనుకోలేదన్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఉండదని.. సాంగ్స్ కూడా ఉండవని.. కానీ అవి లేవనే ఆలోచన ప్రేక్షకులకు రాకుండా కథ నడుస్తుందని తెలిపారు. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి మాత్రమే లూసీఫర్ రీమేక్‌ను ఎంచుకున్నానని.. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని చిరు నమ్మకం వ్యక్తం చేశాడు.