
మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఇటీవలే విడుదలై ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామి ని సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికి తెలిసిందే..ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ‘ఆచార్య’ చిత్రం గత ఏడాది భారీ డిజాస్టర్ గా నిలిచి అభిమానులను నిరాశపరిచింది..ఆ తర్వాత నాలుగు నెలల తేడా తో విడుదలైన ‘గాడ్ ఫాదర్’ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన సరిగా ఆడలేదు..ఆచార్య సినిమా ప్లాప్ అయ్యింది కాబట్టి కలెక్షన్స్ రాలేదు..కానీ ‘గాడ్ ఫాదర్’ చిత్రానికి టాక్ బాగున్నా కూడా కలెక్షన్స్ సరిగా రాలేదు..దీనిని బట్టి చూస్తుంటే మెగాస్టార్ చిరంజీవి పని ఇక అయిపోయింది..ఆయనని జనాలు ఇక చూడరేమో అనే సందేహం అభిమానుల్లో సైతం నెలకొంది..అయితే ఆ సందేహాలను ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం తో దిమ్మ తిరిగే రేంజ్ బ్లాక్ బస్టర్ కొట్టి అందరి సందేహాలను పటాపంచలు చేసాడు..అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు.
ఇక ఈ సినిమా కేవలం మూడు రోజుల్లో రాబట్టిన వసూళ్లను గాడ్ ఫాదర్ చిత్రం ఫుల్ రన్ లో కూడా రాబట్టలేకపోయిందట..గాడ్ ఫాదర్ చిత్రం ఫుల్ రన్ లో దాదాపుగా 60 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది..మెగాస్టార్ రేంజ్ కి ఇది చాలా తక్కువ అని నిరూపించింది ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం..కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా 63 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి, మూడు రోజుల్లోనే గాడ్ ఫాదర్ క్లోసింగ్ కలెక్షన్స్ ని దాటేసి మెగా స్టార్ కెరీర్ లో టాప్ 3 చిత్రాలలో ఒకటిగా నిలిచింది..ఇది నిజంగా ఎవ్వరు ఊహించనిది..ఎందుకంటే ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి టాక్ పెద్దగా పాజిటివ్ ఏమి రాలేదు..కొంతమంది యావరేజి అంటుంటే , మరి కొంతమంది బాలేదు అంటున్నారు..అలాంటి టాక్ మీదనే ఈ రేంజ్ విద్వంసం సృష్టించడం చూస్తుంటే మెగాస్టార్ కమర్షియల్ సినిమాలంటే జనాలకు ఎంత ఇష్టమో అర్థం అవుతుంది.
ఈ బాక్స్ ఆఫీస్ ప్రభంజనం ఇప్పటిలో ఆగేది కాదు..ఈ నెల మొత్తం ఇదే స్థాయి వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి..ఇదే ట్రెండ్ నిజంగా కొనసాగితే మాత్రం ఈ చిత్రం ఫుల్ రన్ లో కచ్చితంగా 130 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాదిస్తుందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు..ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం వర్కింగ్ డేస్ మరియు వీకెండ్స్ అని తేడా లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద శివ తాండవం ఆడేస్తుంది..ప్రస్తుతానికి రెండు మిలియన్ డాలర్లకు దగ్గరలో ఉన్న ఈ మూవీ, ఇదే ట్రెండ్ మరికొద్ది రోజులు కొనసాగిస్తే 3 మిలియన్ మార్కుని అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్తున్నారు ట్రేడ్ పండితులు..చూడాలి మరి.