Home Entertainment గాడ్ ఫాదర్ కి కలెక్షన్స్ రాకపోవడానికి కారణం అదేనా..? హిట్ టాక్ తో కూడా ఇంత భారీ నష్టాలా?

గాడ్ ఫాదర్ కి కలెక్షన్స్ రాకపోవడానికి కారణం అదేనా..? హిట్ టాక్ తో కూడా ఇంత భారీ నష్టాలా?

0 second read
0
0
8,920

మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ చిత్రం ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..అయితే ఈ ఏడాది చిరంజీవి హీరో గా నటించిన ఆచార్య సినిమా డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో ఆ సినిమా ప్రభావం ‘గాడ్ ఫాదర్’ పై పడిందనే చెప్పాలి..మలయాళం సినిమాకి రీమేక్ అవ్వడం తో మొదటి నుండి అభిమానుల్లో ఈ చిత్రం పై అంచనాలు లేవు..టీజర్, ట్రైలర్ మరియు పాటలు ఇలా సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ మొత్తం విడుదల చేసిన కూడా రెగ్యులర్ చిరంజీవి సినిమాలకు వచ్చే హైప్ రాలేదు..దీనితో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ చిరంజీవి గారి రేంజ్ చాలా తక్కువగా జరిగింది అనే చెప్పాలి..ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 92 కోట్ల రూపాయలకు జరిగింది..మెగాస్టార్ గత చిత్రం ఆచార్య సినిమాకి దాదాపుగా 135 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

మెగాస్టార్ రేంజ్ కి తక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యినప్పటికీ కూడా, ఆ బిజినెస్ ని రికవర్ చెయ్యడం కూడా పెద్ద కష్టం గా మారిపోయింది ఇప్పుడు గాడ్ ఫాదర్ చిత్రానికి..ఇక అసలు విషయానికి వస్తే ఒక స్టార్ హీరో సినిమాకి ఓపెనింగ్స్ చాలా కీలకం..గాడ్ ఫాదర్ కి విడుదల రోజు నుండి అదే సమస్య..ఎందుకంటే గాడ్ ఫాదర్ విడుదలైన రోజునే అక్కినేని నాగార్జున ఘోస్ట్ మరియు బెల్లం కొండా గణేష్ ‘స్వాతి ముత్యం’ సినిమాలు విడుదల అయ్యాయి..చిరంజీవి సినిమా వస్తుంది కదా తప్పుకుందాం అని వాళ్ళిద్దరిలో ఎవరు అనుకోలేదు..ఎందుకంటే వాళ్లకి పండగ దినం వసూళ్లు చాలా ముఖ్యం..కానీ ఆ రెండు సినిమాలకు పండుగ రోజు కూడా వసూళ్లు రాలేదు..చిరంజీవి గారి సినిమాకి భారీ నష్టం కలగచెయ్యడానికే వచ్చినట్టు ఉంది..ఒకవేళ ఆ రెండు సినిమాలు లేకపోయి ఉంటె ‘గాడ్ ఫాదర్’ చిత్రం మొదటి వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయేది..కానీ చిరంజీవి సినిమాకి కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అని ఎవరు మాత్రం ఊహిస్తారు చెప్పండి..కాలం కలిసి రాకపోతే అన్ని వ్యతిరేకమవుతాయి అనేది గాడ్ ఫాదర్ చిత్రం రూపం లో తెలుస్తుంది.

అసలే థియేటర్స్ లేవు..దానికి తోడు టికెట్ రేట్స్ లేవు అని మెగా అభిమానులు బాధపడుతుంటే..ఈ చిత్రానికి వరుణ దేవుడు కూడా పెద్ద ఆటంకం కలగచేసాడు..ఈ సినిమా విడుదల రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ప్రారంభం అయ్యాయి..ఇప్పటికి కూడా వర్ష ప్రభావం ఈ సినిమా మీద ఎలా ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఇన్ని అవరోధాలను దాటుకొని ఈ సినిమా పది రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది..ఈ వీకెండ్ ఈ సినిమాకి చాలా కీలకం..కానీ ఈ వీకెండ్ కర్ణాటక ప్రాంతం లో ప్రభంజనం సృష్టిస్తూ ముందుకి దూసుకుపోతున్న ‘కాంతారా’ చిత్రం తెలుగు లో కూడా విడుదల కాబోతుంది..ఎక్కడ చూసిన ఈ సినిమా గురించి పాజిటివ్ రెస్పాన్స్ వాస్తు ఉండడం తో ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఇక్కడి స్టార్ హీరోల రేంజ్ లో ఉన్నాయి..ఈ సినిమా ప్రభావం కూడా గాడ్ ఫాదర్ మీద పడే అవకాశాలు లేకపోలేదు..అలా టాక్ వచ్చినప్పటికీ కూడా సందర్భాలు కలిసి రాక ఈ చిత్రానికి సుమారు 25 కోట్ల రూపాయిలు నష్టం వాటిల్లే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…