
సుమారు గా 12 ఏళ్ళ పాటు ఎంతో శ్రమించి..వేల కోట్ల రూపాయిలు ఖర్చు చేసి తెరకెక్కించిన ‘అవతార్౨’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా సుమారు 186 బాషలలో ఘనంగా విడుదలైన సంగతి తెల్సిందే..2009 వ సంవత్సరం లో విడుదలై మూడు బిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టిన అవతార్ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి మిగతా ప్రాంతాలలో ఓపెనింగ్స్ ఎలా ఉన్నా, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బంపర్ ఓపెనింగ్ దక్కింది..ముఖ్యంగా ఈ సినిమా 3D వెర్షన్ ని చూడడానికి జనాలు ఎగబడుతున్నారు..మాస్ సెంటర్స్ లో సైతం ఈ చిత్రానికి బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ దక్కాయి..ఒక హాలీవుడ్ మూవీ కి ఈ స్థాయి ఓపెనింగ్ గతం లో ఎప్పుడూ కూడా దక్కలేదు..ఇప్పటి వరుకు విడుదలైన హాలీవుడ్ మూవీ తెలుగు వెర్షన్ మొదటి రోజు అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రం ‘ఎవెంజర్స్ ఎండ్ గేమ్’ మాత్రమే..ఆ తర్వాత ‘స్పైడర్ మ్యాన్ : నో వే 2 హోమ్’ కి కూడా మంచి ఓపెనింగ్ దక్కింది.
అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు 14 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట..కేవలం నైజాం ప్రాంతం లోనే ఈ సినిమాకి 5 కోట్ల రూపాయిలు షేర్ వసూళ్లు వచ్చాయి..రీసెంట్ గా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రం మొదటి రోజు వసూళ్లు కూడా ఈ రేంజ్ లో రాలేదు..గాడ్ ఫాదర్ చిత్రానికి ఇక్కడ మొదటి రోజు కేవలం నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి..ఫుల్ రన్ లో దాదాపుగా 12 కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టింది గాడ్ ఫాదర్..కానీ అవతార్ 2 చిత్రానికి కేవలం మూడు రోజుల్లోనే ఈ ప్రాంతం లో 18 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందట..ఫుల్ రన్ లో మరికొంత మంది పెద్ద హీరోల క్లోసింగ్ కలెక్షన్స్ కూడా ఈ ప్రాంతం లో ఎగిరిపోయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్టు తెలుస్తుంది..ఒక హాలీవుడ్ మూవీ కి టాలీవుడ్ లో ఈ స్థాయి వసూళ్లు అంటే చాలా గ్రేట్.
మరోపక్క ఈ చిత్రం హిందీ వసూళ్లు మాత్రం ఊహించిన రేంజ్ లో అయితే లేవు..ఎవెంజర్స్ ఎండ్ గేమ్ కంటే చాలా తక్కువ..ఇంగ్లీష్ వెర్షన్ డొమెస్టిక్ లో కూడా పెద్దగా వసూళ్లను రాబట్టిన దాఖలాలు కనిపించడం లేదు..మొదటి రోజు నార్త్ అమెరికా లో ప్రీమియర్స్ మరియు మొదటి రోజు కలిపి కేవలం 55 మిలియన్ డాలర్లు మాత్రమే వసూలు చేసింది..ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకోవాలంటే 2 బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను రాబట్టాల్సి ఉంది..కానీ ఇదే ట్రెండ్ మాత్రం చివరి వరుకు కొనసాగితే ఆ రేంజ్ వసూళ్లను రాబట్టడం మాత్రం చాలా కష్టం..బాక్స్ ఆఫీస్ వద్ద కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచిపోతుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి..కానీ లాంగ్ రన్ ఈ చిత్రానికి కచ్చితంగా ఉంటుందని అందరూ నమ్ముతున్నారు..చూడాలి మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రేంజ్ ఎంత వరకు వెళ్తుందో.