Home Entertainment గాడ్ ఫాథర్ 3 రోజుల వసూళ్లు ఎక్సక్లూసివ్ గా మీకోసం..మెగాస్టార్ మాస్ విద్వాంసం

గాడ్ ఫాథర్ 3 రోజుల వసూళ్లు ఎక్సక్లూసివ్ గా మీకోసం..మెగాస్టార్ మాస్ విద్వాంసం

0 second read
0
0
1,255

మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామి ని సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..తక్కువ థియేటర్స్ లో విడుదల అవ్వడం వల్ల మొదటి రోజు మెగాస్టార్ రేంజ్ ఓపెనింగ్ రాకపోయినప్పటికీ..రెండవ రోజు నుండి మాత్రం సునామి ని తలపించే బాక్స్ ఆఫీస్ వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకి దూసుకుపోతుంది..చాలా చోట్ల రెండవ రోజు అయితే మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లను నమోదు చేసుకోవడం ఆశ్చర్యానికి గురి చేసిన విషయం..ఇక మూడవ రోజు కూడా ఈ సినిమా అదే స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకి దూసుకుపోయింది..ఒక్క ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో మాత్రమే కాదు ఓవర్సీస్ మరియు కర్ణాటక వంటి ప్రాంతాలలో కూడా మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది..ఒక్కసారి ఈ చిత్రం మూడు రోజుల్లో ఎంత వసూళ్లను రాబట్టిందో ఒక లుక్ వేద్దాం.

మొదటి రోజు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ కి కలిపి 13 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం, రెండవ రోజు 8 కోట్ల రూపాయిల షేర్ వరుకు రాబట్టింది..నైజాం వంటి ప్రాంతాలలో ఈ సినిమా టౌన్స్ లో మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది..ఉదాహరణకి కరీం నగర్ వంటి పెద్ద టౌన్ లో మొదటి రోజు కేవలం 8 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రం, రెండవ రోజు ఏకంగా 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది..దాదాపుగా తెలంగాణలోని ప్రతి ప్రాంతం లో ఇదే ట్రెండ్ కొనసాగింది..ఇక మూడవ రోజు కూడా అదే ఊపు..రెండవ రోజు తో పోలిస్తే మూడవ రోజు మార్నింగ్ షోస్ కాస్త తగ్గి ఉండొచ్చు కానీ,మాట్నీస్ నుండి మాత్రం మెగాస్టార్ ప్రళయ తాండవం ఆడేసాడు..ఓవర్సీస్ లో కూడా ఇదే పరిస్థితి.

అలా మొదటి మూడు రోజులు కేవలం ఆంధ్ర తెలంగాణ కలిపి ఈ సినిమా 27 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా మూడు రోజులకు కలిపి 1 మిలియన్ డాలర్లు వసూలు చేసింది..వాస్తవానికి ఈ సినిమా మొదటి రోజే ప్రీమియర్స్ + డే 1 కలిపి 1 మిలియన్ డాలర్లు వసూలు చెయ్యాల్సింది..కానీ ఇక్కడ కూడా విడుదల జాప్యం వల్లే ఆ అరుదైన అవకాశం ని మిస్ చేసుకుంది..ఇక మిగిలిన ఓవర్సీస్ ప్రాంతాలైన ఆస్ట్రేలియా లో అసలు ఈ చిత్రం ఇప్పటి వరుకు విడుదల కాలేదంటే అర్థం చేసుకోవచ్చు ఈ చిత్ర నిర్మాతలు ఈ సినిమా పట్ల ఎంత నిర్లక్ష్యం చూపించారు అనేది..ఇక చెన్నై లో అయితే ఇప్పటి వరుకు ఈ సినిమా ఇంకా విడుదలే కాకపోవడం గమనార్హం..ఇన్ని అడ్డంకులు, లిమిటెడ్ రిలీజ్ మరియు అతి తక్కువ టికెట్ రేట్స్ ని కూడా అధిగమించి ఈ స్థాయి వసూళ్లను రావడం అంటే మాములు విషయం కాదు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…