
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, ఉపాసన దంపతులకు వివాహం జరిగి దాదాపు పదేళ్లు పూర్తి కావొస్తోంది. అయినా ఈ జంటకు ఇప్పటివరకు పిల్లలు లేరు. అటు రామ్‌చరణ్, ఇటు ఉపాసన తమ కెరీర్‌తో బిజీగా ఉండటం వల్ల ఇప్పటివరకు పిల్లలను కనాలనే ఆసక్తిని చూపించలేదు. అయితే వీళ్లిద్దరూ తమ అభిమానులకు త్వరలోనే శుభవార్త చెప్పబోతున్నారంటూ ఫిలింనగర్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల తన డ్రైవర్ ఇంటికి వినాయక నిమజ్జనం వేడుకల కోసం ఉపాసన అంబేద్కర్ బస్తీకి వెళ్లగా అక్కడ కొందరు మీడియా ప్రతినిధులు ఆమె ఫోటోలను తీశారు. ఈ ఫోటోలలో ఉపాసన బేబీ బంప్‌తో కనిపిస్తోంది. దీంతో ఉపాసన ప్రెగ్నెంట్ అంటూ మెగా అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఉపాసన బేబీ బంప్ చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు చరణ్ తండ్రి కాబోతున్నాడని కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు.
సాధారణంగా ఉపాసన చాలా ఫిట్‌గా కనిపిస్తుందని.. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోల్లో ఆమె శరీరాకృతిలో మార్పులు కనిపించడంతో పాటు పొట్ట లావుగా కనిపించడంతో ఆమె ప్రెగ్నెంట్ అంటూ అభిమానులు బల్లగుద్దీ మరి చెప్తున్నారు. అయితే ప్రెగ్నెంట్ వార్తలపై ఇప్పటివరకు అటు రామ్‌చరణ్, ఇటు ఉపాసన ఎవరూ స్పందించలేదు. కేవలం ఫోటోలను చూసి అభిమానులు ఇలా ప్రచారం చేయడం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రామ్ చరణ్, ఉపాసన ఓ మీటింగ్‌లో తొలిసారిగా పరిచయం పెంచుకోగా.. వారి మధ్య ప్రేమ మొదలైంది. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి 2012లో పెళ్లి చేసుకున్నారు. పదేళ్లు దాటినా పిల్లలు లేకపోవడంతో ఇటీవల ఉపాసన ఎక్కడికి వెళ్లినా సంతానం గురించే మీడియా ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. కొన్నిసార్లు సంతానంపై ఇంకా కమిట్మెంట్ తీసుకోలేదని ఉపాసన జవాబు కూడా ఇచ్చింది. అయినా కొందరు అదే పనిగా ప్రశ్నలు వేయడంపై కూడా ఉపాసన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక లాభం లేదనుకుని ప్రస్తుతం చరణ్ దంపతులు పాఇల్లల విషయంలో డెసిషన్ తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది.
చరణ్ తన సినిమాలతో బిజీగా గడుపుతుండగా ఉపాసన అపోలో హాస్పిటల్‌కు సంబంధించిన పనులను చూసుకుంటోంది. ఉమెన్ పవర్ చాటిచెప్పేలా ఉపాసన అన్ని విషయాల్లో ముందుంటున్నారు. మహిళా వ్యాపారవేత్తగా సత్తా చాటుతూ పవర్ఫుల్ ఉమెన్ అనిపించుకుంటున్నారు. ఇదే విషయమై ఆమెకు అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు లభించింది. ఇటీవల ఉపాసన తాను పిల్లలు కనడం దానిపై సద్గురుని కొని ప్రశ్నలు అడిగింది. ఆధ్యాత్మిక గురువు సద్గురుతో జరిగిన కార్యక్రమంలో ఉపాసన కొణిదెల పాల్గొంది. ఆశ్చర్య కరంగా తాను పిల్లలని కనడం గురించి కూడా సద్గురు వద్ద ఉపాసన ప్రశ్నించింది. తాను వివాహం చేసుకుని పదేళ్లు అవుతోందని.. తన జీవితం చాలా హ్యాపీగా సాగుతోందని.. తన ఫ్యామిలీని తన జీవితాన్ని ప్రేమిస్తున్నానని.. ప్రస్తుతం అందరూ RRR గురించే ఆలోచిస్తున్నారని.. RRR అంటే సినిమా అనుకునేరు అది కాదని.. R రిలేషన్, R రీ ప్రొడ్యూస్, R రోల్ ఇన్ లైఫ్ అని ఉపాసన వివరించింది. ఆరోగ్యంగా ఉండి కూడా పిల్లలు కనకూడదు అని నిర్ణయించుకున్న వారిని తాను అభినందిస్తానని సద్గురు చెప్పారు. అయితే ఉపాసన ఈ ప్రశ్న ఎందుకు అడిగిందని పలువురు నెటిజన్లు ఆసక్తికరంగా చర్చించుకున్నారు కూడా. కాగా ఉన్నత కుటుంబానికి చెందిన కోడలు ఉపాసన ఎటువంటి గర్వం లేకుండా రెండు రోజుల కిందట తమ ఇంటి పనిమనిషి వినాయకుడి నిమజ్జనంకు పిలవడంతో వెళ్లి అందరి దృష్టిలో పడింది.