
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మొత్తం ప్రస్తుతం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరియు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చుట్టూ ఎంత వాడివేడిగా సాగుతుందో మన అందరికి తెలిసిందే..ఉత్తరాంధ్ర ప్రాంతం లో మూడు రోజుల పాటు పర్యటన చేపడుతున్న పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమం ని ఆపడమే కాకుండా..జనసేన పార్టీ నాయకులపై అక్రమంగా కేసులు బనాయించిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది..రెండు రోజుల పాటు ఉత్తరాంధ్ర మొత్తం హై అలెర్ట్ గా మారిపోయింది..విశాఖ లో గర్జన కార్యక్రమం ని ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న వైసీపీ మంత్రులను జనసేన పార్టీ కార్యకర్తలు వైజాగ్ విమానాశ్రయం లో దాడి చేసారంటూ జనసేన కార్యకర్తల పై ‘అట్టెంప్ట్ టూ మర్డర్’ కేసులు పెట్టారు..అయితే జనసేన పార్టీ లీగల్ సెల్ అరెస్ట్ అయినా 65 మంది జనసేన కార్యకర్తలను బెయిల్ ద్వారా విడుదల చేసారు..మరో 9 మంది ప్రస్తుతం రిమాండ్ లో ఉండగా సాయంత్రం లోపు జైలు నుండి విడుదల అవుతారంటూ సమాచారం.
అక్రమంగా తన కార్యకర్తల పై కేసులు పెట్టించిన ప్రభుత్వ వైఖరిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడానికి విశాఖపట్నం నుండి మంగళగిరి కి ప్రయాణమయ్యాడు పవన్ కళ్యాణ్..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘తమ పోరాటం ప్రభుత్వ నిరంకుశ వైఖరి మీద మాత్రమే ,పోలీస్ డిపార్ట్మెంట్ మీద కాదు..ఈ రెండు రోజులు మా వాళ్ళ ఏమైనా ఇబ్బంది ఉండి ఉంటే దయచేసి క్షమించండి’ అని చెప్పి బయలుదేరాడు..అయితే పవన్ కళ్యాణ్ విజయవాడ లోని గన్నవరం విమానాశ్రయం కి సరిగ్గా 5 గంటల ప్రాంతాల్లో చేరుకుంటాడు..అదే సమయం లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఫ్లైట్ కూడా గన్నవరం కి చేరుకోనుంది..ఇద్దరు ఒకే సమయం లో వస్తుండడం తో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు హై అలెర్ట్ ఏర్పాటు చేసారు..మొన్న వైజాగ్ విమానాశ్రయం లో జరిగిన సంఘటనలు మళ్ళీ చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు..ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
పవన్ కళ్యాణ్ నిన్న పోలీసులు విధించిన 41A నోటీసుని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారట..ప్రజలకు మంచి చెయ్యడం కోసం వాళ్ళ గొడ్డుని ప్రభుత్వానికి తెలియచేయడం కోసం శాంతియుతంగా నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమాన్ని అకారణంగా ఆపించేశారని..దయచేసి ఆ కార్యక్రమాన్ని మళ్ళీ తిరిగి జరుపుకోవడానికి అనుమతిని కూడా గవర్నర్ గారిని కోరబోతున్నట్టు సమాచారం..పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ న్యాయ పోరాటానికి అన్ని పార్టీల నుండి మద్దతు లభిస్తుంది..మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో పాటు ఆయన కుమారుడు నారా లోకేష్ , బీజేపీ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు..మరియు సిపిఐ సిపిఎం నేతలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ కి కాల్ చేసి సపోర్టు చేసారు..ఇక వీళ్లిద్దరి మధ్య జరుగుతున్నా ఈ ఫైట్ లో అంతిమ విజయం ఎవరిదీ అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిన అంశం.