Home Entertainment గని మూవీ 4 రోజుల వసూళ్లు ఎక్సక్లూసివ్ గా మీకోసం

గని మూవీ 4 రోజుల వసూళ్లు ఎక్సక్లూసివ్ గా మీకోసం

2 second read
0
0
6,041

వరుణ్ తేజ్ హీరో గా గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు బాబీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన గని సినిమా ఇటీవలే ప్రేక్షుకుల ముందుకి వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే,భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆ అంచనాలను అందుకోవడం లో విఫలం అయ్యింది,కథ మరియు స్క్రీన్ ప్లే నత్త నడకన సాగడం ఈ సినిమాకి పెద్ద మైనస్ అయ్యింది అనే చెప్పాలి,వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం ఎంతగానో కస్టపడ్డాడు, తన కెరీర్ లో ఏ సినిమాకి కూడా కష్టపడనంత రేంజ్ లో ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ శ్రద్ద చూపించాడు, కానీ బాక్స్ ఆఫీస్ ఫలితం మాత్రం కష్టానికి తగిన రేంజ్ లో రాకపోవడం తో వరుణ్ తేజ్ తీవ్రమైన నిరాశకి గురి అయ్యాడు,నాలుగు రోజులకు గాను ఈ సినిమా వసూలు చేసిన కలెక్షన్స్ చూస్తే అభిమానులకు కన్నీళ్లు రాక తప్పదు, ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజులకు గాను ఈ సినిమా ఎంత వసూలు చేసిందో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి దాదాపుగా 25 కోట్ల రూపాయిలు జరిగింది, మొదటి రోజు ప్లాప్ టాక్ వచ్చినప్పటికీ కూడా మెగా బ్రాండ్ ఇమేజి వల్ల రెండు కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూలు చేసింది, మొదటి రోజు పర్లేదు అనిపించినప్పటికీ రెండవ రోజు నుండి మాత్రం ప్లాప్ టాక్ ప్రభావం ఈ సినిమా మీద మాములు రేంజ్ లో పడలేదు అనే చెప్పాలి,మొదటి రోజు లో కనీసం పది శాతం వసూళ్లను కూడా ఈ సినిమా రెండవ రోజు కలెక్ట్ చెయ్యలేకపోయింది అంటే ఇది ఏ స్థాయి డిజాస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు, నాలుగు రోజుకు కలిపి ఈ సినిమా కనీసం నాలుగు కోట్ల రూపాయిలు కూడా వసూలు చెయ్యలేకపోయింది, మరో మూడు రోజుల్లో ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న KGF చాప్టర్ 2 విడుదల కాబోతుండడం తో ఈ సినిమా క్లోసింగ్ కి వచ్చేసినట్టు ట్రేడ్ వర్గాల అంచనా, ఫుల్ రన్ లో ఈ సినిమా నాలుగు కోట్ల రూపాయిల కంటే తక్కువే వసూలు చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది, ఇది వరుణ్ తేజ్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ అని చెప్పవచ్చు.

ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాలు రావాలి అంటే మరో 22 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చెయ్యాల్సిన అవసరం ఉంది, ఇప్పుడు అది అనితర సాధ్యం అని తెలియడం తో ఈ సినిమాని కొన్న బయ్యర్లకు 22 కోట్ల రూపాయిల నష్టం వాటిల్లే అవకాశం ఉంది అని తెలుస్తుంది,ఈ సినిమా ఇప్పుడు కాకుండా ఇంకా కాస్త ముందుగా వచ్చి ఉంటె కాస్త మెరుగైన వసూళ్లు వచ్చేవి అని ట్రేడ్ పండితుల అభిప్రాయం, ఎందుకంటే థియేటర్స్ లో ప్రస్తుతం RRR ప్రభంజనం కొనసాగుతూనే ఉంది, అలాంటి సినిమా ముందు నిలబడాలి అంటే కనీసం యావరేజి టాక్ అయినా ఉండాలి, అంతే కానీ ఫ్లాప్ టాక్ వస్తే మాత్రం ఇలాంటి పరిస్థితే ఎదురు అవుతుంది అని ట్రేడ్ వర్గాల్లో జరుగుతున్నా చర్చ, వరుస విజయాలతో దూసుకెళ్తున్న వరుణ్ తేజ్ కెరీర్ కి గని సినిమా పెద్ద బ్రేక్ వేసింది అనే చెప్పాలి, మళ్ళీ ఆయన F 3 సినిమాతో భారీ కం బ్యాక్ ఇవ్వాలి అని మన అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…