
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఖుషి సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. పవన్ కెరీర్లో ఖుషి బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. ఇది పవన్ 7వ సినిమాగా తెరకెక్కింది. 21 ఏళ్ల క్రితం విడుదలైన ఈ మూవీ అప్పట్లో రికార్డులను కొల్లగొట్టింది. తాజాగా ఈ సినిమాను న్యూఇయర్ సందర్భంగా విడుదల చేయగా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా తొలిరోజు రూ.3.62 కోట్లు వసూళ్లు చేయగా.. రెండో రోజు రూ.1.52 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ రూ.2 కోట్లు కాగా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.6.50 కోట్లకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది. నైజాంలో రూ.2.3 కోట్లు, సీడెడ్‌లో రూ.64 లక్షలు, ఆంధ్రా ప్రాంతంలో రూ.2.2 కోట్లను ఖుషి సినిమా సాధించింది. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో కలిపి రూ.52 లక్షలు సాధించిన ఈ మూవీ ఓవర్సీస్లోనూ రూ.25 లక్షలు కొల్లగొట్టింది. మొత్తంగా రెండు రోజుల్లో రూ.3 కోట్ల షేర్ సొంతం చేసుకుంది.
2022లో చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఇలా విడుదలైన సినిమాల్లో పవన్ కళ్యాణ్ జల్సా సినిమా రికార్డులను సృష్టించింది. ఈ మూవీ నైజాంలో తొలిరోజు రూ.1.26 కోట్లు వసూలు చేయగా ఇప్పుడు పవన్ సినిమాను పవన్ సినిమానే బీట్ చేసింది. ఖుషి తొలిరోజు రూ.1.65 కోట్ల షేర్ సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల వారీగా చూసుకుంటే జల్సా మూవీ రూ.2.57 కోట్లు వసూలు చేయగా ఖుషి మూవీ రూ.3.62 కోట్లు కొల్లగొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే జల్సా మూవీ ఇప్పటివరకు రూ.3.2 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించగా ఇప్పుడు ఖుషి మూవీ రూ.4.15 కోట్లు సాధించింది. ఈ జాబితాలో మూడో స్థానంలో మహేష్‌బాబు పోకిరి మూవీ రూ.1.73 కోట్లు, బాలయ్య చెన్నకేశవరెడ్డి రూ.1.10 కోట్లు, ప్రభాస్ బిల్లా మూవీ రూ.1.05 కోట్లు సాధించాయి.
కాగా ఓవరాల్‌గా నైజాంతో పాటు రెండు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఖుషి సినిమా రీ రిలీజ్లో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచి హీరోగా పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఏ.ఎమ్.రత్నం నిర్మించిన ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన భూమిక నటించింది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ యూత్‌కు మరింత చేరువయ్యారు. ముఖ్యంగా సిద్దు సిద్ధార్ధ రాయ్ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగులు అప్పటి యూత్‌కు కనెక్ట్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ విలన్‌ను ఉద్దేశిస్తూ.. నువ్వు గుడుంబా శంకర్ అయితే ఏంటి.. ? తొక్కలో శంకర్ అయితే ఏంటి అన్న డైలాగులు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో అలాగే నిలిచిపోయాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 21 ఏళ్ల క్రితమే రూ. 27 కోట్లను కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. ఈ మూవీకి మణిశర్మ అందించిన బాణీలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ చిత్రం అప్పట్లో 70 కేంద్రాల్లో 100 రోజులకు పైగా ప్రదర్శితమైంది.