
నలుగురిలో ఒక హీరో గా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ గా చేసి నెంబర్ 1 హీరో గా నిలబెట్టిన ఖుషి చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా మరోసారి రీ రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే..ఈ చిత్రానికి వచ్చిన ఓపెనింగ్స్ ఇప్పుడు ఇండియా లోనే హాట్ టాపిక్ గా మారింది..ఒక కొత్త సినిమా విడుదలైతే ఎలాంటి క్రేజ్ మరియు యుఫొరియా ఉంటుందో, అందుకు పడి రెట్లు ఈ సినిమాకి నిన్న ఉన్నింది.
మొదటి రోజు ఈ చిత్రానికి పడ్డ ఫుల్స్ కొంతమంది స్టార్ హీరోలకు కూడా అంతకుముందు పడలేదు..ముఖ్యంగా హైదరాబాద్ సిటీ లో డొక్కు థియేటర్స్ లో కూడా హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయి..సాధారణంగా డిసెంబర్ 31 వ తేదీన తమ చిత్రాలను విడుదల చేసుకోవడానికి భయపడుతూ ఉంటారు దర్శక నిర్మాతలు..ఎందుకంటే ఆరోజు ఆంధ్ర యూత్ మొత్తం బయట సంబరాల్లో మునిగి తేలుతుంటారు కాబట్టి..సినిమాలను పెద్దగా పట్టించుకోరు కాబట్టి.
కానీ ఖుషి చిత్రం మాత్రం రికార్డుల వర్షం కురిపించింది..మొదటిరోజు ఈ చిత్రానికి దాదాపుగా నాలుగు కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు విడుదలైన జల్సా సినిమా కి దాదాపుగా మూడు కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..ఇక ఆ తర్వాత ఎన్ని సినిమాలు విడుదల అయ్యినప్పటికీ కూడా ఒక్క సినిమా కూడా జల్సా కి దరిదాపుల్లో రాలేదు.
దీనితో ఈ చిత్రం వసూళ్లను ఇప్పట్లో కొట్టడం కష్టమే అనుకున్నారు..కానీ మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ రికార్డు ని ఖుషి తో చాలా అలవోకగా బ్రేక్ చేసి తమకి తామే సాటి..ఎవ్వరు లేరు పోటీ అని అనిపించుకున్నారు..ఇక రెండవ రోజు కూడా ఈ చిత్రానికి అదే రేంజ్ వసూళ్లు వచ్చాయి..సుమారు గా కోటి 60 లక్షల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయని ట్రేడ్ పండితులు వేస్తున్న అంచనా..చూడాలిమరి.