
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఖుషి చిత్రం ఆరోజుల్లో ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఈ చిత్రం ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది..ఒక క్లాస్ మూవీ ఆరోజుల్లో ఇలాంటి ప్రభంజనం సృష్టించడం అప్పట్లో ఒక సెన్సేషన్..ఇప్పటికీ ఈ సినిమా అంటే అభిమానులకు ఎంతో పిచ్చి..పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్స్ దగ్గర నుండి , యాక్టింగ్ వరకు ఈ సినిమాలో జీవించేసాడు.
పవన్ కళ్యాణ్ పాత సినిమాలంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి..యూత్ నడవడికనే మార్చేసిన లెజెండ్ ఆయన..ఇప్పుడు యూత్ ఫాలో అవుతున్న స్టైలింగ్..మాట్లాడే భాష ఆరోజుల్లోనే చూపించేసాడు పవన్ కళ్యాణ్..అందుకే ఆయనకీ అలాంటి కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది..మధ్యలో ఎన్నో డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు వచ్చినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ పెరగడమే కానీ తగ్గడం ఎప్పుడు జరగలేదు..ప్రతీ సినిమాకి ఆయన ఫ్యాన్స్ ని పెంచుకుంటూనే వెళ్తున్నాడు.
ఇక నిన్న విడుదలైన పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ కి రెండు తెలుగు రాష్ట్రాలు దద్దరిల్లాయి..ఎక్కడ చూసిన హంగామా తో అభిమానుల సంబరాలతో పండుగ వాతావరణం ని నెలకొల్పింది..అసలు ఒక రీ రిలీజ్ కి ఈ రేంజ్ హంగామా జరగడం అనేది ఇదివరకు ఎప్పుడూ కూడా జరగలేదు..మొట్టమొదటిసారి ఖుషి సినిమా ద్వారా మనం చూడాల్సి వచ్చింది..ఇక ఈ సినిమాకి వచ్చిన ఓపెనింగ్స్ గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలి.
అమెరికా నుండి అనకాపల్లి వరకు ఈ సినిమాకి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు..ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ కలెక్షన్స్ నమోదు అయ్యింది..రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమా కి దాదాపుగా నాలుగు కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ వసూళ్లు వచ్చాయి..ఇది ఆల్ టైం సెన్సేషనల్ రికార్డు గా చెప్పుకోవచ్చు..ఇక ప్రపాంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి దాదాపుగా 5 కోట్ల రూపాయిల వసూళ్లు వచ్చినట్టు సమాచారం..సినిమా ఇంకా వారం రోజులకు పైగా థియేట్రికల్ రన్ ఉండడం తో ఫుల్ రన్ లో ఈ సినిమా ఎంత వసూళ్లను రాబడుతుందో చూడాలి.