
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచినా ఖుషి చిత్రాన్ని డిసెంబర్ 31 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా రీ రిలీజ్ చేసారు..ఈ రిలీజ్ లో ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ చూసి ట్రేడ్ పండితులు సైతం నోరెళ్లబెట్టారు..22 ఏళ్ళ క్రితం విడుదలైన ఒక సినిమాని మళ్ళీ రీ రిలీజ్ చేస్తే జనాలు ఇంతలా ఎగబడి చూస్తారా..పవన్ కళ్యాణ్ క్రేజ్ మనం ఊహించినదానికి మించి పది రేట్లు ఎక్కువగా ఉన్నట్టుండే అనే భావన ప్రతీ ఒక్కరిలో కలిగించింది ఈ చిత్రం..అప్పట్లో ఈ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది..ఇప్పుడు రీ రిలీజ్ లో కూడా ఈ చిత్రం ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది..ఇప్పటి వరకు రీ రిలీజ్ అయినా సినిమాలలో పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమానే అత్యధిక వసూళ్లు సాధించి నెంబర్ 1 స్థానం లో నిల్చింది.
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు విడుదలైన జల్సా సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 3 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది..ఆ తర్వాత రెబెల్ , బిల్లా, వర్షం , చెన్నకేశవ రెడ్డి , బాద్షా ఇలా ఎన్ని సినిమాలు విడుదలైన ఒక్కటి కూడా జల్సా రికార్డు కి దరిదాపుల్లో రాలేకపోయాయి..కానీ ఖుషి చిత్రం మాత్రం జల్సా రికార్డు ని చాలా తేలికగా లేపేసింది..మొదటి రోజే ఈ చిత్రానికి నాలుగు కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..ఇది ఆల్ టైం అల్ ఇండియన్ రికార్డు..ఇక మొదటి వారం లో 7 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టిన ఈ చిత్రం..ఫుల్ రన్ లో దాదాపుగా 8 కోట్ల 20 లక్షల వరకు వసూళ్లను రాబట్టింది అంచనా వేస్తున్నారు..అంటే షేర్ విలువ 5 కోట్ల రూపాయలకు దగ్గరగా వచ్చింది అన్నమాట..భవిష్యత్తులో కూడా ఈ సినిమా రికార్డ్స్ ని మరో సినిమా రీ రిలీజ్ లో బద్దలు కొట్టడం అసాధ్యమే.
ఈ నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లతో ఒక చిన్న హీరో తో చిన్న బడ్జెట్ సినిమాని తీసేయొచ్చు..కొంతమంది టయర్ 2 హీరోల క్లోసింగ్ కలెక్షన్స్ కంటే కూడా ఈ చిత్రం ఎక్కువ రాబట్టింది..ఇక నుండి ఎవరైనా రీ రిలీజ్ చేసుకొని ఏదైనా రికార్డు కొడితే నాన్ పవన్ కళ్యాణ్ రికార్డు అని చెప్పుకోవాల్సిందే..పవన్ కళ్యాణ్ స్టార్ స్టేటస్ ముందు ఏ హీరో అయినా సరిపోరు అనడానికి నిదర్శనమే ఈ చిత్రం రీ రిలీజ్..ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వడం తో పవన్ కళ్యాణ్ పాత సినిమాలను రీ మాస్టర్ చేసి థియేటర్స్ లో విడుదల చేసేందుకు బయ్యర్స్ ఎగబడుతున్నారు..ఫిబ్రవరి 14 వ తేదీన వాలెంటైన్స్ డే ని పురస్కరించుకొని ‘తొలిప్రేమ’ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నారట..దీనికి అభిమానుల నుండి ఇదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి.