
మహేష్‌బాబు కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం ఏదంటే ఒక్కడు అని చెప్పాల్సిందే. 2003లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానరుపై ఎంఎస్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం విడుదలై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 7న ఈ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు ఇటీవలే అడ్వాన్స్ బుకింగ్ కౌంటర్లు ఓపెన్ అయ్యాయి. అయితే ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి. ఇదే రీతిలో ఒక్కడు సినిమాకు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఉంటాయని అభిమానులు ఊహించారు. కానీ ఒక్కడు సినిమాకు ఆ రేంజ్ వసూళ్లు రాకపోవచ్చని తాజాగా సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈనెల 7న విడుదలవుతున్న ఒక్కడు సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కేవలం రూ.48 లక్షలు మాత్రమే వచ్చినట్లు సమాచారం అందుతోంది. అదే ఖుషి సినిమాకు దాదాపుగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.3 కోట్లు వసూలు అయ్యాయి. ఇప్పటివరకు రీ రిలీజ్ అయిన సినిమాలలో ఖుషీనే అగ్రస్థానంలో ఉంది. ఒక్కడు సినిమాను ఈనెల 7, 8 తేదీల్లో తెలుగు రాష్ట్రాలతోపాటు, అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో స్పెషల్ షోస్ వేస్తున్నారు. ఇందుకోసం భారీగా థియేటర్లను కటౌట్లతో ముస్తాబు చేస్తున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాలు, ప్రవాసాంధ్రులు ఉండే ప్రాంతాల్లోనే కాకుండా కేరళలో కూడా మలయాళం వెర్షన్‌ను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేరళలోని ముక్కంతోపాటు ఇతర ప్రాంతాల్లో ఈ సినిమాను ప్రదర్శించేందుకు ప్లాన్ చేశారు. పీసీ థియేటర్‌లో ఈ స్పెషల్ షో ఉంటుందని మహేష్‌బాబు అభిమానులు చెప్తున్నారు.
కాగా ఒక్కడు మూవీ జనవరి 15, 2003 సంవత్సరంలో అంచనాలు లేకుండా వచ్చిఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. డిస్టిబ్యూటర్ షేర్ 30 కోట్ల మేర నమోదు చేసింది. అప్పటి వరకు హిట్టు కోసం ఎదురు చూస్తున్న మహేష్ బాబుకు ఓవర్‌నైట్ స్టార్‌డమ్ తెచ్చి పెట్టింది. ఆ ఏడాది నంది అవార్డుల కార్యక్రమంలో ఎనిమిది అవార్డులను గెలుచు కోవడం విశేషంగా మారింది. ఈ సినిమా రిలీజై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాను ప్రత్యేకంగా 4కేలోకి మార్చి సౌండ్ సిస్టమ్‌ను మెరుగుపరిచి మరోసారి థియేటర్లలోకి రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించి.. మేకర్స్‌కు కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాలో భూమికా చావ్లా హీరోయిన్‌గా నటించగా.. ప్రకాష్ రాజ్ విలన్‌గా నటించాడు. ముఖేష్ రిషి, అజయ్, తెలంగాణ శకుంతల కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను 14 కోట్ల వ్యయంతో తెరకెక్కించారు. సినిమాటోగ్రాఫర్ శేఖర్ జోసెఫ్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, మ్యూజిక్ మణిశర్మ లాంటి అత్యుత్తమ సాంకేతిక నిపుణులు పనిచేశారు. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్‌లో రూపొందిన ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ మాటలు అందించారు.