
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నేటి తరం హీరోలలో కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అనే పదానికి సరికొత్త నిర్వచనం తెచ్చిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..అందరి హీరోలకు అభిమానులు ఉంటారు..కానీ పవన్ కళ్యాణ్ కి మాత్రం భక్తులు ఉంటారు..ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా కూడా తరగని క్రేజ్ ఆయన సొంతం..నిజం చెప్పాలంటే అత్తారింటికి దారేది వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ కి తన రేంజ్ బ్లాక్ బస్టర్ తగలలేదు.
మధ్యలో వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి కానీ , అవి రెండు కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల తన రేంజ్ బ్లాక్ బస్టర్స్ కాలేకపోయాయి..ఆ ప్రత్యేక కారణాలు ఏంటో ప్రతీ ఒక్కరికి తెలుసు..అలా సరైన హిట్ లేకపోయినా కూడా అభిమానుల్లో పవన్ కళ్యాణ్ పై ఇసుమంత అభిమానం కూడా తగ్గలేదు..ఇంకా చెప్పాలంటే పెరిగింది..దానికి లేటెస్ట్ ఉదాహరణ ఖుషి మూవీ రీ రిలీజ్..డిసెంబర్ 31 వ తారీఖున ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేసారు.
అభిమానం మితిమీరిపోయింది..ఎక్కడ చూసిన పవర్ స్టార్ జిందాబాద్ నినాదాలతో హోరెత్తించేసారు..అసలు విడుదలైంది కొత్త సినిమానా..లేదా పాత సినిమానా అని చూసే ప్రతీ ఒక్కరికి అనుమానం కలిగింది..ఆ స్థాయిలో విద్వాంసం సృష్టించేసారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్..ముఖ్యంగా జగ్గయ్యపేట లోని కమల థియేటర్ లో నిన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసిన హంగామా ఇప్పుడు సౌత్ ఇండియాలోనే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది..థియేటర్ లో ఎగరవేసిన కాగితాలన్నీ పోగు చేసి స్క్రీన్ ముందు భోగి మంటలాగా వేసి వెలిగించారు ఫ్యాన్స్.
అది గమనించిన థియేటర్ యాజమాన్యం షో ఆపివేసి వెంటనే లోపలకు వచ్చి ప్రేక్షకులందరిని వెనక్కి పంపేశారు..ఇలాగే కొనసాగితే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన రీ రిలీజ్ లు ఇక చేయబోమని థియేటర్స్ యాజమాన్యాలు హెచ్చరిస్తున్నాయి..గతం లో జల్సా మూవీ స్పెషల్ షోస్ కి కూడా ఫ్యాన్స్ ఇలాగే చేసారు..వాళ్ళ దెబ్బకి ఖుషి మూవీ ని వేసుకోడానికి చాలా థియేటర్స్ నిరాకరించాయి..భవిష్యత్తులో ఇక పవన్ కళ్యాణ్ కి సంబంధించిన స్పెషల్ షోస్ విషయం లో యాజమాన్యాలు ఎలా ప్రవరిస్తాయో చూడాలి.