Home Movie News రవితేజ క్రాక్ ఫుల్ మూవీ ఎక్సక్లూసివ్ గా మీ కోసం

రవితేజ క్రాక్ ఫుల్ మూవీ ఎక్సక్లూసివ్ గా మీ కోసం

0 second read
0
4
34,893

కరోనా కారణంగా థియేటర్స్ మూతపడి చాలా కాలం నుండి తీవ్రమైన నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న డిస్ట్రిబ్యూటర్స్ మరియు బయ్యర్స్ కి ఈ సంక్రాంతి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపింది అనే చెప్పొచ్చు, మాస్ మహా రాజా రవితేజ నటించిన క్రాక్ సినిమా బాక్స్ ఆఫీస్ కి మళ్ళీ పూర్వ వైభవం తెచ్చేలా చేసింది, చాలా కాలం నుండి హిట్ కోసం ఎంతగానో నిరీక్షిస్తున్న మాస్ మహా రాజా రవితేజ కి క్రాక్ సినిమా మాములు జోష్ ని ఇవ్వలేదు, ఈ సినిమాని కొన్న ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కి పెట్టిన పైసాకి పదింతలు లాభాల్ని తెచ్చి పెట్టింది,తోలి రోజు విడుదల ఆగిపోవడం వల్ల 6 కోట్ల రూపాయిల నష్టం దానికి తోడు థియేటర్స్ కొరత మరియు 50 శాతం సీటింగ్ కెపాసిటీ ఉన్న థియేటర్స్, ఇన్ని అడ్డంకులను దాటుకొని ఒక్క సినిమా 40 కోట్ల రూపాయిలు వసూలు చెయ్యడం అంటే సాధారణ విషయం కాదు అనే చెప్పాలి, మాస్ మహా రాజా రవితేజ బాక్స్ ఆఫీస్ స్టామినా కి ఇది ఒక్క నిదర్శనం అనే చెప్పొచ్చు.

థియేటర్స్ లో ఇప్పటికి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తున్న ఈ సినిమా ప్రతి రోజు దాదాపు గా ఒక్క కోటి రూపాయిల షేర్ ని వసూలు చేస్తూ ముందుకి దూసుకుపోతుంది, అయితే ఇంత కాలం థియేటర్స్ లో ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమా, ఈ ఫిబ్రవరి 5వ తారీకు నుండి ఆహ ఓ టీ టీ ప్లాటుఫారం లో విడుదల అవ్వబోతున్నట్టు ఆ సినిమా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.ఇక ఆ యాప్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఉచితంగా చూసేయొచ్చు అన్నమాట, అయితే థియేటర్స్ లో ఇంకా 10 కోట్ల రూపాయలు షేర్ ని వసూలు చేసే సత్తా ఉన్నా క్రాక్ సినిమాని అప్పుడే ఓ టీ టీ ప్లాట్ఫారం లో విడుదల చెయ్యడం పై డిస్ట్రిబ్యూటర్స్ అభ్యన్తరం వ్యక్తపరుస్తున్నారు,దీని వల్ల కలెక్షన్స్ కి బొక్క పడే ఛాన్స్ ఉంది అని, ప్రొడ్యూసర్స్ ఎందుకు ఇలాంటి పని చేస్తున్నారు అని వాళ్ళు వాపోతున్నారు,వాస్తవానికి ఈ సినిమా ప్రొడ్యూసర్లు క్రాక్ సినిమా కరోనా ని జయించి ఈ స్థాయిలో అద్భుత విజయం సాధిస్తుంది అని అనుకోలేదు, అందుకే వాళ్ళు లాస్ రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఈ సినిమాని మూడు వారల తర్వాత ఓ టీ టీ లో విడుదల చేస్తున్నాము అని ఒప్పందం చేసుకున్నారు, అయితే ఆ ఒప్పందం ప్రకారం ఈ సినిమా ఈ ఫిబ్రవరి 5వ తారీఖున ఆహ లో విడుదల అయ్యింది,విడుదలైన తోలి రోజే ఈ సినిమాని 22 లక్షల మంది వీక్షించారు, ఇది ఆహ మీడియా ప్లాటుఫారం లోనే సరికొత్త రికార్డు.

ఇక ఈ సినిమాని థియేటర్స్ లో మిస్ అయినా ప్రతి ఒక్కరు ఓ టీ టీ లో చూసుకోవచ్చు అన్నమాట, అయితే ఈ సినిమా ఓ టీ టీ లో విడుదల అయినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ కి మాత్రం ఎలాంటి డోకా లేదు అని రవితేజ అభిమానులు బల్ల గుద్ది మరి చెప్తున్నారు, ఎందుకంటే ఈ సినిమాని మాస్ థియేటర్స్ లో చూస్తేనే ఫుల్ కిక్ ఉంటుంది, ఇంట్లో కానీ , మల్టీ ప్లెక్స్ లో కానీ చూస్తే ఆ కిక్ రాదు, కాబట్టి మాస్ ఆడియన్స్ తాకిడి ఇప్పట్లో తగ్గదు అనే రవితేజ అభిమానుల వాదన,అటు పక్క ట్రేడ్ విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయం పడుతున్నారు, ఫిబ్రవరి 5వ తేదీ నుండి ఆహ ప్లాటుఫారం లో విజయవంతంగా ప్రసారం అవుతూ తోలి రోజే రికార్డు సృష్టించిన ఈ చిత్రం రాబొయ్యే రోజుల్లో ఇంకా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి,ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఇప్పటి వరుకు ఎలా ఉన్నాయి అంటే మొదటి రోజు 7 కోట్ల రూపాయిల షేర్ తో ప్రారంభం అయినా ఈ సినిమా 13 రోజులకు గాను 32 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది, అడ్డంకులు ఏమి రాకపోయి ఉంటె ఈ సినిమా 40 నుండి 50 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసే అవకాశం ఉండేది అని ట్రేడ్ పండితుల అంచనా, కానీ ప్రస్తుత కలెక్షన్స్ ట్రెండ్ ని చూస్తుంటే ఈ సినిమా 40 కోట్ల రూపాయిల షేర్  ని  అందుకుంది అని , ఒక్కవేల ఈ సినిమా 50 కోట్ల మార్కుని అందుకుంటే మాత్రం రవితేజ క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ కి దండం పెట్టేయొచ్చు, మరి ఫుల్ రన్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూద్దాం.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Movie News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

వారసుడు రాబోతున్నాడు అంటూ మెగాస్టార్ చిరంజీవి షాకింగ్ కామెంట్స్

సౌత్ ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరు రామ్ చరణ్ – ఉపాసన కొణిదెల జంట..ఈ …