Home Entertainment కొరటాల శివ పై తీవ్రమైన ఆరోపణలు చేసిన మెగాస్టార్ చిరంజీవి

కొరటాల శివ పై తీవ్రమైన ఆరోపణలు చేసిన మెగాస్టార్ చిరంజీవి

0 second read
0
0
4,601

ఈ ఏడాది విడుదలైన సినిమాలలో భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచినా సినిమాలలో ఒకటి మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన ఆచార్య చిత్రం..చిరంజీవి తో పాటు ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించడం తో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎవ్వరు ఊహించని రేంజ్ లో జరిగింది..ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి ఈ సినిమాకి 135 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది..కానీ సినిమా విడుదలై మొదటి రోజు మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం తో ఓపెనింగ్స్ దగ్గర నుండే ఈ సినిమా దారుణమైన వసూళ్లు వచ్చాయి..ఫుల్ రన్ లో కనీసం 50 కోట్ల రూపాయిల షేర్ ని కూడా దక్కించుకోలేకపోవడం గమనార్హం..అంత పెద్ద కాంబినేషన్ కూడా కథ, కథనం సరిగా లేకపోతే డిజాస్టర్ అవ్వడం పక్కా అని ఈ సినిమా నిరూపించేలా చేసింది..ఈ సినిమా విషయం లో డైరెక్టర్ కొరటాల శివ మేకింగ్ మీదకంటే ఎక్కువగా సినిమాని ఏరియా వారీగా అమ్ముకోవడం పైనే దృష్టిపెట్టినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించే మాట.

ఆ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి వద్ద కొరటాల శివ 80 కోట్ల రూపాయలకు రైట్స్ కొనుక్కొని, డిస్ట్రిబ్యూటర్స్ కి 135 కోట్ల రూపాయలకు అమ్ముకున్నాడు..సినిమా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యి డిస్ట్రిబ్యూటర్స్ కి దాదాపుగా 85 కోట్ల రూపాయిల నష్టం వచ్చింది..ఇందులో కనీసం 40 కోట్ల రూపాయిలైనా వెనక్కి తిరిగి ఇవ్వాల్సిందే అంటూ బయ్యర్లు కొరటాల శివ పై ఒత్తిడి పెట్టడం తో ఆయన తన ఆస్తిని తాకట్టు పెట్టి వారికి డబ్బులు తిరిగి ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి..ఇవన్నీ పక్కన పెడితే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ ని పరోక్షంగా ఉద్దేశిస్తూ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది..ఆయన మాట్లాడుతూ ‘ఇటీవల కాలం లో ఒక దర్శకుడు షూటింగ్ స్పాట్ లోనే సీన్స్ రాయడం..డైలాగ్స్ రాయడం చూసాను..చాలా కోపం వచ్చింది..ముందుగా ప్రిపేర్ గా ఉంటె మేము ఆ డైలాగ్స్ బాగా ప్రిపేర్ అయ్యి సన్నివేశం ని మరింత రక్తికట్టించగలం..ఇది కేవలం నా విషయం లోనే కాదు..చాలా మంది స్టార్స్ హీరోస్ విషయం లో ఇలా జరిగింది..ఇతర విషయాల మీద కాకుండా దర్శకులు ముందు కథ, కథనం మీద మాత్రమే ద్రుష్టి పెట్టాలని కోరుకుంటున్నాను’ అంటూ కొరటాల శివ ని ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు సెన్సషనల్ గా మారింది.

దీనిని బట్టి చూస్తుంటే చిరంజీవి కొరటాల శివ పై చాలా తీవ్రమైన అసహనం తో ఉన్నట్టు తెలుస్తుంది..ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ప్రముఖ తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం లో మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచినా ‘లూసిఫెర్’ సినిమాని తెలుగు లో ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చెయ్యగా దానికి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రాబోతుంది..ఈ సినిమా తో పాటుగా మెగాస్టార్ భోళా శంకర్ మరియు వాల్తేరు వీరయ్య వంటి సినిమాలలో నటిస్తున్నాడు..ఆచార్య సినిమా తో అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచిన మెగాస్టార్ చిరంజీవి..రాబొయ్యే సినిమాలతో బాక్స్ ఆఫీస్ దుమ్ము దులుపుతాడని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…