
తెలుగు చలన చిత్ర పరిశ్రమకి నేడు బ్లాక్ డే..ఇండస్ట్రీ లో ఒక సంచలనం..తెలుగు సినిమా కీర్తి ప్రతిష్టలను శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లిన మహానటుడు..మన అల్లూరి సీతారామ రాజు..మన తెలుగు సినిమా జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ కృష్ణ గారు నేడు ఉదయం నాలుగు గంటలకు కన్నుమూశారు..మొన్న రాత్రి గుండెపోటు రావడం తో హైదరాబాద్ లో ఉన్న కాంటినెంటల్ హాస్పిటల్ కి ఆయనని తరలించగా అప్పటికే ఆయన పరిస్థితి అత్యంత విషమం గా ఉంది..డాక్టర్లు 20 నిమిషాల్లోపు CPR చేసి కృష్ణ గారి ఊపిరి ని పోకుండా కాపాడారు..ఆ తర్వాత ఆయనని ఐసియు లో అడ్మిట్ చేసి ఎమర్జెన్సీ చికిత్స ప్రారంభించారు..కచ్చితంగా ఆయన సురక్షితంగా బయటకి వస్తారనే అందరూ అనుకున్నారు..కానీ ఇలా జరుగుతుందని కలలో కూడా ఎవ్వరు ఊహించలేకపోయారు..కృష్ణ గారు మన తెలుగు సినిమాకి ఒక విలువైన సంపద లాంటి వారు..సాహసానికి మారు పేరు..టెక్నాలజీ పరంగా ఇండస్ట్రీ ఎక్కడికో తీసుకెళ్లిన మహామనిషి..అలాంటి మహానుభావుడు కోల్పోవడం తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పూడవలేని నష్టం..అలాంటి మహానటుడు మళ్ళీ రాడు.
ఇక ఆయన తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తండ్రిని మించిన తనయుడిగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు..ఆయన ప్రస్తుతం పడుతున్న మనోవేదన ప్రపంచం లో ఎవ్వరికి కూడా రాకూడదు..నెలల వ్యవధిలోనే అన్నయ్య ని, అమ్మని మరియు నాన్న ని కోల్పోవడం బహుశా మనం ఎప్పుడు కూడా చూసి ఉండము..నూటికో కోటికో ఒకరిద్దరి కుటుంబాలకు జరుగుతాయి అలా..అది కోట్లాది మంది అభిమానించే ఘట్టమనేని కుటుంబానికి జరగడం నిజంగా దురదృష్టకరం..మహేష్ బాబు సేవ కార్యక్రమాల ద్వారా ఎన్ని కుటుంబాలలో వెలుగుని నింపారో మన అందరికి తెలిసిందే..ఎన్నో వేలమంది చిన్నారులకు ఆయన గుండె ఆపరేషన్స్ చేయించాడు..అలాంటి మహోన్నత వ్యక్తిత్వం ఉన్న మహేష్ బాబు గారు ఏ పాపం చేసారని దేవుడు ఆయనకీ ఇలాంటి శిక్షని విధించాడంటూ మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా లో రోదిస్తున్నారు..ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదని వాళ్ళు ఆ దేవుడికి ప్రార్థనలు చేస్తున్నారు.
పెద్దవయసు లో కృష్ణ గారు కూడా ఎవ్వరు చూడనటువంటి సంఘటనలు చూసాడు..విజయ నిర్మల గారు కోల్పోవడం తోనే కృష్ణ గారిలో సగం మానసిక సంక్షోభం ఎదురైంది..ఆ తర్వాత కొడుకు రమేష్ బాబు చనిపోవడం మరో కోలుకోలేని దెబ్బ..ఇక తనలో సగమైనా ఇందిరా దేవి గారు కూడా ఇటీవలే చనిపోవడం కృష్ణ గారిని మానసికంగా ఎంతో కృంగిపోయేలా చేసింది..ఇలా వరుసగా ఇన్ని విషాదాలు చోటు చేసుకోవడం తో కృష్ణ గారు చాలా కృంగిపోయారు..సగం ఆ దిగులొతోనే ఆయనకి గుండెపోటు వచుంటుంది అని కృష్ణ గారి శ్రేయోభిలాషులు చెప్తున్నారు..గుండెపోటు రావడం తో కృష్ణ గారిలో అవయవాలు ఒక్కొక్కటిగా పనిచెయ్యడం మానేశాయి..దీనితో ఆయన శాశ్వతంగా తిరిగిరాని లోకాలకి పయనమయ్యారు..మంచి తనానికి మరోపేరు లాంటి కృష్ణ గారి పవిత్రమైన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటుంటూ ఆ దేవుడికి మన అందరం మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాము.