
సూపర్ స్టార్ కృష్ణ గారు గుండెపోటు రావడం తో మొన్న రాత్రి హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం కన్నుమూసిన దురాగతానా యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది..5 దశాబ్దాల సినీ ప్రస్థానం లో కృష్ణ గారు తెలుగు సినీ కళామ్మతల్లికి అందించిన సేవలు చిరస్మరణీయమైనవి..టాలీవుడ్ లో కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అనే పదానికి పర్యాయపదం లాగ నిలిచిన వ్యక్తి ఆయన..మాస్ లో ఆనాడు ఆయన సృష్టించిన ప్రభంజనం నేటి తరం మాస్ హీరోలకు ఒక కొలమానం..సినిమాలు మానేసి చాలా కాలం అయ్యినప్పటికీ కూడా ఆయన అభిమానులు ఇప్పటికి ఆరాద్యదైవంలాగా కొలుస్తూనే ఉంటారు..ఇండస్ట్రీ లో సరికొత్త జానర్లు..సరికొత్త టెక్నాలజీ ని పరిచయం చేసి సాంకేతికంగా వేరే స్థాయికి మన ఇండస్ట్రీ ని నిలబెట్టిన మనిషి ఆయన..ఆయన వారసత్వాన్ని ఒణికిపుచ్చుకొని ఆయన రెండవ కుమారుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రిని మించిన తనయుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఎన్నో సంచలన విజయాలు తన ఖాతాలో వేసుకొని కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.
తన తండ్రి కృష్ణ గారంటే మహేష్ బాబు కి ఒక ఆరాధ్య దైవం..ఎన్నో సందర్భాలలో మహేష్ బాబు తన తండ్రి పట్ల ఉన్న అభిమానం ని చాటుకుంటూ వచ్చారు..నేను ఈరోజు ఈ స్థానం లో ఉండడానికి ప్రధాన మా నాన్న కృష్ణ గారు మరియు ఆయన అభిమానులే..ఆయన కొడుకుగా పుట్టడం నేను చేసుకున్న అదృష్టం అంటూ మహేష్ బాబు ఎన్నో సందర్భాలలో ఎమోషనల్ కూడా అయ్యాడు..తన జీవితం లో అటువంటి ప్రాముఖ్యత కలిగిన విలువైన మనిషి కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం..పాపం మహేష్ బాబు కి ఈ ఏడాది ఇలాంటి సందర్భాలు మూడు సార్లు ఎదురయ్యాయి..ఈ ఏడాది ప్రారంభం లో మహేష్ బాబు గారి అన్నయ్య చనిపోవడం..అదే సమయం లో మహేష్ బాబు కి కరోనా సోకడం వల్ల కనీసం చివరి చూపుకి కూడా నోచుకోకపోవడం అతనిని ఎంతలాగ బాధించి ఉంటుందో ఊహించుకోవచ్చు..ఇక రెండు నెలల క్రితమే మహేష్ గారి తల్లి ఇందిరా దేవి గారు మరణించడం అతనిని మానసికంగా మరింత కృంగిపోయేలా చేసింది.
ఇప్పుడు తన జీవితం లో అతి పెద్ద బలం మరియు బలహీనతైనా సూపర్ స్టార్ కృష్ణ గారు చనిపోవడం..అది కూడా తల్లి చనిపోయి రెండు నెలలు కూడా గడవకముందే..పగవాడికి కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించగలమా..ఎప్పుడు బలంగా ఉంటూ కుటుంబ సబ్యులకు ధైర్యం చెప్పే మహేష్ బాబు ఈరోజు తానూ కూడా ధైర్యం కోల్పయి చిన్నపిల్లవాడిలాగా ఏడుస్తూ కనిపించిన వీడియోలు చూసి అభిమానులు ఎంతలా బాదపడుంటారో వర్ణనాతీతం..రాఘవేంద్ర రావు గారు మహేష్ బాబు దగ్గరకి రాగానే అతనిని గట్టిగ హత్తుకొని వెక్కిళ్లు పెట్టిమరీ ఏడ్చినా మహేష్ బాబు ని చూసి అభిమానులు బోరున విలపిస్తున్నారు..ఎక్కడ చూసిన ఈ వీడియోనే సోషల్ మీడియా లో సర్క్యూలేట్ అవుతుంది..మహేష్ బాబు లాంటి సేవాస్ఫూర్తి గల వ్యక్తికీ..వేలాది మంది చిన్నారుల ప్రాణాలను కాపాడిన ఉన్నతమైన మనసున్న వ్యక్తికీ..ఈరోజు ఇలాంటి దుస్థితి కలిపించడం చూస్తుంటే అసలు దేవుడు ఉన్నాడా అనే సందేహం రాక తప్పదు..మహేష్ బాబు గారికి ఆయన కుటుంబానికి ఆ దేవుడు ఈ శోకాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము.