
సూపర్ స్టార్ కృష్ణ గారు గుండెపోటు తో మరణించిన ఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసిన సంగతి మన అందరికి తెలిసిందే..టాలీవుడ్ కి మొట్టమొదటి బిగ్గెస్ట్ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఆయన..ఆరోజుల్లో ‘సూర్య చంద్రులు లేని రోజులైనా ఉంటాయేమో కానీ, కృష్ణ గారి పోస్టర్ లేని రోజులు మాత్రం ఉండేవి కాదు’ అనేవారట..ఆ స్థాయిలో ఆయన తెలుగు చలన చిత్ర పరిశ్రమని ఎలినాడు..తెలుగు చలన చిత్ర పరిశ్రమకి 70 ఎంఎం, సౌత్ స్కోప్ మరియు ఈస్ట్ మెన్ కలర్ వంటి టెక్నాలిజీలను పరిచయం చెయ్యడమే కాకుండా..కౌ బాయ్ మరియు స్పై థ్రిల్లర్ జానర్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేసిన మహానుభావుడు ఆయన..అందుకే కృష్ణ గారంటే తెలుగు ఆడియన్స్ కి అంత పిచ్చి..అలాంటి మహానుభావుడు ఈరోజు మన అందరిని వదిలి తిరిగిరాని లోకాలకు ప్రయాణం అయ్యాడు అనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాము..ఇది ఇలా ఉండగా ఘట్టమనేని కుటుంబం లో ఒక ఐరన్ లెగ్ అడుగుపెట్టడం వల్లే కుటుంబం లో అందరూ కోల్పోతున్నారని సోషల్ మీడియా లో ఒక కథనం ప్రచారం అవుతుంది.
కృష్ణ గారి రెండవ భార్య విజయ నిర్మల కొడుకు నరేష్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం మంచి బిజీ ఆర్టిస్టు అనే సంగతి మనకి తెలుసు..హీరో గా అప్పట్లో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న నరేష్, క్యారక్టర్ ఆర్టిస్టు గా ఇంకా ఎక్కువ సక్సెస్లు చూసారు..నటుడిగా గొప్ప నటుడే..అందులో ఎలాంటి సందేహం లేదు..కానీ వ్యక్తిగతం గా ఇతను ఘట్టమనేని కుటుంబానికి పెద్ద మచ్చ తీసుకొచ్చాడు..మూడు సార్లు విడాకులు తీసుకున్న ఈయన ప్రముఖ ఆర్టిస్టు పవిత్ర లోకేష్ తో చాలా కాలం నుండి డేటింగ్ లో ఉన్నాడు..ప్రస్తుతం ఆమెతోనే తన జీవితం కొనసాగిస్తున్నాడు..నరేష్ మూడవ భార్య రమ్య అతను చేస్తున్న మోసాన్ని మీడియా ముందుకి వచ్చి ఎలాంటి ఆరోపణలు చేసిందో మన అందరం అంత తేలికగా మరచిపోలేము..అయితే ఎప్పుడైతే పవిత్ర లోకేష్ ని ఘట్టమనేని కుటుంబంలోకి నరేష్ తీసుకొచ్చాడో..ఆమె అడుగుపెట్టిన వేళావిశేషం ఘట్టమనేని కుటుంబం లో ముక్యులందరు కన్నుమూశారు అని సోషల్ మీడియా లో ఒక కథనం తెగ హల్చల్ చేస్తుంది.
ఈమె అడుగుపెట్టిన కొత్తల్లోనే కృష్ణ గారి పెద్ద కుమారుడు రమేష్ బాబు అనారోగ్యం తో కన్ను మూసారు..ఆ తర్వాత ఈమధ్యనే రెండు నెలల క్రితం కృష్ణ గారి సతీమణి ఇందిరా దేవి గారు కన్నుమూశారు..ఇప్పుడు ఏకంగా కృష్ణ గారు కూడా స్వర్గస్తులయ్యారు..పరిశీలించి చూస్తే అది నిజమేనేమో అనిపిస్తాడు కానీ ఇలాంటి మూఢనమ్మకాలను సీరియస్ గా తీసుకోలేము..వయసు మీదపడినా తర్వాత చనిపోవడం సర్వసాధారణం..కృష మరియు ఇండియా దేవి గార్లది చిన్న వయసేమి కాదు.. సహజం గానే వాళ్ళ మరణం సంభవించిందని కొంతమంది అంటున్నారు..ఇది ఇలా ఉండగా ఈ మధ్యనే నరేష్ మరియు పవిత్ర మధ్య విభేదాలొచ్చి విడిపోయారంటూ వార్తలు కూడా వచ్చాయి..కానీ మేము కలిసే ఉన్నాము అని చెప్పడానికి ఉదాహరణగా కృష్ణ గారి అంత్యక్రియలకు మొత్తం ప్రారంభం నుండి చివరి వరుకు నరేష్ – పవిత్ర కలిసి అన్ని వ్యవహారాలను చూసుకున్నారు..విజయనిర్మల చనిపోయిన తర్వాత కృష్ణ గారి బాగోగులు అన్ని నరేష్ స్వయంగా చూస్కునేవాడని కృష్ణ పలు ఇంటర్వూస్ లో తెలిపాడు..ఆలా కృష్ణ గారితో నరేష్ కి సొంత కొడుకు అనే స్థాయిలో అనుబంధం ఉంది.