
టాలీవుడ్ లో ఎన్నో ఆల్ టైం క్లాసిక్ సినిమాలు మరియు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ టైం గత కొంతకాలం నుండి ఏమాత్రం కూడా బాగోలేదు.2017 వ సంవత్సరం లో ఆయన తీసిన నక్షత్రం అనే చిత్రం తర్వాత మళ్ళీ ఆయన ఎలాంటి సినిమా కూడా చెయ్యలేదు.అయితే చేస్తే చరిత్ర లో గుర్తిండిపోయ్యేలా చెయ్యాలి.ఒక చక్కటి కథ, భారీ బడ్జెట్ వంటివి లేకుండా కేవలం రెండు కోట్ల రూపాయిల లోపే బడ్జెట్ తో ఒక సినిమాని చెయ్యాలి అనే కసితో ‘రంగమార్తాండ’ అనే చిత్రం చేసాడు.మరాఠీ లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ‘నట సామ్రాట్’ అనే సినిమాకి రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరేక్కించాడు డైరెక్టర్ కృష్ణ వంశీ.ప్రకాష్ రాజ్ , బ్రహ్మానందం, రమ్య కృష్ణ లను ప్రధాన పాత్రలు గా తీసుకొని ఆయన తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించిందా లేదా అనేది ఇప్పుడు చూడబోతున్నాం.
కథ విషయానికి వస్తే రంగస్థల నాటకాలు వేసి గొప్ప నటుడిగా పేరు తెచ్చుకొని లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న రాఘవయ్య కి ఒక రోజు అభిమానులు భారీ సభ ని ఏర్పాటు చేసి ఆయనకీ రంగమార్తాండ అనే బిరుదుతో సత్కరించుకుంటారు.అదే సభలో ఆయన ఇక నాటకాలకు ఇక సెలవు ప్రకటిస్తున్నాను అంటూ ఒక ప్రకటన చేసి అందరికి షాక్ ఇస్తాడు.ఇక అప్పటి వరకు ఆయన సంపాదించుకున్న ఆస్తి మొత్తాన్ని తన కొడుకులు మరియు కూతుర్ల పేరిట రాసేసి తన బాధ్యత మొత్తాన్ని పూర్తి చేసుకుంటాడు.అయితే ఆధునిక యుగానికి బాగా అలవాటు పడిన పిల్లలు తండ్రి రాఘవయ్య ని , మరియు తల్లిని ( రమ్య కృష్ణ) కొన్ని సంఘటనలు జరగడం కారణంగా ఘోరంగా అవమానిస్తారు.ఆ తర్వాత వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోతారు.చిన్నప్పటి నుండి రాఘవయ్య కష్టసుఖాలను పంచుకునే చక్రపాణి( బ్రహ్మానందం) వీరికి ఆసరాగా నిలుస్తాడు.ఆయన వల్ల కథ ఎలా మలుపులు తిరిగింది అనేది తెలుసుకోవాలంటే వెండితెర మీద చూడాల్సిందే.
ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఇది చిత్రం కాదు..మన జీవితం.వెండితెర మీద ఈ చిత్రాన్ని చూస్తునంతసేపు మన జీవితాలను మనమే చూసుకుంటున్నట్టు అనిపిస్తుంది.ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన నటీనటులు జీవించారు అనే చెప్పాలి.ప్రకాష్ రాజ్ నటన ని చూసే ప్రతీ తండ్రి తనని తానూ ఊహించుకుంటాడు.అంత అద్భుతంగా పాత్రలో లీనమయ్యాడు ఆయన.ఇక రమ్య కృష్ణ కి కూడా చాలా కాలం తర్వాత ఒక అద్భుతమైన పాత్ర దక్కింది.ఇది ఇలా ఉండగా బ్రహ్మాండం గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి.ఇంతకాలం ఆయనని డైరెక్టర్స్ కేవలం కామెడీ కోసమే వాడుకున్నారు, కానీ ఒక నటుడిగా బ్రహ్మానందం లో ఎవ్వరూ ఊహించని ఎమోషనల్ కోణం కూడా ఉందని డైరెక్టర్ కృష్ణ వంశీ ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులందరికీ తెలిసేలా చేసాడు.ఆయన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు.అలా ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కిన ఈ సినిమా వీకెండ్ కి ఫ్యామిలీ ఆడియన్స్ తో కచ్చితంగా చూడాల్సిన సినిమా , మిస్ అవ్వకండి.