
తెలుగు చలన చిత్ర పరిశ్రమ గత కొంతకాలం నుండి ఇండస్ట్రీ లో ఎంతో మంది మహానటులను, దిగ్గజాలను కోల్పోయింది..వారు లేని లోటు ఎవ్వరు తీర్చలేనిది..ఆలా వరుసగా చేదు వార్తలను వింటూ తీవ్రమైన శోకసంద్రం లో మునిగిపోయిన సినీ పరిశ్రమకి ఇప్పుడు మరో విషాద సంఘటన ఇండస్ట్రీ ని కదిలించి వేసింది..రెండవ తరం అగ్ర కథానాయకుడు రెబెల్ స్టార్ కృష్ణంరాజు గారు ఈరోజు ఉదయం 3 గంటల నలభై నిమిషాలకు తన చివరి శ్వాసని విడిచారు..83 ఏళ్ళ వయస్సు ఉన్న కృష్ణంరాజు గారు గత కొంతకాలం నుండి అస్వస్థతతో బాధపడుతున్నారు..మధ్యలో అనేకసార్లు ఆయన ఆసుపత్రి కి వెళ్లి చికిత్స చేయించుకొని ఇంటికి తిరిగి వచ్చేవారు..కానీ నిన్న రాత్రి ఆసుపత్రిలో చేరి మళ్ళీ ఇక ఈ జన్మ లో తిరిగిరాడు అని మాత్రం కలలో కూడా ఎవ్వరు ఊహించలేకపోయారు..ఆయన లేని లోటు ఎవ్వరు పూడవలేనిది..ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న కృష్ణం రాజు గారు అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరో గా ఎదిగాడు.
కేవలం సినీ రంగం లో మాత్రమే కాదు..రాజకీయ రంగం లో కూడా అద్భుతంగా రాణించారు..బీజేపీ పార్టీ లో మొదటి నుండి ముఖ్య నేతలలో ఒకరిగా కొనసాగుతున్న కృష్ణంరాజు గారు కేంద్ర మంత్రి గా కూడా పని చేసి నిజాయితీ తో కూడిన రాజకీయాలు చేసి స్వచ్ఛమైన సేవలు అందించాడు..అంతే కాకుండా కొత్తవాళ్ళని ప్రోత్సహించడం లో కృష్ణంరాజు ఎప్పుడు ముందుంటారు..తన స్థాయి మరియు స్టార్ స్టేటస్ ని కూడా మర్చిపొయ్యి తన ఇంటికి వచ్చిన వారిని సొంత కుటుంబ సభ్యులులాగా ట్రీట్ చేసి పంపించడం కృష్ణంరాజు గారి గొప్ప మనసుకి తార్కాణం..ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఆయన చేసిన సేవ కార్యక్రమాల గురించి ఎంత చెప్పిన అది తక్కువే అవుతుంది..మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ లో క్రియాశీలక పాత్ర ని పోషిస్తూ ఇండస్ట్రీ కి ఏ కష్టమొచ్చినా నేను ఉన్నాను అంటూ ముందుకి వచ్చి సహాయం చెయ్యడం కృష్ణంరాజు గారికి అలవాటైన విషయం..ఇక ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి కూడా ఆయన నేడు వేల కోట్ల రూపాయిలు బిజినెస్ జరుపుతున్న ప్రభాస్ వంటి మేలిమి వజ్రాన్ని అందించాడు.
తన పేరు ప్రతిష్టలను నిలబెడుతూ ప్రభాస్ నేడు కృష్ణం రాజు గర్వపడేలా ఏ స్థాయికి చేరుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..కృష్ణంరాజు గారు ఎప్పుడు ప్రభాస్ గురించి మాట్లాడిన ఆయన కళ్ళల్లో పుత్రోత్సహం కనిపించేది..ముఖ్యంగా ప్రభాస్ గారికి బాహుబలి లాంటి బలం కృష్ణం రాజు గారు..నేడు ఆయన లేరు అనే వార్త ప్రభాస్ ని ఎంతలా బాదిస్తుందో మనం ఊహించడానికి కూడా కష్టమే..ప్రభాస్ కి సొంత తండ్రి లాగ చిన్నప్పటి నుండి ప్రతి విషయం లో వేలు పట్టుకొని నడిపించిన వ్యక్తి కృష్ణంరాజు గారు..అలాంటి బలమైన శక్తి తనని వదిలి వెళ్ళిపోయింది అనే విషయం ప్రభాస్ కి జీర్ణించుకోలేనిది..ఎప్పుడు నవ్వుతు అందరిని డార్లింగ్ అంటూ ఎంతో ప్రేమగా పలకరించే ప్రభాస్ ఈరోజు కృష్ణంరాజు గారి పార్థివ దేహాన్ని చూడడానికి వస్తున్నా విశిష్ట అతిధులను మరియు శ్రేయోభిలాషులు విచార వదనం తో పలకరించడం చూసి అభిమానులు కన్నీరు మున్నీరు అవుతున్నారు..తెలంగాణ ఫిల్మోటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస యాదవ్ గారు ప్రభాస్ ని పలకరిస్తున్న సమయం లో ప్రభాస్ కన్నీళ్లను ఆపుకోలేకపొయ్యాడు..వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా చక్కర్లు కొడుతూ అభిమానులను శోకసంద్రం లోకి నెట్టేసింది.