
దర్శకుడు అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పటాస్ సినిమాతో దర్శకుడిగా తనకంటూ క్రేజ్ తెచ్చుకున్న ఆయన వరుసగా విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. జంధ్యాల తర్వాత టాలీవుడ్లో కామెడీ సినిమాలను తీయడంలో అనిల్ రావిపూడి సిద్ధహస్తుడు అన్న స్టాంప్ వేయించుకున్నాడు. సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరూ, ఎఫ్ 3 సినిమాలకు దర్శకత్వం వహించి సక్సెస్ అందుకున్నాడు. అన్ని సినిమాల్లోనూ కామెడీపరంగా అనిల్ దర్శకత్వానికి మంచి మార్కులు పడ్డాయి. అయితే ప్రస్తుతం సినిమాలతో పాటు ఓటీటీలు రాజ్యమేలుతున్నాయి. ఒక వైపు సినిమాలు, మరో వైపున వెబ్ సిరీస్‌లు, టాక్ షోలు నెటిజన్లకు కావలసిన ఎంటర్టైన్మెంట్ను పుష్కలంగా అందిస్తున్నాయి. దీంతో హీరోల నుంచి దర్శకుల వరకు ఓటీటీలలోనూ హ్యాండ్ వేస్తున్నారు. అనిల్ రావిపూడి కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. ఆహా ఓటీటీ వేదికగా ఓ కామెడీ షోకు అనిల్ రావిపూడి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు.
ఆహాలో వేదికగా కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్ అనే షో ప్రారంభం కాగా.. తాజాగా నిర్వాహకులు ప్రోమో విడుదల చేశారు. సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి ఈ కామెడీ షోకు యాంకర్లుగా వ్యవహరిస్తుండగా, జబర్డస్త్, పటాస్ షోల ద్వారా పాపులర్ అయిన కమెడియన్స్ సందడి చేయనున్నారు. ముక్కు అవినాష్, సద్దాం, టిల్లు వేణు, హరి, జ్ఞానేశ్వర్, భాస్కర్ టీమ్ లీడర్లుగా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 2 నుంచి ప్రారంభం కానున్న ఈ షో 10 ఎపిసోడ్లు ఉంటుందని టాక్ నడుస్తోంది. ఈ కామెడీ షోను ఆహా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దీంతో ప్రచార కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా విడుదల చేసిన ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి యాంకర్ దీపికా పిల్లికి లిప్ కిస్ ఇచ్చాడు. దీంతో ప్రోమో చూసిన వాళ్లంతా నోరెళ్లబెడుతున్నారు. అసలు ఈ షోలో జరుగుతుందంటూ ప్రశ్నిస్తున్నారు. నిజంగా దీపిక పిల్లిని అనిల్ రావిపూడి కిస్ చేశాడా అని ఆశ్చర్యపోతున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే డిసెంబర్ 2 వరకు ఆగాల్సిందే.
అటు ఆహా ఓటీటీ వేదికగా తెరకెక్కిన అన్ని వెబ్ సిరీస్‌లు, సింగింగ్ షోలు, టాక్ షోలు సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ఈ కామెడీ షో కూడా ప్రేక్షకులను అలరిస్తుందని ఆహా నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ షోలో దీపికా పిల్లి హీరోయిన్లను తలదన్నే అందంతో మెస్మరైజ్ చేస్తోంది. ఆమె చిరునవ్వులు చూస్తుంటే ఎవరైనా మాయలో మునిగిపోతారు. అంతలా దీపికా అందంతో, చిరునవ్వుతో ఆకర్షిస్తోంది. మెరూన్ కలర్ ఓపెన్ షోల్డర్ డ్రెస్‌లో దీపికా పిల్లి కళ్ళు చెదిరే అందంతో ఆకట్టుకుంది. అలాంటి దీపికా పిల్లి అనిల్ రావిపూడి లాంటి క్రేజీ డైరెక్టర్‌తో రొమాన్స్ చేస్తే సోషల్ మీడియాలో రచ్చ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరోవైపు జబర్దస్త్‌ను వదిలేసిన సుడిగాలి సుధీర్ ఇటీవల గాలోడు మూవీతో తన ఖాతాలో విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఇప్పుడు ఈ కామెడీ షోకు యాంకర్ కావడంతో ఈ షో ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందో అని అతడి అభిమానులు ఎదురు చేస్తున్నారు. ప్రోమోలో అయితే ముక్కు అవినాష్, సద్దాం లాంటి కమెడియన్లు తమ స్కిట్లతో సుడిగాలి సుధీర్‌కు చుక్కలు చూపించారు. కామెడీ పంచ్‌లతో ఆటాడుకున్నారు.