
మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ సృష్టించిన సందర్భాలు మనం ఎప్పటి నుండో చూస్తూనే ఉన్నాము..ఇటీవల కాలం లో బాలీవుడ్ లో అలాంటి సినిమానే భారీ బడ్జెట్ సినిమాలను సైతం అవాక్కు అయ్యేలా చేసింది..ఆ సినిమా పేరు కాశ్మీర్ ఫైల్స్..ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో మన అందరికి తెలిసిందే..కేవలం మౌత్ టాక్ తో OTT రాజ్యం ఏలుతున్న ఈ కాలం లో ఒక్క చిన్న సినిమా ఇంతటి స్థాయి ప్రభంజనం సృష్టిస్తుంది అని బహుశా ఆ సినిమా దర్శక నిర్మాతలు కూడా ఊహించి ఉండరు అనే చెప్పొచ్చు..ఈ సినిమాకి సోషల్ మీడియా లో వచ్చిన టాక్ మరియు రివ్యూస్ చూసి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతమైన క్రేజ్ రావడం తో ఇక్కడ కూడా షోస్ అమాంతం పెంచేశారు..మల్టిప్లెస్ ఆడియన్స్ ఇక్కడ కూడా ఈ సినిమాకి బ్రహ్మరధం పట్టారు ..కేవలం కోటి రూపాయలతో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ బడా హీరోలను కూడా షాక్ గురి చేసేంత ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా ఫుల్ రన్ లో ఎంత వసూలు చేసిందో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాం.
ఈ సినిమాని వివేక్ అగ్ని హోత్రి అనే దర్శకుడు కేవలం ఒక్క కోటి రూపాయిల బడ్జెట్ తో ఎలాంటి టాప్ స్టార్స్ లేకుండా కేవలం కంటెంట్ ని నమ్ముకొని తెరకెక్కించాడు..విడుదల అయినా తోలి రోజు కేవలం మూడు కోట్ల 50 లక్షల రూపాయిల తో ప్రారంభం అవ్వగా, రెండవ రోజు దానికి రెండింతలు వసూళ్లు చేసింది..పబ్లిక్ లో ఈ సినిమాకి ఉన్న డిమాండ్ ని చూసి నార్త్ ఇండియా మొత్తం ఒక్కసారిగా అమాంతంగా షోస్ ని ఒక్క రేంజ్ లో పెంచేసింది..దీనితో రెండవ రోజు కంటే వసూళ్లు మూడింతలు పెరిగాయి..అలా పెరుగుతూ పోతూనే ఉన్నింది..మరో పక్క ఈ సినిమాకి పోటీ గా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా కూడా విడుదల అయ్యింది ..సుమారు 300 కోట్ల రూపాయిలతో తెరకెక్కించిన ఆ మూవీ కి కేవలం ఒక్క కోటి రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కిన ఒక్క చిన్న సినిమా ముచ్చమటలు పట్టించింది అనే చెప్పాలి..అలా రోజు రోజుకి పెరుగుతూ పోతున్న వసూలు చూసి దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మక మల్టీస్టార్ర్ర్ చిత్రం #RRR మీద కూడా కాశ్మీర్ ఫైల్స్ ప్రభావం పడుతుంది అని అందరూ అనుకున్నారు.
#RRR వచ్చి అద్భుతమైన టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ ని దున్నేస్తున్న సమయం లో కూడా కాశ్మీర్ ఫైల్స్ చిత్రం డీసెంట్ వసూళ్లను రాబడుతూ ఫుల్ రన్ లో దాదాపుగా 300 కోట్ల రూపాయిల నెట్ ని వసూలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది..వాస్తవానికి ఈ సినిమాని OTT లో రిలీజ్ చేద్దాం అని ఆ చిత్ర నిర్మాతలు అయినా జీ స్టూడియోస్ వాళ్ళు అనుకున్నారు..కానీ డైరెక్టర్ వివేక్ అగ్ని హోత్రి ఈ చిత్రం కచ్చితంగా థియేటర్స్ లో విడుదల చెయ్యాల్సిందే అని పట్టుబట్టి విడుదల చేయించాడు..ఈరోజు నేరుగా OTT లో ఒక్కవేల ఈ సినిమా వచ్చి ఉంటె నిర్మాతలకు అన్నీ వందల కోట్ల లాభాలు వచ్చేది కాదు..ఇప్పుడు థియేట్రికల్ లాభాలతో పాటుగా..OTT లాభాలు మరియు సాటిలైట్ లాభాలు కూడా కుప్పలు కుప్పలు గ వచ్చి పడ్డాయి..అలా కేవలం ఒక్క కోటి రూపాయలతో నిర్మించిన ఈ చిత్రం..నిర్మాతలకు దాదాపుగా 500 కోట్ల రూపాయిల లాభాలు తెచ్చిపెట్టింది అంటే ఇది నిర్మాతలకు ఏ రేంజ్ జాక్ పాట్ అనేది అర్థం చేసుకోవచ్చు.