Home Entertainment కార్తికేయ2 మూడు రోజుల వసూళ్లు ఎక్సక్లూసివ్ గా మీకోసం..ఊహకందని అద్భుతం ఇది

కార్తికేయ2 మూడు రోజుల వసూళ్లు ఎక్సక్లూసివ్ గా మీకోసం..ఊహకందని అద్భుతం ఇది

4 second read
0
0
257

సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని మరోసారి నిరూపించిన సినిమా కార్తీకేయ-2. 2014లో వచ్చిన కార్తీకేయ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ మూవీ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శనివారం విడుదలైనా కానీ ఈ మూవీ వసూళ్లు ఉగ్రరూపం దాల్చడంతో బాక్సాఫీస్ షేక్ అవుతోంది. ఆగస్ట్ 15 సందర్భంగా నాలుగు సినిమాలు విడుదలైనా లాంగ్ వీకెండ్‌ను సద్వినియోగం చేసుకున్న సినిమా కార్తీకేయ-2 ఒక్కటే అని చెప్పాలి. గత వారం విడుదలైన బింబిసార, సీతారామం సినిమాలు కూడా ఈ వీకెండ్‌లో బాగానే ప్రభావం చూపించాయి. తద్వారా మంచి సినిమా తీస్తే లాంగ్ రన్ ఉంటుందని మరోసారి ఈ మూవీస్ నిరూపించాయి. ముఖ్యంగా ఈ వారం రెండు బాలీవుడ్ మూవీస్‌తో పాటు టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా విడుదల కావడంతో నిఖిల్ సినిమా కార్తీకేయ-2కు తగినన్ని థియేటర్లకు దొరకని పరిస్థితి ఏర్పడింది.

నైజాం ఏరియాలో మాచర్ల నియోజకవర్గం సినిమాను దిల్ రాజు విడుదల చేయడంతో చాలా థియేటర్లు బ్లాక్ అయిపోయాయి. దీంతో కార్తీకేయ మూవీకి చాలా తక్కువ థియేటర్లు మాత్రమే దొరికాయి. కానీ మాచర్ల నియోజకవర్గం తొలిరోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో పాటు నిఖిల్ సినిమాకు ఎక్స్‌ట్రార్డనరీ టాక్ రావడంతో థియేటర్లు ఇవ్వని వాళ్లే ఈ మూవీకి థియేటర్లు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందులోనూ హాలీడేస్ అడ్వాంటేజ్ ఉండటంతో మల్టీప్లెక్స్, సింగిల్ థియేటర్ల యాజమాన్యాలు కూడా కార్తీకేయ మూవీకే జై కొట్టాయి. దీంతో వసూళ్ల ప్రభంజనం కనిపించింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మాచర్ల నియోజకవర్గం మూవీకి ఒక్క థియేటర్ మాత్రమే కేటాయించగా కార్తీకేయ-2 మూవీకి రెండు థియేటర్లను కేటాయించినా సరిపోలేదు. ఈ రెండు థియేటర్లలో వీకెండ్ అన్ని షోలు హౌస్‌ఫుల్ పడ్డాయి. దీంతో చాలా మంది లాల్ సింగ్ చద్దా, మాచర్ల నియోజకవర్గం సినిమాలను తీసేసి కార్తీకేయ-2 మూవీకి మరో థియేటర్ ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.

కాగా కార్తీకేయ2 రిలీజ్ అయిన రోజు నుంచి అద్బుతమైన వసూళ్లతోబాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తూ దూసుకుపోతుంది. తొలి మూడు రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్‌ను సాధించింది. దీంతో ఈ ఏడాది క్లీన్ హిట్ సాధించిన 11వ సినిమాగా నిలిచింది. ఈ లిస్టులో 4 డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నప్పటికీ మొత్తం మీద స్ట్రైట్ తెలుగు సినిమాలు 7 ఉండటం విశేషం అనే చెప్పాలి. ఇందులో కూడా 3 వరుస హిట్స్ కేవలం వారం గ్యాప్ లోనే టాలీవుడ్‌కు సొంతం అవ్వడం ఇప్పుడు మరింత స్పెషల్ అని చెప్పాలి. ఇండిపెండెన్స్ డే రావడంతో కార్తీకేయ-2 తొలి మూడు రోజుల్లో దుమ్ముదులిపింది. నాలుగో రోజు వర్కింగ్ డే కావడంతో వసూళ్లు కొంచెం నెమ్మదించాయి. అయినా తొలి మూడు రోజుల్లో ఈ మూవీ రూ.15 కోట్ల షేర్ రాబట్టింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో తొలిరోజు రూ.3.5 కోట్లు, రెండో రోజు రూ.3.81 కోట్లు, మూడో రోజు రూ.4.23కోట్లు రాబట్టింది. ప్రాంతాల వారీగా చూసుకుంటే నైజాంలో రూ.4.06 కోట్లు, సీడెడ్‌లో రూ.1.83 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.1.51 కోట్లు, తూ.గో.లో రూ.99 లక్షలు, పశ్చిమ గోదావరిలో రూ.73 లక్షలు, గుంటూరులో రూ.1.14 కోట్లు, కృష్ణాలో రూ.87 లక్షలు, నెల్లూరులో రూ.41 లక్షలు రాబట్టింది. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో రూ.70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ.2.6కోట్లు, నార్త్ఇండియాలో రూ.60 లక్షలు వసూలు చేసింది. మొత్తంగా తొలి మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.26.5 కోట్ల గ్రాస్, రూ.15.44 కోట్ల షేర్ సొంతం చేసుకుంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…