Home Entertainment కార్తికేయ 2 మొదటి వారం వసూళ్లు ఎక్సక్లూసివ్ గా మీకోసం

కార్తికేయ 2 మొదటి వారం వసూళ్లు ఎక్సక్లూసివ్ గా మీకోసం

0 second read
0
0
95

ఇటీవల కాలం లో తక్కువ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకొని ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన చిత్రాలలో ఒకటి యంగ్ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2..విడుదలకి ముందు నుండే భారీ అంచనాలను ఏర్పాటు చేసిన ఈ సినిమా విడుదల తర్వాత ఆ అంచనాలను మించి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది..తెలుగు లో హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ కుమ్మేస్తాది అనే విషయం మన అందరికి తెలిసిందే..కార్తికేయ 2 కూడా అలాగే కుమ్మింది..కేవలం మూడు రోజుల్లోపే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ హిట్ స్టేటస్ కి చేరు లాభాల్లోకి వచ్చేసింది..కానీ హిందీ లో మాత్రం ఈ సినిమా ఆ రేంజ్ లో క్లిక్ అవుతుందని ఎవ్వరు ఊహించలేక పొయ్యారు..ఎదో సరదాగా హిందీ వెర్షన్ లో కూడా విడుదల చేద్దామని తెలుగు తో పాటు హిందీ లో కూడా ఒక 60 షోస్ తో విడుదల చేశారు..అది నేడు 3000 షోస్ కి పెరిగి అద్భుతమైన వసూళ్లను రాబడతూ బాక్స్ ఆఫీస్ వద్ద ముందుకి దూసుకుపోతుంది..ఇప్పటికే ఈ సినిమా విడుదలై వారం రోజులు పూర్తి చేసుకుంది..ఈ వారం రోజుల్లో ఈ సినిమా ఎంత వసూలు చేసింది అనేది ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాం.

ఇక ఈ సినిమాకి తెలుగు లో వరుసగా సినిమాలు పోటీ ఉండడం తో మొదటి రోజు థియేటర్స్ సమస్య బాగా ఉన్నింది..కానీ టాక్ అద్భుతంగా రావడం తో పక్క రోజు నుండి థియేటర్స్ సంఖ్య భారీ గా పెంచేశారు..ముఖ్యంగా నైజాం ప్రాంతం లో ఈ సినిమాకి వస్తున్న వసూళ్లు చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు..ఇప్పటి వరుకు ఈ సినిమా ఈ ప్రాంతం లో 6 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది..అన్ని సినిమాల ధాటిని తట్టుకొని ఈ చిత్రం ఈ రేంజ్ వసూలు చెయ్యడం అంటే మాములు విషయం కాదు..ఫుల్ రన్ లో ఈ సినిమా ఇక్కడ 10 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేస్తే మాత్రం అరాచకం అనే చెప్పాలి..అలాగే సీడెడ్ ప్రాంతం లో 2 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్..ఉత్తరాంధ్ర లో 2 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్..ఈచ్ గోదావరి జిల్లాలో 1 కోటి 40 లక్షల రూపాయిలు..వెస్ట్ గోదావరి కోటి రూపాయిలు..గుంటూరు జిల్లాలో 1 కోటి 60 లక్షల రూపాయిల షేర్..కృష్ణ జిల్లాలో కోటి 30 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..మొత్తం మీద ఈ సినిమా తెలుగు వెర్షన్ వారం రోజులకు గాను 22 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది.

ఇక హిందీ లో అయితే ఈ సినిమా అమిర్ ఖాన్ మరియు అక్షయ్ కుమార్ వంటి బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలను కూడా దాటి అద్భుతంగా ఆడిస్తుంది..ఉదాహరణానికి నిన్న ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా కోటి 45 లక్షల రూపాయిలు వసూలు చెయ్యగా..’రక్షా బంధన్’ సినిమా కోటి రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది..అయితే ఈ రెండు సినిమాలను దాటి కార్తికేయ 2 చిత్రం కోటి 70 లక్షల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది..అలా మన టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరో సినిమా హిందీ లో సూపర్ స్టార్ సినిమాలను సైతం దాటి ఆడడం అనేది మాములు విషయం కాదు..ఇక కార్తికేయ 2 హిందీ వెర్షన్ మొదటి వారం వసూళ్లను ఒకసారి చూస్తే మొదటి రోజు ఈ సినిమాకి కేవలం 7 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు మాత్రమే వచ్చాయి..ఇక ఆ తర్వాత రెండవ రోజు 28 లక్షలు..మూడవ రోజు కోటి 10 లక్షలు..నాల్గవ రోజు కోటి 28 లక్షలు..ఐదవ రోజు కోటి 38 లక్షలు ఆరవ రోజు కోటి 64 లక్షలు..7 వ రోజు ఏకంగా రెండు కోట్ల 50 లక్షలు వసూలు చేసి వారం రోజులకు గాను 7 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసి సంచలనం సృష్టించింది..ఫుల్ రన్ లో ఈ సినిమా కేవలం హిందీ నుండే 30 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..చూడాలి మరి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…