Home Entertainment కార్తికేయ 2 మొదటి రోజు వసూళ్లు..చాలా ప్రాంతాలలో #RRR రికార్డ్స్ అవుట్?

కార్తికేయ 2 మొదటి రోజు వసూళ్లు..చాలా ప్రాంతాలలో #RRR రికార్డ్స్ అవుట్?

0 second read
0
0
262

యంగ్ హీరో నిఖిల్ నటించిన మోస్ట్ ప్రెస్టీజియస్ అడ్వెంచర్ మూవీ కార్తికేయ 2 ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ , కన్నడ మరియు మలయాళం బాషలలో ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన సంగతి మన అందరికి తెలిసిందే..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది..టాక్ అద్భుతంగా రావడం తో ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ బోర్డ్స్ మరియు అదనపు షోస్ తో కళకళలాడుతూ ఇండస్ట్రీ కి సరికొత్త ఊపు ని తీసుకొచ్చింది..వారు ఫ్లాప్స్ తో డీలాపడిన టాలీవుడ్ ఇండస్ట్రీ కి భింబిసారా మరియు సీతారామం వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి టాలీవుడ్ కి ఊపిరి పోశాయి..అలాంటి సందర్భం లో నిన్న విడుదలైన నితిన్ మాచెర్ల నియోజకవర్గం డిజాస్టర్ ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకొని బయ్యర్లకు చుక్కలు చూపించింది..అయ్యో ఇండస్ట్రీ బాగుపడింది అనుకుంటే మళ్ళీ దెబ్బ పడిందే అని అనుకున్నారు..కానీ ఈరోజు విడుదలైన కార్తికేయ 2 సినిమా ప్రభంజనం సృష్టించే రేంజ్ వసూళ్లతో డిస్ట్రిబ్యూటర్స్ ని పండగ చేసుకునేలా చేసింది.

కానీ దురదృష్టం కొద్దీ ఈ సినిమాకి అతి తక్కువ స్క్రీన్స్ దొరికాయి..ఈ సినిమాకి ముందు భింబిసారా మరియు సీతారామం వంటి సినిమాలు సక్సెసఫుల్ గా థియేటర్స్ లో రన్ అవ్వడం..మాచెర్ల నియోజకవర్గం కొత్త సినిమా కావడం తో థియేటర్స్ చాలా తక్కువ దొరికాయి..కానీ అతి తక్కువ థియేటర్స్ లో వచ్చినా కూడా ఈ సినిమా వసూళ్ల పరంగా దుమ్ము లేపేసింది..ఇచ్చిన థియేటర్స్ సరిపోకపోవడం తో షోస్ సంఖ్య బాగా పెంచేశారు..కొన్ని మల్టీప్లెక్స్ లో అయితే మాచెర్ల నియోజకవర్గం సినిమాకి కేటాయించిన షోస్ కూడా ఈ సినిమాకే కేటాయించారు..ఎన్ని షోస్ ఇచ్చిన కూడా నిండిపోతున్నాయి..ముఖ్యంగా నైజం ప్రాంతంలో అయితే ఈ సినిమా వసూళ్ల సునామి ని సృష్టిస్తుంది..ఒక్కసారి ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఎంత వసూళ్లు రాబట్టబోతుందో..అలాగే మిగిలిన బాషలలో ఎలా ఆడుతుందో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము..ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అన్ని భాషలకు కలిపి కేవలం 13 కోట్ల రూపాయలకే జరిగింది.

కాంపిటీషన్ రిలీజ్ కావడం తో తక్కువ మొత్తానికే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని..లేకపోతే 20 కోట్ల రూపాయలకే ప్రీ రిలీజ్ బిసినెస్ జరిగేదని ట్రేడ్ వర్గాల అంచనా..అయితే ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తాన్ని ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే రికవర్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి..మొదటి రోజు ఈ సినిమాకి నాలుగు కోట్ల రూపాయిల షేర్ వచ్చిందని అంచనా వేస్తున్నారు..లిమిటెడ్ రిలీజ్ మీద ఈ స్థాయి వసూళ్లు అంటే మాములు విషయం కాదనే చెప్పాలి..ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ఈ సినిమా హిందీ వెర్షన్ వసూళ్లు కూడా సాయంత్రం షోస్ నుండి ఒక రేంజ్ లో పెరిగిపోయాయి..బాలీవుడ్ బడా హీరోలు అమిర్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి హీరోల సినిమాలను ఎదురుగా పెట్టుకొని కూడా ఈ సినిమా వాటిని డామినేట్ చేస్తూ ఎక్కువ వసూళ్లను రాబట్టడం అంటే ఈ చిత్రానికి పబ్లిక్ టాక్ ఏ రేంజ్ లో ఉందొ అర్హం చేసుకోవచ్చు..అయితే ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని చూస్తూ ఉంటె ఈ సినిమా వసూళ్లు లాంగ్ రన్ లో గట్టిగానే ఉండేట్టు అనిపిస్తుంది..వీక్ డేస్ లో కూడా ఇదే రేంజ్ ట్రెండ్ ని కొనసాగిస్తే ఫుల్ రన్ లో 30 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు ట్రేడ్ పండితులు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

సింగర్ వాణి జయరాం మృతి పై తలెత్తుతున్న అనుమానాలు..!

కన్నడతో పాటు పలు భాషల్లో 10,000కు పైగా పాటలు పాడిన నటి వాణీ జయరామ్ ఈరోజు (ఫిబ్రవరి 4) చెన్…