
మైథలాజికల్ మూవీస్‌కు తెలుగులోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉంటుంది. ఈ విషయాన్ని మరోసారి నిఖిల్ నటించిన కార్తీకేయ-2 మూవీ నిరూపించింది. చక్కటి కథతో అందరికీ అర్థమయ్యేలా శ్రీకృష్ణుడి గురించి ఈ సినిమాను తెరకెక్కించారు. దీంతో టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ఈ మూవీ విజయకేతనం ఎగురవేసింది. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా, అక్షయ్ కుమార్ రక్షాబంధన్ మూవీస్‌ను తిరస్కరించిన చోట నిఖిల్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. కంటెంట్ బాగుంటే ఎలాంటి మూవీనైనా థియేటర్లలో ఆదరిస్తారని కార్తీకేయ-2 చాటిచెప్పింది. క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్‌పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. అద్భుతమైన విజువల్స్, అదిరిపోయే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా అందర్నీ ఆకట్టుకుంటుంది.
ఈ చిత్రం ఆగస్టు 12న విడుదలై ఘన విజయం సాధించింది. నిఖిల్ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్లను సాధించిన చిత్రంగా కార్తికేయ-2 నిలిచింది. అంతేకాకుండా ఈ చిత్రంతో నిఖిల్ వంద కోట్ల క్లబ్లో అడుగుపెట్టాడు. కేవలం తెలుగులోనే కాకుండా విడుదలైన ప్రతి భాషలోనూ ఈ చిత్రం డబుల్ బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పటివరకు 100కోట్లకు పైగా గ్రాస్‌ను.. 60కోట్లకు పైగా షేర్‌ను సాధించింది. తాజాగా నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ బ్రహ్మాస్త మూవీతో దాదాపుగా క్లోజింగ్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ.60 కోట్ల షేర్ వసూళ్లను సొంతం చేసుకుంది. బాలీవుడ్లో రూ.30 కోట్ల షేర్ సాధించింది. బాలీవుడ్లో ఎలాంటి ప్రమోషన్లు చేయకుండా ఈ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్లు సాధించడం విశేషం అనే చెప్పాలి. అడ్వేంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. నిఖిల్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలకపాత్రలో నటించాడు. ఈ చిత్రం తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం తర్వాత అత్యధిక ప్రాఫిట్స్ను సాధించిన సినిమాగా కార్తీకేయ-2 రికార్డు సృష్టించింది.
కార్తీకేయ-2 సినిమాను చూసినవారంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తెలుగులో చిరంజీవి, మహేష్‌బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్‌చరణ్ లాంటి హీరోలు ఈ సినిమాను మెచ్చుకోగా దేశవ్యాప్తంగానూ ప్రశంసలు లభించాయి. గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్ కార్తికేయ 2 సినిమా యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంత మంచి సందేశాన్ని దేశమంతా చూపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని మనస్పూర్తిగా కోరుకున్నారు. హీరో నిఖిల్, నిర్మాత అభిషేక్ అగర్వాల్ ప్రత్యేకంగా గుజరాత్ సీఎంను కలిశారు. ముఖ్యంగా బాలీవుడ్లో బాహుబలి, పుష్ప చిత్రాల తర్వాత ఆ స్థాయిలో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా యూఎస్ఏలోనూ దూసుకుపోతుంది. తాజాగా ఈ చిత్రం అమెరికాలో 1.5 మిలియన్ డాలర్లు సాధించి రికార్డు సృష్టించింది. అంతేకాకుండా నాలుగో వారంలో 80కి పైగా లోకేషన్లలో రన్ అవుతున్న మొదటి తెలుగు సినిమాగా కార్తీకేయ-2 నిలిచింది.