
మనం ఎంతగానో అభిమానించే నటీనటులకు ఏమి జరిగిన మనం తట్టుకోలేము..ఇటీవల కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారు మన తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినప్పటికీ ఆయన చనిపోయాడు అని ఎంత మంది శోకసంద్రం లో మునిగిపోయారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఎందుకంటే ఆయన చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలు సోషల్ మీడియా ద్వారా తెలిసి ఇంత మంచి మనిషిని కోల్పోయామా అంటూ మనం ఆ స్థాయిలో బాధపడాల్సి వచ్చింది..ఇప్పుడు సరిగ్గా బాలీవుడ్ కి చెందిన చవి మిట్టల్ అనే సీరియల్ యాక్టర్ పరిస్థితి కూడా తెలిసి ఆమె అభిమానులు అదే స్థాయిలో బాధ పడాల్సి వస్తుంది..సోషల్ మీడియా లో ఎప్పుడు అభిమానులతో ఇంటరాక్షన్ అవుతూ ఉండే ఈమె కరోనా సమయం లో ఎంతో మందికి సహాయం చేసింది..అలాంటి ఈమెకి ఇప్పుడు బ్రెస్ట్ కాన్సర్ అని తెలియడం తో ఆమె అభిమానులు మరియు నెటిజెన్లు కంటతడి పెట్టుకుంటున్నారు..ఆమెకి ఎలా అయినా నయం అవ్వాలి అని ఆ దేవుడికి ప్రార్థనలు చేస్తున్నారు..ఇంతకీ ఎవరు ఈమె?? ఆమెకి కాన్సర్ అనే విషయం ఎలా తెలిసింది అనే విషయాలు ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.
చవి మిట్టల్ అనే అమ్మాయి బాలీవుడ్ టాప్ సీరియల్స్ లో హీరోయిన్ గా చేస్తూ ఉండేది..ఈమె అభినయం కి అక్కడ లక్షలాది మంది అభిమానులు కూడా ఉన్నారు..రోజు రోజుకి సీరియల్స్ ద్వారా ఈ అమ్మాయికి పెరుగుతున్న ఆదరణ చూసి ఆమెకి వరుసగా సినిమాల్లో అవకాశాలు ఇవ్వడం ప్రారంభించారు అక్కడి దర్శక నిర్మాతలు..తెలుగు లో కూడా త్వరలోనే సమంత మరియు విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కబోయ్యే సినిమాలో కూడా ముఖ్య పాత్ర ని పోషిస్తుంది..ఈ సినిమా తో పాటు మరో రెండు మూడు యువ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా ఆఫర్లు కొట్టేసింది..అలా కెరీర్ పీక్ స్థానం కి వెళ్తున్న సమయం లో తనకి బ్రెస్ట్ కాన్సర్ ఉంది అనే విషయం బయటపడడం తో ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యింది..అసలు విషయానికి వస్తే స్వతహాగా ఫిట్నెస్ ఫ్రీక్ అయినా చవి మిట్టల్ ఒక్క రోజు జిం చేస్తున్న సమయం లో తన కాలిగి తీవ్ర గాయం అయ్యి రక్తం ప్రవాహం లాగ పారింది..కాళ్ళకి తీవ్రమైన గాయం అవ్వడం తో హాస్పిటల్ కి వెళ్లి చికిత్స చేయించుకోవడానికి రాగా చవి మిట్టల్ రక్తం ని చూసి కాస్త అనుమానం పడిన డాక్టర్ టెస్టులు చేయించుకోమని సలహా ఇచ్చాడు.
ఆమె రక్తం ని అన్నీ విధాలుగా పరీక్షించగా ఆమెకి బ్రెస్ట్ కాన్సర్ ఉన్నట్టు తెలిసింది..కానీ అదృష్టం కొద్దీ అది మొదటి స్టేజి లోనే ఉన్నది అని..సర్జరీ ద్వారా అది నయం అయిపోతుంది అని డాక్టర్లు చెప్పడటం తో కాస్త ధైర్యాన్ని కూడగట్టుకుంది చవి మిట్టల్..సాధారణంగా ఎవరికైనా ఇలాంటి వ్యాధి తమకి ఉంది అని తెలిసినప్పుడు సగం మనో ధైర్యం ని కోల్పోతారు ..జీవితం మీద అన్నీ ఆశలు వదులుకున్న వారిలాగా మిగిలిపోతారు..ఒక్క మనిషిని వ్యాధి కంటే ఘోరంగా కుంగదీసేది ఇలా మనోధైర్యం కోల్పోవడమే..బ్రతకాలి అనే ఆశ..చావు ని జయంచాలి అని కృషి , ధైర్యం ఉంటె ఎలాంటి వ్యాధి అయినా మనల్ని వదిలి పారిపోవాల్సిందే..చవి మిట్టల్ ప్రస్తుతం చేస్తున్నది కూడా అదే..తనకి కాన్సర్ ఉంది అని తెలిసి కూడా తనకి అసలు ఏమి జరగనట్టు ఎంతో మాములుగా తన షూటింగ్స్ తాను చూసుకుంటూ కాలం గడిపేస్తుంది..ఇక్కడే ఆమె సగం విజయం సాధించేసింది..ఇక మిగతా సగం విజయం కూడా సాధించడానికి పెద్ద సమయం పట్టదు అనే చెప్పాలి..ఆమె మనో ధైర్యం కి ఆ దేవుడి చల్లని చూపు కూడా తోడు అయ్యి అతి త్వరగా ఆమె ఆ నరకం నుండి బయటపడాలి అని మన అందరం మనసూర్తిగా కోరుకుందాము.