Home Entertainment ‘కాంతారా’ హీరో రిషబ్ శెట్టి తెలుగు లో ఎన్ని సినిమాలలో నటించాడో తెలుసా..?

‘కాంతారా’ హీరో రిషబ్ శెట్టి తెలుగు లో ఎన్ని సినిమాలలో నటించాడో తెలుసా..?

1 second read
0
0
466

దేశవ్యాప్తంగా కాంతార మూవీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కన్నడలో గత నెలలో విడుదలైన ఈ మూవీ అన్ని పరిశ్రమలను షేక్ చేస్తోంది. ఈ సినిమా టేకింగ్, డైరెక్షన్, యాక్షన్, మ్యూజిక్, కథ అందరినీ ఆలోచింపచేస్తోంది. అందుకే బాక్సాఫీస్ దగ్గర అనూహ్యంగా వసూళ్లు రాబడుతూ బయ్యర్లకు లాభాలను తెచ్చిపెడుతోంది. ఈ మూవీకి డైరెక్టర్ కమ్ హీరో రిషబ్‌శెట్టి బ్యాక్ బోన్‌గా నిలిచాడు. 2010లోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రిషబ్ శెట్టికి ఇన్నాళ్లుగా పెద్దగా పేరు రాలేదు. కానీ కాంతార మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. నిజానికి రిషబ్ శెట్టికి యాక్టింగ్ కంటే డైరెక్షన్ పైనే ఎక్కువ ఆసక్తి ఉండేది. అందుకే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూనే మరోవైపు దర్శకత్వానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. 2017లో రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం రిక్కీ. 2016లో విడుదలైన ఈ సినిమాలో పిల్ల జమీందార్ మూవీ ఫేం హరిప్రియ హీరోయిన్‌గా నటించింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ యావరేజ్‌గా నిలిచింది.

రిక్కీ సినిమా తర్వాత రక్షిత్ శెట్టి హీరోగా రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కిరాక్ పార్టీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాతో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. రిషబ్ శెట్టి తెరకెక్కించిన మూడో సినిమా సర్కారీ హిరియా ప్రాథమిక షాలే కాసరగడ్. 2018లో వచ్చిన ఈ మూవీ ఉత్తమ బాలల చిత్రం కేటగిరీలో రిషబ్ శెట్టికి జాతీయ అవార్డు తీసుకొచ్చింది. ఈ సినిమాతో రిషబ్ శెట్టి నిర్మాతగానూ మారాడు. ఇప్పుడు కాంతార మూవీ దర్శకుడిగా రిషబ్ శెట్టికి నాలుగోది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ.200 కోట్ల వసూళ్లను రాబట్టి అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. అయితే రిషబ్ శెట్టి ఇటీవల ఓ తెలుగు మూవీలోనూ నటించాడు. కానీ ఆ సినిమా గురించి చాలా మందికి తెలియదు. తాప్సీ నటించిన మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో రిషబ్ శెట్టి ఖలీల్ అనే పాత్రలో నటించాడు. కాంతార మూవీతో ఫేమస్ అయ్యాడు కాబట్టి మిషన్ ఇంపాజిబుల్ సినిమా ఇప్పుడు వస్తే ఆ సినిమాకు రిషబ్ శెట్టి ప్లస్ అయ్యేవాడు. త్వరలో అతడు మరిన్ని తెలుగు సినిమాలలో నటించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

అటు కాంతార మూవీ కేజీఎఫ్-2 రికార్డులను కూడా బీట్ చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కర్ణాటకలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన చిత్రాల్లో అత్యధిక మంది వీక్షించిన సినిమాగా కాంతార నిలిచింది. యష్ నటించిన కేజీఎఫ్-2 సినిమా టికెట్లు 75 లక్షలు అమ్ముడవగా.. కాంతార టికెట్లు ఇప్పటివరకు 77 లక్షలు విక్రయమయ్యాయి. దీంతో వసూళ్లలో కాంతార సినిమా దూసుకెళ్తోంది. కన్నడలో కంటే తెలుగులో మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై విడుదల చేశారు. ఈ సినిమా దీపావళి హాలిడే రోజున మరోసారి మంచి వసూళ్లను రాబట్టి వావ్ అనిపించింది. కాంతార సినిమా బాక్సాఫీస్ దగ్గర 10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.30 కోట్ల షేర్‌ను వసూలు చేసింది. ఏపీ, తెలంగాణలో మొత్తంగా పది రోజుల్లో 15.13 కోట్ల షేర్‌ను 27.60 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. ఈ సినిమా 2.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ దగ్గర బరిలోకి దిగగా.. ఏకంగా 12.83 కోట్ల రేంజ్‌లో లాభాలను మూటగట్టుకుని ఊహకు అందని విధంగా వసూళ్లను రాబడుతోంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…