
కన్నడ చలన చిత్ర పరిశ్రమలో ప్రభంజనం సృష్టించిన కాంతారా చిత్రం..అక్కడ విడుదలైన 15 రోజులకు తెలుగు,హిందీ , తమిళం మరియు మలయాళం బాషలలో విడుదలైంది..ఇక్కడ లేట్ రిలీజ్ అయ్యినప్పటికీ కూడా ప్రభంజనం సృష్టించేసింది..కేవలం తెలుగు వెర్షన్ నుండే ఈ సినిమాకి ఇప్పటి వరుకు 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..ఇప్పటికి కూడా ఎన్ని కొత్త సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ కాంతారా చిత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద తన డామినేషన్ ని చూపిస్తూ ముందుకు దూసుకుపోతుంది..ఈ సినిమా విడుదలప్పుడు ఇందులో నటించే నటీనటుల పేర్లు కూడా మనవాళ్ళెవ్వరికి తెలియదు..అలాంటి సినిమాకి తెలుగులో ఈ స్థాయి వసూళ్లు అంటే ప్రస్తుతం స్టార్ పవర్ మీద సినిమాలు ఆడటం లేదు..కంటెంట్ ఉంటేనే ఆడుతుంది అని అర్థం చేసుకోవచ్చు..ఉదాహరణకి గాడ్ ఫాదర్ సినిమానే తీసుకోవచ్చు..మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరో నటించిన చిత్రం ఇది..కాంతారా విడుదల వరుకు డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ వచ్చిన ఈ చిత్రం..ఎప్పుడైతే కాంతారా విడుదలైందో అప్పటి నుండి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి.
కాంతారా చిత్రం విడుదలకి ముందు రోజునాటికి గాడ్ ఫాదర్ చిత్రం దాదాపుగా 54 కోట్ల రూపాయిల షేర్ మార్కు కి రీచ్ అయ్యింది..కానీ క్లోసింగ్ కలెక్షన్స్ కేవలం 56 కోట్ల రూపాయిల దగ్గరే ఆగిపోయింది..దానికి కారణం కాంతారా చిత్రం..మూడవ వీకెండ్ లో గాడ్ ఫాదర్ కలెక్షన్స్ కి గట్టిగా గండి కొట్టేసింది కాంతారా చిత్రం..ఎందుకంటే జనాలకు మొదటి ఆప్షన్ అదే అయ్యింది కాబట్టే గాడ్ ఫాదర్ కలెక్షన్స్ కి దెబ్బ పడింది..గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 92 కోట్ల రూపాయలకు జరిగింది..నిర్మాత సొంతగానే విడుదల చేసుకున్నాను మాకు ఏమి నష్టం కలుగలేదు అని అధికారిక ప్రకటన చేసినప్పటికీ కూడా..ప్రతి ప్రాంతం లో వేల్యూ బిజినెస్ ని లెక్కలోకి తీసుకుంటే 30 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు చవిచూసి డిజాస్టర్ గా మిగిలింది ఈ చిత్రం..ఒకవేళ కాంతారా సినిమా విడుదల కాకపొయ్యి ఉంటె కచ్చితంగా గాడ్ ఫాదర్ మరో 15 కోట్ల రూపాయిలు అదనంగా వసూలు చేసి యావరేజి గా నిలిచేదని ట్రేడ్ పండితులు చెప్తున్న మాట.
ఇక నైజం వంటి ప్రాంతాలలో ‘కాంతారా’ కలెక్షన్స్ గాడ్ ఫాదర్ ని కూడా దాటేసింది..గాడ్ ఫాదర్ చిత్రం ఇక్కడ ఫుల్ రన్ లో కేవలం 12 కోట్ల 38 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే వసూలు చేసింది..కానీ కాంతారా చిత్రం ఇప్పటి వరుకు 13 కోట్ల రూపాయిల షేర్ ని ఈ ప్రాంతం లో రాబట్టింది..ఇంకా థియేట్రికల్ రన్ ముగియలేదు..ఫుల్ రన్ లో కచ్చితంగా మరో కోటి రూపాయిలు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు..అలా ఊరు పేరు తెలియని ఒక హీరో సినిమా తెలుగు లో మెగాస్టార్ సినిమానే దెబ్బతీసింది అంటే ఒక్కటే అర్థం చేసుకోవాలి..కంటెంట్ ఈజ్ ది కింగ్ అని..రీమేక్ సినిమాలకు కాలం ఎప్పుడో చెల్లిపోయింది..ఇప్పుడు ఎవ్వరు చూడడం లేదు..ఎందుకంటే OTT రాజ్యం ఏలుతున్న సమయం లో అభిమానులు తప్ప సాధారణ ప్రేక్షకులు కిలోమీటర్లు ప్రయాణం చేసి డబ్బులు ఖర్చు పెట్టి తమ విలువైన సమయాన్ని వృద్ధ చెయ్యరు..మెగాస్టార్ చిరంజీవి ఈ విషయం అర్థం చేసుకొని ఇక రీమేక్ సినిమాలను ఆపివేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.