
కన్నడ చలన చిత్ర పరిశ్రమని గర్వంగా తలెత్తుకునేలా చేసిన చిత్రాలలో ఒకటి కాంతారా..అతి తక్కువ బడ్జెట్ తో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన సునామి గురించి ఎంత చెప్పుకున్న అది తక్కువే అవుతుంది..ఒక్క చిన్న బడ్జెట్ సినిమా ఏకంగా KGF , బాహుబలి మరియు #RRR వంటి చిత్రాల రికార్డ్స్ ని బద్దలు కొట్టడం అంటే మాములు విషయం కాదు..OTT రాజ్యమేలుతున్న రోజుల్లో ఒక సినిమాకి ఇలాంటి రన్ ఉంటుందని ఎవ్వరు ఊహించలేదు..కేవలం కలెక్షన్స్ పరంగా మాత్రమే కాదు..50 రోజుల కేంద్రాల విషయం లో కాంతారా సరికొత్త రికార్డుని నెలకొల్పింది..ప్రపంచవ్యాప్తంగా వందల సంఖ్య సెంటర్స్ లో ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది..ఇది అరుదైన రికార్డు గా చెప్పుకోవచ్చు..బాక్స్ ఆఫీస్ వద్ద జాతారని తలపిస్తూ ముందుకు దూసుకెళ్లిన ఈ చిత్రం క్లోసింగ్ కి దగ్గరగా వచ్చేసింది..ఇప్పటి వరుకు ఎంత వసూళ్లను ఈ చిత్రం రాబట్టిందో ఒక లుక్ వేద్దాం.
ఈ సినిమా తెలుగు , హిందీ , మలయాళం మరియు తమిళ బాషలలో కన్నడలో విడుదలైన 15 రోజుల తర్వాత విడుదలైంది..అయినా కూడా సెన్సషనల్ రెస్పాన్స్ ని దక్కించుకుంది ఈ చిత్రం..ఒక్కసారి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ప్రాంతాలవారీగా ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో చూస్తే నైజాం ప్రాంతం లో ఈ సినిమా ఇప్పటి వరుకు 13 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి సంచలనం సృష్టించింది..ఇక రాయలసీమ ప్రాంతం లో 3 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చెయ్యగా,ఉత్తరాంధ్ర ప్రాంతం లో 3 కోట్ల 76 లక్షల రూపాయిలు, ఉభయ గోదావరి జిల్లాలు రెండు కలిపి 3 కోట్ల పది లక్షల రూపాయిలు , కృష్ణ జిల్లాలో కోటి 75 లక్షల రూపాయిలు..గుంటూరు జిల్లాలో కోటి 80 లక్షల రూపాయిలు మరియు నెల్లూరు జిల్లాలలో కోటి రూపాయిల షేర్ ని వసూలు చేసి మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో 28 కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా సాధించిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే కర్ణాటక ప్రాంతం లో 180 కోట్ల రూపాయిలు, తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్ల రూపాయిలు , తమిళ నాడు లో పది కోట్ల రూపాయిలు,కేరళలో 14 కోట్ల రూపాయిలు, హిందీ లో వంద కోట్ల రూపాయిలు మరియు ఓవర్సీస్ లో 28 కోట్ల రూపాయిలు..మొత్తం మీద అన్ని భాషలకు కలిపి 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త ప్రభంజనం సృష్టించింది ఈ చిత్రం..రెండు కోట్ల రూపాయిల గ్రాస్ తో ప్రారంభమై 400 కోట్ల రూపాయిలు వసూలు చేసింది అంటే మాములు విషయమా..కేవలం 15 కోట్ల రూపాయిల బడ్జెట్ తో సినిమాని నిర్మించి 200 కోట్ల రూపాయిల లాభాల్ని తమ ఖాతాలో వేసుకున్నారు హోమబుల్ సంస్థ వారు..ఇక థియేట్రికల్ గా ఈ రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ చిత్రం త్వరలోనే OTT లో అందుబాటులోకి రానుంది..ఇక్కడ కూడా ఈ చిత్రానికి అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి.