
ఈ ఏడాది విడుదలైన పాన్ ఇండియన్ సినిమాలలో అతి పెద్ద హిట్ ఏది అంటే కళ్ళు మూసుకొని ‘కాంతారా’ పేరు చెప్పొచ్చు..కేవలం 15 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది..చరిత్ర లో బాక్స్ ఆఫీస్ వద్ద ఇలాంటి అద్భుతం ఎప్పుడు జరగలేదు..వాస్తవానికి ‘కాంతారా’ చిత్రం పాన్ ఇండియా సినిమాగా విడుదల అవ్వలేదు..కేవలం ఒక ప్రాంతీయ భాషా చిత్రం గా విడుదలైంది..కన్నడ లో ప్రభంజనం సృష్టించి సోషల్ మీడియా లో నెటిజెన్స్ అందరూ అద్భుతమైన రివ్యూస్ ఇవ్వడం తో ఈ సినిమాని తెలుగు మరియు తమిళం బాషలలో విడుదల చెయ్యడానికి దర్శక నిర్మాతలు పూనుకున్నారు..అలా కన్నడ లో విడుదలైన రెండు వారాల తర్వాత ఇతర ప్రాంతీయ బాషలలో విడుదలైంది..తెలుగు మరియు హిందీ బాషలలో ప్రభంజనం సృష్టించింది..టాలీవుడ్ లో 60 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రం బాలీవుడ్ లో వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసింది.
ఇక కర్ణాటక ప్రాంతం లో అయితే ఈ చిత్రం ఏకంగా బాహుబలి 2 మరియు KGF 2 రికార్డ్స్ ని కొల్లగొట్టింది..ఇది మాములు ఘనత కాదు..అలా విడుదలైన అన్ని భాషలకు కలిపి 400 కోట్ల రూపాయిల గ్రాస్ మరియు 230 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి చరిత్ర సృష్టించింది..అలాంటి ఈ చిత్రం ఈరోజు అర్థ రాత్రి నుండి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రాబోతుంది..బాక్స్ ఆఫీస్ వద్ద అనితర సాధ్యమైన రన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచినా కాంతారా చిత్రం OTT లో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకుంటుందా లేదా అనేది చూడాలి..సాధారణంగా కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచినా OTT లో చాలా సినిమాలు వరుకు సరిగా సక్సెస్ కానివి ఉన్నాయి..ఆ జాబితాలోకి ఈ సినిమా కూడా చేరుతుందా..లేదా థియేటర్స్ లో వచ్చిన రెస్పాన్స్ ని ఇక్కడ కూడా దక్కించుకుంటుందా అనేది చూడాలి.
విడుదలై 50 రోజులు పూర్తి చేసుకున్నా కూడా ఇప్పటికి ఈ చిత్రం పలు ప్రాంతాలలో డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతుంది..హిందీ లో అయితే ఇప్పట్లో రన్ ఆగేలా లేదు..వంద కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను అవలీలగా చేరుకుంటుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..కర్ణాటక లో కొత్త సినిమాల షోస్ సంఖ్య ప్రస్తుతం ఎంత ఉందొ..కాంతారా చిత్రం షోస్ కౌంట్ కూడా అంతే ఉంది..మరో వీకెండ్ మంచి వసూళ్లను రాబట్టే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా OTT లో విడుదల చేస్తున్నారు..దీనితో మరో మంచి వీకెండ్ ఈ సినిమాని మిస్ అయ్యిందని ట్రేడ్ వర్గాలు అనుకుంటున్నాయి..అయితే చాలా సినిమాలు వరుకు OTT లో వచ్చినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టాయి..కాంతారా కూడా అలాగే ఆడుతుందా లేదా అనేది చూడాలి.