
నందమూరి కళ్యాణ్‌రామ్ లేటెస్ట్ మూవీ బింబిసార ప్రస్తుతం బయ్యర్లకు మంచి లాభాలను తెచ్చిపెడుతోంది. ఈ మూవీ విడుదలైన తొలి మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించి నాలుగో రోజు నుంచే ఈ సినిమా కొనుగోలు చేసిన వారి కళ్లల్లో ఆనందాన్ని తెచ్చిపెట్టింది. కళ్యాణ్‌రామ్ కూడా చాన్నాళ్ల తర్వాత హిట్ కొట్టడంతో నందమూరి అభిమానులు జోష్‌లో కనిపిస్తున్నారు. అసలు ఈ ఏడాది నందమూరి అభిమానులకు గోల్డెన్ ఇయర్‌లా కనిపిస్తోంది. గత ఏడాది డిసెంబర్లో విడుదలైన అఖండతో ఈ ఏడాదిని గ్రాండ్‌గా ప్రారంభించిన నందమూరి కుటుంబం ఆ ఫ్లోను కొనసాగిస్తోంది. ఆర్.ఆర్.ఆర్ మూవీ లాంటి బిగ్గెస్ట్ మూవీ జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేయగా ఇప్పుడు కళ్యాణ్ రామ్ వంతు వచ్చినట్లు కనిపిస్తోంది. బింబిసార కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో నందమూరి అభిమానులు హ్యాట్రిక్ అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.
అయితే బింబిసార సినిమాలో కళ్యాణ్‌రామ్ డ్యూయల్ రోల్లో కనిపించాడు. బింబిసారుడిగా, దేవదత్తుడిగా రెండు పాత్రల్లో కళ్యాణ్‌రామ్ నటించాడు. అయితే తొలుత దేవదత్తుడి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్‌ను నటింపచేయాలని చిత్ర బృందం భావించినట్లు ఫిలింనగర్లో ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు బింబిసార మూవీలో గెస్ట్ రోల్ చేయాలని హీరో కళ్యాణ్‌రామ్ తన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్‌ను కోరగా అతడు తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ వరకు అయితే ఓకే కానీ ప్రేక్షకుల అటెన్షన్, పబ్లిసిటీ కోసం తనకు నటించడం ఇష్టం లేదని ఎన్టీఆర్ చెప్పినట్లు సమాచారం అందుతోంది. అయితే ఎన్టీఆర్ నటిస్తే ఈ మూవీకి మరింత హైప్ వచ్చేది. ఈ మాట అయితే వాస్తవం. అటు బింబిసార పాత్రను చూసి చాలా మంది జై లవకుశ మూవీలో ఎన్టీఆర్ జై పాత్రను గుర్తుచేసుకుంటున్నారు. బింబిసార మూవీలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ చేసి ఉంటే నందమూరి అభిమానులకు పండగలా ఉండేది.
కాగా బింబిసార మూవీని కళ్యాణ్‌రామ్ రూ.36 కోట్ల బడ్జెట్‌తో నిర్మించాడు. ప్రపంచ వ్యాప్తంగా తొలి మూడు రోజుల్లోనే ఈ వసూళ్లను సొంతం చేసుకుంది. రెండోవారంలోనూ బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ సంతృప్తికర వసూళ్లు రాబడుతోంది. దర్శకుడు మల్లిడి వశిష్టకు ఇది తొలి సినిమానే అయినా.. తన టేకింగ్‌కు, పాత్రలను మలిచిన విధానంకు సినీ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు. ఈ మూవీలో కేథరిన్, సంయుక్త మీనన్, వారినా హుస్సేన్ కథానాయికలుగా నటించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించాడు. కొన్ని పాటలకు చిరంతన్ భట్ కూడా మ్యూజిక్ అందించాడు. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలపై ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్‌రాజు క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా 50రోజుల తర్వాతే ఓటీటీలోకి రానున్నట్లు నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్‌రాజు క్లారిటీ ఇచ్చాడు. ఈ లెక్కన ఈ చిత్రం ఓటీటీలో సెప్టెంబర్ చివరి వారంలో విడుదలయ్యే అయ్యే అవకాశం ఉంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ-5 ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసింది.