
తెలుగు సినిమా ఇండస్ట్రీ స్వర్ణయుగానికి చెందిన మహానటులందరిని కోల్పోయింది..ఎన్టీఆర్ గారు , ANR గారు, కృష్ణ గారు , శోభన్ బాబు గారు కృష్ణం రాజు గారు ఇలా మొన్నటి తరం సూపర్ స్టార్స్ అందరిని మనం కోల్పోయి శోకసంద్రం లో మునిగిపోయాము..రెండు నెలల క్రితం కృష్ణం రాజు గారు చనిపోవడం..ఆయన పార్థివ దేహాన్ని కడసారి చివరి చూపు చూసుకొని కృష్ణ గారు కంటతడి పెట్టిన సంఘటనలను మనం ఇప్పటికి మరిచిపోకముందే కృష్ణ గారు ఈరోజు మరణించడం మన అందరిని శోకసంద్రం లోకి నెట్టేసింది..ఈ ప్రాణస్నేహితులిద్దరు ఒకేసారి స్వర్గానికి పయనమవుతారని కలలో కూడా ఎవ్వరు ఊహించలేదు..ఇలాంటి విషాద సందర్భం ని ఎదురుకుంటున్న అభిమానులు మరియు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇది తీరని లోటనే చెప్పాలి..వీళ్లిద్దరు ఇండస్ట్రీ కి కలిసి ఒకేసారి వచ్చారు..వీళ్ళ ప్రయాణం ఒకేసారి ప్రారంభమైంది..చివరికి వీళ్లిద్దరు కలిసి స్వర్గానికి ఒకేసారి పయనించారు..సుమారు 5 దశాబ్దాల ఈ ఇద్దరి మిత్రుల సుదీర్ఘ ప్రయాణం ఇలా ముగిసింది.
సూపర్ స్టార్ కృష్ణ గారు తేనెమనసులు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరో గా పరిచయం అయ్యాడు..ఆ సినిమాకి ఆడిషన్స్ జరిగిన సమయం కృష్ణం రాజు గారు కూడా పాల్గొన్నాడు..ఆ సమయం లో వీళ్లిద్దరి పరిచయం మొదలైంది..కృష్ణం రాజు గారు అదే సమయం లో చిలకా గోరింకా అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు..ఆలా వీళ్లిద్దరి సినీ ప్రయాణం మొదలైంది..కృష్ణ గారు హీరో గా కృష్ణంరాజు గారు విలన్ గా అప్పట్లో ఎన్నో సినిమాలు కలిసి చేసారు..కృష్ణంరాజు గారు హీరో గా సక్సెస్ అయినా తర్వాత కూడా కృష్ణ గారితో కలిసి పలు మల్టీస్టార్ర్ర్ చిత్రాల్లో నటించారు..అప్పటి నుండి వీళ్లిద్దరి కుటుంబాల మధ్య అత్యంత సాన్నిహిత్యం ఏర్పడింది..కృష్ణం రాజు గారు చనిపోయినప్పుడు కృష్ణ గారు మరియు మహేష్ బాబు గారు ఎంత ఎమోషనల్ అయ్యారో మన అందరం చూసాము..దానిని బట్టే చెప్పొచ్చు వీళ్లిద్దరి అనుబంధం ఎలాంటిదో..కృష్ణ మరియు కృష్ణం రాజు గారు కలిసున్న ఫోటోలు మీకోసం ఎక్సక్లూసివ్ గా కొన్ని క్రింద అందిస్తున్నాము చూడండి.
1
2
3
4