
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి విజృంభణ ఏ స్థాయిలో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.గడిచిన 6 నెలల నుండి ఎంతో మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న ఈ మహమ్మారి ని అరికట్టడానికి శాస్త్రవేత్తలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న విఫలం అవుతూనే ఉంది.ఈ ప్రపంచం లో ఉన్న అన్ని దేశాలు కరోనా కి వాక్సిన్ ని కనిపెట్టడానికి తీవ్రం గా శ్రమిస్తున్నాయి.ఎట్టకేలకు రష్యా దేశం కరోనా కి మొట్టమొదటి వాక్సిన్ ని కనిపెట్టింది.దీనిని తొలిసారి ఆయా దేశపు ప్రెసిడెంట్ పుతిన్ తన కుమార్తె పైన ప్రయోగించాడు.దాని ఫలితాలు సానుకూలంగా రావడం తో ఇది అతి త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ లోకి అందుబాటులోకి రానుంది.ఈ వాక్సిన్ వచ్చాక అయినా కరోనా మహమ్మారి విజృంభణ ఆగుతుందో లేదో చూడాలి.ఇది ఇలా ఉండగా ఈ అతి క్లిష్ట సమయం లో మన తెలుగు సినిమా హీరోలు వారికి తోచిన సహాయం చేసి రీల్ లైఫ్ లో కూడా హీరోలుగా నిలిచారు.మరి బాలీవుడ్ హీరోలు ఈ క్లిష్ట సమయం లో ఎంత విరాళాలు అందించారో ఎక్సక్లూసివ్ గా మీ కోసం ఈ కథనం లో తెలుపుతున్నాము
కరోనా కాలం లో దేవుడిలా దిగి వచ్చి సామాన్యుల అవసరాలను మరియు ఆకలి ని తీరుస్తున్న మహానుభావుడు ఎవడైనా ఉన్నదా అంటే అది సోను సూద్ అనే చెప్పాలి.రీల్ లైఫ్ లో విలన్ చేసే సోను సూద్ రియల్ లైఫ్ లో హీరో గా మారి ఎంతో మంది రీల్ లైఫ్ హీరోలకు ఆదర్శంగా నిలిచాడు.ఒక్కటా రెండా ఇతను కరోనా టైములో చేసిన సహాయాలు లెక్కించడానికి కూడా మనం చాలాము.కష్టమొస్తే రాష్ట్రానితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు సోను సూద్ అన్న మమల్ని కాపాడు అంటూ ఆయన ఇంటి తలుపులను కొడుతున్నారు.వలస కూలీలా దగ్గర నుండి పేద రైతుల వరుకు అందరూ ఇతని సహాయం పొందిన వారే.తానూ సంపాదించిన డబ్బుని మొత్తం పేద ప్రజల బాగు కోసం వాడాడు,ఇప్పటికి వాడుతూనే ఉన్నాడు. ప్రభుత్వానికి విరాళం అందించడమే కాకుండా స్వయంగా తన చేతులతో అవసరమైన వాళ్లకి సహాయం చేస్తూ ఇపొపతి వరుకు ఆయన 100 కోట్ల రూపాయిల వరుకు ఖర్చుపెట్టి ఉంటాడు అని అంచనా వేస్తున్నారు.కరోనా ఉన్నంత వరుకు నేను ఉంటాను అని అభయం ఇచ్చిన సోను సూద్ ఇప్పటికి తన సేవలను కొనసాగిస్తూనే ముందుకి పోతున్నాడు
ఇక సోను సూద్ తర్వాత బాలీవుడ్ కరోనా కోసం భారీ విరాళం అందించిన మరో హీరో అక్షయ్ కుమార్.ఈయన సుమారు 25 కోట్ల రూపాయిల వారుఇకు ప్రభుత్వానికి విరాళంగా అందించాడు.అక్షయ్ కుమార్ కి ఈ స్థాయి విరాళాలు ఇవ్వడం ఇదేమి కొత్త కాదు.దేశానికీ ఈలంటి విపత్తు వచ్చిన బొయిలీవుడ్ లో ముందుగా స్పందించి నేను ఉన్నాను అంటూ ముందుకి వచ్చి విరాళం అందించేది ఒక్క అక్షయ కుమార్ మాత్రమే.తన తోటి హీరోలకు కూడా ఆదర్శంగా నిలిచేలా ఈయన సేవ కార్యక్రమాలు ఉంటాయి.దేశం లో అత్యంత విరాళాలు అందించిన హీరోలలో అక్షయ కుమార్ నెంబర్ 1 గా నిలిచాడు.అంతే కాకుండా ఆయన అభిమానులు కూడా తమ హీరో ని ఆదర్శంగా తీసుకొని ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ శబాష్ అనిపించుకుంటున్నారు
మనకి బాలీవుడ్ అనే పేరు వినపడగానే మొట్టమొదట గుర్తు వచ్చే హీరో షారుక్ ఖాన్.ఈయన బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కి రారాజు లాంటి వాడు.ఇతను కూడా ఈ కరోనా సమయం లో ఎన్నో సేవలు చేసాడు.రోటి ఫౌండేషన్ అనే ప్రముఖ యెన్ జీ ఓ సంస్థ తో షారుక్ కహాన్ నడుపుతున్న యెన్ జీ ఓ టై అప్ అయ్యి పదివేల మంది నిరుపేదలకు మరియు వలస కూలీలకు ఉపయోగ పడే మూడు లక్షల మెటల్ కిట్లను ప్రతి నెల సరఫరా చేస్తున్నాడు.ఈయన ప్రబుత్వానివోకి ఎలాంటి విరాళం ఇవ్వకపోయినా నేరుగా అతని డబ్బు పేద ప్రజలకు చేరేందుకు స్వయంగా తన యెన్ జీ ఓ ద్వారా సహాయాలు చేస్తున్నాడు.ఈయనని చూసి అభిమానులు కూడా దేశ వ్యాప్తంగా నీరు పేద కుటుంబాలకు అవసరం అయ్యే నిత్యావసర సరుకులు వంటివి అందచేస్తూ హీరో కి తగ్గ అభిమానులం అని చాటి చెప్పుకుంటున్నారు
ఇక బాలీవుడ్ లో షారుక్ ఖాన్ కి సరిసమానం గా పోటీ ఇచ్చే హీరో సల్మాన్ ఖాన్.ఈయన సమాజ సేవ చెయ్యడం లో ఎంతో మందికి స్ఫూర్తి అని చెప్పడం లోయ లాంటి సందేహం లేదు.తన ఫౌండేషన్ ద్వారా లక్షలాది మందికి గుండె ఆపరేషన్లు చేయించిన మహా మనిషి ఈయన.కరోనా సమయం లో కూడా అదే స్థాయిలో సహాయం చేసాడు.ఈయన పోలీసులకు ఒక్క లక్ష సానీటిజన్లను విరాళం గా ఇచ్చాడు.అంతే కాకుండా సినీ కార్మికుల బాగోగుల కోసం మూడు విడతలుగా 21 కోట్ల రూపాయిలను విరాళంగా ఇచ్చి వారి పాలిట దేవుడిలా మారాడు.అంతే కాకుండా రోజు వారి కూలి పనులు చేసుకునేవారి కోసం కూడా ఈయన ఎంతో సహాయం చేసాడు.అంతే కాకుండా కరోనా అవేర్ నెస్ ప్రోగ్రాం ని అందరికి తెలియచేస్తూ ఈయన చేసిన ప్యార్ కరోనా అనే వీడియో ఎంతలా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈయన అభిమానులు కూడా తమ హీరో ని ఆదర్శంగా తీసుకొని ఎంతో మందికి సహాయం చేస్తూ పోతున్నారు
ఇక ఖాన్ త్రయం లో మరో అగ్ర కధానాయకుడు అమిర్ ఖాన్.తన సినిమాలతో ఎప్పుడు ఎదో ఒక్క సందేశం ఇచ్చే ఈ హీరో కరోనా సమయం లో కూడా అదే స్థాయిలో ఆపదలో ఉన్నవారికి సహాయపడ్డాడు.ఈయన ఎంత విరాళం అందిచాడో అధికారికంగా బయటకి చెప్పకపోయినా వివిధ సేవ సంస్థలకు భారీ మొత్తం మీద విరాళాలు అందించినట్టు సమాచారం.అంతే కాకుండా ప్రధాన మంత్రి రిలీఫ్ ఫండ్ కి మరియు మహా రాష్ట్ర ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కి భారీ మొత్తం మీద విరాళాలను ట్రాన్స్ఫర్ చేసినట్టు సమాచారం.అంతే కాకుండా తానూ ప్రస్తుతం నటిస్తున్న లాల్ చద్దా సింగ్ సినిమాకి పని చేసే సినీ కార్మికులకు కూడా భారీ ఎత్తున విరాళాలు అందించాడు