
మన తెలుగు సినిమా పరిశ్రమ లో ఉన్నటువంటి నటీనటులు ఏ ఇండస్ట్రీ లో కూడా ఉండరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..ముఖ్యంగా కమెడియన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి..మన దగ్గర ఉన్న కామెడీ టైమింగ్ పుష్కలంగా ఉన్న కమెడియన్స్ ఇండియా లో ఏ ఇండస్ట్రీ కి వెళ్లినా దొరకరు..కొంతమంది కమెడియన్స్ అయితే వారు సినిమాలో ఉన్నారు అని తెలిస్తే చాలు, కాసేపు చూసి నవ్వుకోవచ్చు అనే ఉద్దేశ్యం తో థియేటర్స్ కి వెళ్లే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువ..అలాంటి కమెడియన్స్ లో ఒకరే పృద్వి రాజ్..ఈయన ఎక్కువ 30 ఇయర్స్ పృద్వి గానే పిలవబడుతాడు..ఖడ్గం సినిమా లో ఈ డైలాగ్ తో ఆయన మంచి పాపులారిటీ ని సంపాదించారు..ఆ సినిమానే ఈయనకి పునర్జన్మ ఇచ్చింది అని చెప్పొచ్చు..అంతకు ముందు ఇండస్ట్రీ లో ఎన్నో ఏళ్ళ నుండి ఉంటున్నా రాణి గుర్తింపు పృద్వి కి ఈ సినిమా ద్వారా వచ్చింది..ఈ సినిమా తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు..వరుసగా సినిమాలు మీద సినిమాలు చేస్తూ టాప్ మోస్ట్ కమెడియన్స్ లో ఒకరిగా మారిపోయాడు..ఒకానొక్క దశలో పృద్వి రాజ్ కోసమే ప్రత్యేకంగా స్టోరీ లో స్కోప్ లేకపోయినా కూడా కామెడీ ట్రాక్ లు రాసేవారు దర్శకులు..ఇలా అంతకుముందు బ్రహ్మానందం , MS నారాయణ, సునీల్,అలీ వంటి కమెడియన్స్ కి జరిగాయి..వాళ్ళ తర్వాత ఆ రేంజ్ కి వెళ్ళింది మాత్రం పృద్వి గారే.
ఇది ఇలా ఉండగా పృద్వి రాజ్ గారి కూతురు స్రీలు ఇప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ గా అతి త్వరలోనే వెండితెర మీద సందడి చేయబోతుంది..ఈ సినిమాకి సంబంధించిన ఓపెనింగ్ కార్యక్రమాలు కూడా గత ఏడాది జరిగింది..చిరంజీవి కుంచల్ అనే నూతన నటుడు ఈ సినిమా ద్వారా హీరో గా పరిచయం కానున్నాడు..సర్దార్ సుర్జీత్ సింగ్ ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నాడు..అయితే ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్ కి పృద్వి రాజ్ హాజరు కాకపోవడం అప్పట్లో పెద్ద వివాదానికి దారి తీసింది..తానూ ఎంతో కస్టపడి పెంచి పెద్ద చేసిన కూతురు ఈరోజు సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ గా అడుగుపెట్టబోతుంటే కనీసం ఆశీర్వాదం ఇవ్వడానికి కూడా ఆయన రాకపోవడం ఏంటి అని సోషల్ మీడియా లో అప్పట్లో పృద్వి రాజ్ పై నెటిజెన్స్ విరుచుకుపడ్డారు కూడా..అయితే నేను కుటుంబానికి సంబంధించిన ఈవెంట్స్ కి గత కొద్దీ కాలం నుండి దూరంగా ఉంటున్నాను అని..నా కూతురు అంటే నాకు ఎంతో అభిమానం అని..సినిమా షూటింగ్ ప్రారంభించే ముందు కూడా నా ఆశీర్వాదం తీసుకునే అక్కడకి వచ్చింది అంటూ పృద్వి రాజ్ అలీ తో సరదాగా ప్రోగ్రాం లో చెప్పుకొచ్చాడు..ఇది ఇలా ఉండగా పృద్విరాజ్ గారి కూతురు స్రీలు కి సంబంధించిన కొన్ని ఫోటోలు ఎక్సక్లూసివ్ గా మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
1
2
3
4
5
6
ఇది ఇలా ఉండగా పృద్వి రాజ్ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించిన సంగతి మన అందరికి తెలిసిందే..2019 సార్వత్రిక ఎన్నికలలో ఆయన వైసీపీ పార్టీ తరుపున విస్తృతంగా ప్రచారం చేసాడు..జగన్ అతను పార్టీ కోసం చేసిన సేవలను దృష్టిలో తీసుకొని అధికారం లోకి రాగానే పృద్వి రాజ్ గారిని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ పదవి ని అప్పజెప్పారు..కొన్ని ఏళ్ళు మంచిగానే చైర్మన్ గా కొనసాగాడు..అయితే ఆ తర్వాత పృద్వి రాజ్ కి సంబంధించిన కొన్ని శృంగారపు ఆడియో టేపులు బయటపడి ఆయన చైర్మన్ పదవి కి రాజీనామా చేసేలా చేసింది..ఇక అప్పటి నుండి పృద్వి రాజ్ వైసీపీ పార్టీ కి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కి మద్దతుగా మాట్లాడుతున్నారు..జనసేన పార్టీ పై మరియు పవన్ కళ్యాణ్ పై పృద్వి రాజ్ గతం లో ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..అందుకే ఇప్పుడు ఆయన జనసేన పార్టీ తరుపున నిలబడి మాట్లాడుతున్న కూడా ఎవ్వరు ఆయనని పార్టీ లోకి ఆహ్వానించడం లేదు..భవిష్యత్తులో అయినా ఆహ్వానిస్తారో లేదో చూడాలి..అయితే పవన్ కళ్యాణ్ నన్ను పార్టీ లో పిలిచినా పిలవకపోయినా ఆయన జెండా పట్టుకొని ఎన్నికల సమయం లో తనవంతు గా ప్రచారం చేస్తా అని చెప్పుకొచ్చారు పృద్వి రాజ్.