
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం గర్వించదగ్గ నటులలో ఒకరు కమల్ హాస్సన్..ఆయన పోషించినన్ని పాత్రలు చరిత్రలో ఇప్పటి వరుకు చెయ్యలేదు..నటుడిగా ఆయన అందుకునాన్ని అవార్డులు కూడా ఎవ్వరు అందుకోలేదు..బాలనటుడిగా కెరీర్ ని ఆరంభించిన కమల్ హాసన్ ఆ తర్వాత హీరో గా ఎదిగి నటుడు అనే పదానికి పర్యాయపదం లాగ మారిపోయాడు ఆయన..రీసెంట్ గానే ఆయన విక్రమ్ సినిమాతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ని ఒక్క ఊపు ఊపేసాడు..లోకేష్ కనకరాజ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం సుమారుగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది..70 ఏళ్ళ వయస్సు లో కూడా కుర్ర స్టార్ హీరోలకు సాధ్యమైన ఈ రేర్ రికార్డ్ ని కమల్ సాధించడం చూస్తే జనాల్లో ఆయనకి ఉన్న బ్రాండ్ ఇమేజి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు..నటుడిగా మరియు అతి పెద్ద సూపర్ స్టార్ ఇంత ఉన్నత శిఖరాలను అధిరోహించిన కమల్ హాసన్ వ్యక్తిగత జీవితం మాత్రం ఎవ్వరికి నచ్చదు.
ఎందుకంటే ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు..ముగ్గురితో ప్రస్తుతం కలిసి లేదు..గత కొద్ది సంవత్సరాల నుండి పూజ కుమార్ అనే హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడని కోలీవుడ్ వర్గాల్లో వినిపించే వార్త..కమల్ హాసన్ తనకి 24 వయస్సు ఉన్నప్పుడు వాణి గణపతి అనే అమ్మాయిని పెళ్లాడాడు..కొన్నేళ్లు ఆమెతో దాంపత్య జీవితం గడిపిన తర్వాత తన తో పాటు పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన శారికా ని పెళ్లాడాడు..ముందుగా వీళ్ళు చాలా కాలం డేటింగ్ లో ఉన్నారు..పెళ్లి కాకముందే శృతి హాస్సన్ కి జన్మనిచ్చారు..ఇక కోలీవుడ్ మొత్తం విమర్శలు రావడం వస్తుండడం తో వాణి గణపతి కి విడాకులు ఇచ్చి శారికా ని పెళ్లాడాడు..కొనేళ్లు వీళ్ళ దాంపత్య జీవితం సజావుగానే సాగింది..కానీ కమల్ హాసన్ ఆ తర్వాత తనతో పాటు కలిసి నటించిన సిమ్రాన్ ప్రేమలో పడ్డాడు..ఈ వార్త అప్పట్లో కమల్ హాసన్ పై తీవ్రమైన విమర్శలు వచ్చేలా చేసాయి..మీడియా హోరెత్తిపోయ్యేలా చేసింది.
అందరితో పాటు ఆ విషయం శారికా గారికి తెలిసింది..కమల్ హాస్సన్ తన లోకం..తన సర్వస్వం అనుకొని బ్రతుకుతున్న ఆమె ఈ విషయాన్నీ జీర్ణించుకోలేకపోయింది..భర్త మీద ఉన్న ప్రేమతో అన్నీ సర్దుకొని పోవడానికి ఆమె ప్రయత్నం చేసింది..కానీ ఎంత ప్రయత్నం చేసిన కమల్ హాస్సన్ ని తన దారిలోకి తెచుకోలేకపోయింది..ఒకరోజు ఇంట్లో ఎవ్వరు లేని సమయం లో బాల్కనీ మేడ నుండి దూకేసి ఆత్మహత్యాయత్నం చేసింది..వెనుముక విరిగి మూడేళ్లు మంచాన పడింది..అయినా కూడా కమల్ హాస్సన్ కి ఆమె మీద జాలి కలగలేదు..ఇక ప్రేమ లేని వ్యక్తి తో మెలగడం కష్టమని 2004 వ సంవత్సరం లో కమల్ హాసన్ కి విడాకులు ఇచ్చింది..కానీ ఆ తర్వాత ఆయన సిమ్రాన్ తో కూడా కొన్నేళ్ల తర్వాత విడిపొయ్యాడు..అలా కమల్ హాసన్ వ్యక్తిగత జీవితం వివాదాలతోనే నిండిపోయింది.