
కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అద్భుతమైన టీజర్ మరియు ట్రైలర్ తో అంచనాలను విడుదల కి ముందే ఒక్క రేంజ్ లో పెంచేసిన ఈ సినిమా విడుదల తర్వాత ఆ అంచనాలను అందుకోవడం లో నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యింది..దశావతారం సినిమా తర్వాత కమల్ హాసన్ కి ఆ స్థాయి సెన్సషనల్ హిట్ అంటే అది విక్రమ్ సినిమానే..ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తెలుగు, తమిళం , మలయాళం మరియు కన్నడ భాషలకు కలిపి ప్రపంచవ్యాప్తంగా 110 కోట్ల రూపాయలకు జరిగింది..కమల్ హాసన్ కెరీర్ లో ఇది భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమా..జరిగిన ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తం కేవలం మూడు రోజుల్లోనే వసూలు చేసింది..మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి దాదాపుగా 112 కోట్ల రూపాయిల షేర్ ని సొంతం చేసుకుంది..ఈ స్థాయి వసూళ్లను బహుశా కమల్ హాసన్ కూడా ఊహించి ఉండదు.
కేవలం వీకెండ్స్ లో మాత్రమే కాదు..వీక్ డేస్ లో కూడా ఈ సినిమా ఇరగదీసింది..ఒక్క తమిళం లో మాత్రమే కాదు..తెలుగు మరియు మలయాళం బాషలలో కూడా అదే స్థాయి స్థిరమైన వసూళ్లను మైంటైన్ చెయ్యడం అందరిని షాక్ కి గురి చేసిన విషయం..మొదటి వారం లో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 250 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రం..పది రోజులకు గాను 320 కోట్ల రూపాయిల గ్రాస్ మరియు 170 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి తమిళనాడు లో ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచే దిశగా దూసుకుపోతుంది..అంటే ఈ సినిమా కేవలం పది రోజుల్లోనే 65 కోట్ల రూపాయిలు లాభాల్ని ఆర్జించింది అన్నమాట..ఈ లాభాల వర్షం ఇక్కడితో ఆగేది కాదు..ఫుల్ రన్ ఇంకా ఉంది..ఎన్ని కొత్త సినిమాలు వారానికి ఒక్కటి విడుదల అవుతున్న కూడా విక్రమ్ మేనియా ముందు నిలబడలేకపోతున్నాయి.ఇక ఈ సినిమాకి కమల్ హాసన్ నిర్మాతగా కూడా వ్యవహరించిన సంగతి మన అందరికి తెలిసిందే.
చాలా కాలం క్రితమే కమల్ హాసన్ రాజ్ కమల్ ఇంటెర్నేషనల్స్ అని ఒక్క సంస్థ ని నిర్మించిన సంగతి మన అందరికి తెలిసిందే..కానీ బాడ్ లక్..ఈ సంస్థ నుండి ఇప్పటి వరుకు విడుదలైన ఒక్క సినిమా కూడా సక్సెస్ సాధించలేకపోయింది..మధ్యలో విశ్వరూపం సినిమా సూపర్ హిట్ అయ్యినప్పటికీ..పార్ట్ 2 మాత్రం డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది..పార్ట్ 2 ని నిర్మించడం కోసం కమల్ హాసన్ తన ఆస్తులను సైతం తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది..ఇలా ఎన్నో ఒడిదుడుగులను ఎదుర్కుంటున్న సమయం లో ఏ మాత్రం కూడా ఆత్మా విశ్వాసం కోల్పోకుండా విక్రమ్ సినిమాని నిర్మించాడు కమల్ హాసన్..ఇక ఆ తర్వాత హిస్టరీ మన అందరికి తెలిసిందే..కమల్ హాసన్ ముఖం లో ఇంత ఆనందం ని మనం ఎప్పుడు కూడా ఇది వరుకు చూడలేదు అనే చెప్పాలి..సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికి రెమ్యూనరేషన్స్ తో పాటుగా విలువైన కార్లు..బైకులు బహుమతిగా ఇచ్చాడు..ఇక ఈ సినిమా లో తళుక్కుమని అతిధి పాత్ర లో నటించిన తమిళ స్టార్ హీరో సూర్య కి రోలెక్స్ వాచీ ని బహుమతిగా ఇచ్చాడు.