
సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో లెజెండ్స్ అంటే మనకి గుర్తుకు వచ్చే నలుగురు హీరోల పేర్లలలో కచ్చితంగా కమల్ హాసన్ మరియు మెగాస్టార్ చిరంజీవి గారి పేర్లు ఉంటాయి..వుబ్బినమైన పాత్రలతో అంచలంచలుగా ఎదుగుతూ దేశం గర్వించ దగ్గ నటుల జాబితా లో చేరిన దిగ్గజాలు వీళ్ళు..అందుకే ఆరు పదుల వయస్సు దాటినా కూడా ఇప్పటికి ఈ ఇద్దరు హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద తమ సత్తాను చాటుతూ కుర్ర హీరోలకు పోటీని ఇస్తున్నారు..వీళ్ళ నటన అనుభవం అంత వయస్సు కూడా నేటి తరం స్టార్ హీరోలకు లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..రాజకీయాల్లో దెబ్బ తిన్నప్పటికీ , సినిమాల పరంగా ఈ ఇద్దరి హీరోల ఇమేజి ఏ మాత్రం చెక్కు చెదరలేదు అనే దానికి ఉదాహరణగా నిలిచినా సినిమాలు ఖైదీ నెంబర్ 150 మరియు ఇటీవల విడుదల అయినా విక్రమ్..ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ ఇద్దరి హీరోల స్టామినా ఎలాంటిదో మరోసారి నేటి తరం వారికి కూడా రుచి చూపించారు..అలాంటి ఈ లెజెండ్స్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
కెరీర్ ప్రారంభం లో ఈ ఇద్దరు హీరోలు కలిసి పలు సినిమాల్లో నటించారు..కానీ స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత ఈ ఇద్దరు కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు..వ్యక్తిగతంగా ఈ ఇద్దరు హీరోలు సోదరభావం తో సమానమైన రిలేషన్ మైంటైన్ చేస్తున్నప్పటికీ కూడా ఎందుకో వీళ్ళ స్టార్ స్టేటస్ కి తగ్గ కథలను సిద్ధం చెయ్యడం లో డైరెక్టర్స్ సాహసం చెయ్యలేదు..అయితే త్వరలోనే ఈ డ్రీం కాంబినేషన్ సెట్స్ మీదకి రానుంది అని తెలుస్తుంది..కమల్ హాసన్ నిర్మాతగా .మెగాస్టార్ చిరంజీవి హీరో గా ఒక్క సినిమా రానుంది అని గత కొంత కాలం నుండి సోషల్ మీడియా లో ఒక్క వార్త తెగ ప్రచారం అవుతుంది..అయితే ఇదే విషయం ని ఇటీవల విక్రమ్ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఆంధ్ర కి వచ్చిన కమల్ హాసన్ ని కొన్ని ఇంటర్వూస్ లో ఈ వార్తని ఆయన దృష్టికి తీసుకొని రాగ..’ప్రస్తుతం అలాంటి ప్లాన్స్ చిరంజీవి గారితో ఏమి చెయ్యలేదు..కానీ నా తమ్ముడితో సమానం అయినా చిరంజీవి గారితో సినిమాలు నిర్మించడం నా అదృష్టం గా భావిస్తాను..మంచి కథ తో ఏ దర్శకుడు అయినా ముందుకు వస్తే కచ్చితంగా మేము ఇద్దరం కలిసి పని చేస్తాము’ అంటూ చెప్పుకొచ్చారు కమల్ హాసన్ గారు.
ఆయన హీరో గా నటించిన విక్రమ్ సినిమా ఇటీవలే అన్ని బాషలలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల తుఫాను సృష్టిస్తుంది..కమల్ హాసన్ ఈ స్థాయి హిట్ కొట్టి చాలా కాలమే అయ్యింది అని చెప్పొచ్చు..ప్రస్తుతం ఆయన బాక్స్ ఆఫీస్ రికార్డుల వేట ఎలా ఉంది అంటే పది సంవత్సరాల నుండి తిండి తిప్పలు లేక ఆకలి తో అలమటిస్తున్న ఒక్క సింహం..కుప్పలు తెప్పలు గా జంతువులు ఉన్న అడవిలోకి ప్రవేశిస్తే వేట ఎలా ఉంటుందో అలా ఉంది అని చెప్పాలి..మొదటి రోజు 50 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టింది..ఫుల్ రన్ లో ఈ సినిమా రన్ అల్ టైం టాప్ 5 లిస్ట్ లో ఉండే అవకాశం ఉంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..తెలుగు లో కూడా ఈ సినిమాకి కాసుల కనకవర్షం కురుస్తుంది..కమల్ హాసన్ తెలుగు లో ఈ స్థాయిలో కలెక్షన్స్ వచ్చి చాలా కాలమే అయ్యింది అని చెప్పొచ్చు..చూడాలి మరి విక్రమ్ బాక్స్ ఆఫీస్ వేట ఎంత వరుకు కొనసాగుతుంది అనేది.