
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా నిన్న జల్సా సినిమా స్పెషల్ షోస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఘనంగా ప్లాన్ చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ షోస్ బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టించిన ప్రకంపనలు మామూలువి కాదు..ఒక్క మాట లో చెప్పాలంటే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేసింది..అమెరికా నుండి అనకాపల్లి వరుకు ఈ సినిమా స్పెషల్ షోస్ సృష్టించిన ప్రభంజనం గురించి ఎంత చెప్పిన అది తక్కువే అవుతుంది..కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు అనే డైలాగ్ కి నూటికి నూరు పాళ్ళు న్యాయం చేసిన సినిమా ఇది..ఇక ఓవర్సీస్ లో అయితే ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి ఒక్క మాట లో చెప్పలేము..ఈరోజు విడుదలైన కొత్త సినిమాలకంటే కూడా అత్యధిక వసూళ్లను రాబట్టింది ఈ సినిమా..అంతే కాదు..ఈ సినిమా రాజమౌళి తెరకెక్కించిన #RRR ని కూడా దాటేయడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపొయ్యేలా చేసింది.
ఇక అసలు విషయానికి వస్తే #RRR విడుదలైన కొన్ని రోజుల మళ్ళీ #encoRRRe అనే పేరు తో రీ రిలీజ్ చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..రీ రిలీజ్ లో కూడా ఈ సినిమా USA బాక్స్ ఆఫీస్ ని దుమ్ము దులిపేసింది..అయితే ఈ సినిమా మొదటి రోజు కేవలం 30 వేల డాలర్లు మాత్రమే వసూలు చేసింది..కానీ జల్సా సినిమా రీ రిలీజ్ లో మొదటి రోజు అక్షారాలా 37 వేల డాలర్లను వసూలు చేసి సెన్సేషన్ సృష్టించింది..జల్సా సినిమా ని అభిమానులు పవన్ కళ్యాణ్ కెరీర్ లో పెద్ద హిట్ గా చెప్పుకోరు..అప్పట్లో ఈ సినిమా ఎన్నో రికార్డ్స్ ని తిరగరాసి ఆల్ టైం టాప్ 2 చిత్రంగా నిలిచింది..కానీ కంటెంట్ పరంగా ఇది చెప్పుకోదగిన రేంజ్ సినిమా కాదని పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఫీలింగ్..అలాంటి సినిమా రీ రిలీజ్ చేస్తేనే ఇంతతి ప్రభంజనం సృష్టించింది అంటే..పొరపాటున ఆయన కెరీర్ లో మైలు రాయిగా నిలిచినా ఖుషి సినిమాని రీ రిలీజ్ చేస్తే పరిస్థితి ఏమిటి అని ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.
ఇక జల్సా 4K కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు..విడుదలైన కొత్త సినిమాలు కూడా థియేటర్స్ కాళీగా ఉండడం తో జల్సా సినిమాని వేసుకోడానికి అమితాసక్తిని చూపిస్తున్నారు థియేటర్స్ ఓనర్స్..ముఖ్యంగా హైదరాబాద్ సిటీ లో అయితే ఈ సినిమాని ఒక జాతరలాగా చూస్తున్నారు..ఇప్పటికే ఈ సినిమాకి మొదటి రోజు హైదరాబాద్ సిటీ లో 90 లక్షల రూపాయిల గ్రాస్ వచ్చింది..డిమాండ్ విపరీతంగా ఉండడం తో రెండవ రోజు కూడా హైదరాబాద్ సిటీ లో 15 షోలు వెయ్యగా 15 షోలు కూడా హౌస్ ఫుల్ గా నిలిచాయి..డిమాండ్ విపరీతంగా ఉండడం తో ఈ వీకెండ్ మొత్తం కూడా ఈ సినిమాని కొనసాగించడానికి చూస్తున్నారు డిస్ట్రిబ్యూటర్స్..అదే కనుక జరిగితే జల్సా స్థాయి ప్రభంజనం భవిష్యత్తులో ఏ సినిమా కూడా సృష్టించలేదు అనే చెప్పాలి..చూడాలి మరి ఈ సినిమా ఊపు ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.